అడ్డంగా నువ్వు బుక్కయ్యావా... | Raja Gautam brahma anandam second single village song out | Sakshi
Sakshi News home page

అడ్డంగా నువ్వు బుక్కయ్యావా...

Published Tue, Jan 28 2025 12:02 AM | Last Updated on Tue, Jan 28 2025 12:02 AM

Raja Gautam brahma anandam second single village song out

బ్రహ్మానందం(brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్‌(Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ హీరోయిన్లు. సావిత్రి, ఉమేష్‌ కుమార్‌ సమర్పణలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని రెండో సాంగ్‌ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విడుదల చేశారు.

సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటని రామ్‌ మిరియాల పాడారు. ‘అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా.. ఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యావా... గురిచూసి బాగా దెబ్బేశాడా నిన్నే తాతయ్యా...’ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, సంపత్‌ రాజ్, రాజీవ్‌ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: మితేష్‌ పర్వతనేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్‌ రావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement