ఆసక్తి రేకెత్తించేలా ‘మను’ ట్రైలర్‌ | Raja Gautam Manu Trailer Released | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 12 2018 6:37 PM | Last Updated on Sun, Aug 12 2018 6:45 PM

Raja Gautam Manu Trailer Released - Sakshi

చిన్న సినిమాను, ప్రచారం అంతగా లేని సినిమాను అందరూ చిన్న చూపు చూస్తారు. కానీ ఒక్కసారి ఆ సినిమా తన స్టామినాను చూపిస్తే.. అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. ‘మను’ చిత్రం కూడా అలాంటిదే. ట్రైలర్‌ వచ్చే వరకు కూడా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. వినూత్న ప్రచారాలు చేసినా సినిమాకు హైప్‌ రాలేదు. 

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ ఈ మూవీ గురించి మాట్లాడేలా చేస్తోంది. చాలా రోజుల తరువాత గౌతమ్‌ మళ్లీ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఎక్కువ క్యారెక్టర్స్‌ లేకుండా పరిమిత పాత్రలతోనే సినిమాను నడిపించినట్లు కనిపిస్తోంది. షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. గతంలోకూడా హీరోయిన్‌గా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. నిర్వాణ సినిమాస్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement