manu
-
‘క్రేజీ అంకుల్స్’తో వస్తున్న శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె ట్రైలర్ విడుదలైంది. కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని చేసింది చిత్ర యూనిట్. ఇక క్రేజీ అంకుల్స్ సినిమాపై యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ..సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు అని తెలిపింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో క్రేజీ అంకుల్స్ సినిమాను కూడా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అని నటుడు రాజా రవీంద్ర అన్నాడు. -
హెచ్‌సీయూ @2
రాయదుర్గం(హైదరాబాద్): నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ పొందింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్‌సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ‘మనూ’కు 24వ స్థానం ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా ర్యాంకింగ్స్– 2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ). జాబితాలో ‘మనూ’ 24వ స్థానం పొందింది. మొత్తం 1,000 స్కోరుకు గాను 436.88 సాధించింది. ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం.. దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండో స్థానం పొందడం గర్వంగా ఉంది. ఇది సమష్టి కృషికి నిదర్శనం. వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందడంతోనే మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు కలసి కృషి చేస్తే సాధించలేనిది లేదు. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ ఉపకులపతి. -
పార్శిల్
ఎవరూ? అమెజాన్ నుంచి పార్శిల్ మేమ్... ఓహ్....... ఉండు.... తను బిల్ తీసుకుంటూ....‘అసలు శనివారం డెలివరీ మేమ్. టూ డేస్ ముందే ఇచ్చేశాం చూశారా!’ చిన్న గర్వపు నవ్వుతో చెప్పి వెనుదిరిగాడు. నాకపుడు తెలిస్తేగా... నా ‘ఆ’ ప్రయాణం రెండురోజులు ప్రీ పోన్ అయిందనీ, అతను చింపి ఇచ్చింది దాని తాలూకూ ‘చెల్లు చీటీ’ అనీనూ. నా ఏకైక పుత్రుడికి నేనివ్వబోతున్న పుట్టినరోజు కానుకిది... వాడు మా ఇద్దరి బర్త్ డేలకీ ఏదో సర్ర్పైజ్ ప్లాన్ చేస్తాడెపుడూ. మా ఆఫీసుల్లో తనకు చనువున్న ఆంటీతోనో అంకుల్తోనో కుమ్మౖకై వీడి సర్ర్పైజ్ ప్లాన్లు అమలుచేయించి మమ్మల్ని ఆశ్యర్యపరచటం అలవాటు. మరి నేనూ వాడికివ్వాలిగా... ఎంతో కొంత సర్ర్పైజ్! అందుకే ఇది ఆర్డరు పెట్టా. కానీ ఆ గిఫ్ట్ ఓ జీవితకాలపు సర్ర్పైజ్ తిరిగి నాకే ఇవ్వబోతుందని తెలియటానికి నాకో ఆరుగంటల టైం పట్టింది. టెన్త్ నుంచే సెల్‌ఫోన్ కొనమని నస మొదలుపెట్టినా సునీలూ, నేనూ ఒకే మాట మీదుండి తర్వాత చూద్దాం అంటూ గడిపేశాం. ఇంటర్ మధ్యలో మళ్ళీ యాగీ మొదలుపెట్టేసరికి నువు బాగా చదివి నైన్ పాయింట్స్ తెచ్చుకో కొంటానని మాట ఒదిలేశాడు సునీల్. ‘ఏడ్చినట్టుంది వాడికి ఆ కెపాసిటీ ఉంది. అది కాస్తా తుంగలో కలుపుద్దనేగా సెల్ ఒద్దనేది.. ఇంటర్ పూర్తి చేయనీ అనలేవా సునీల్?’ అని తను మొత్తుకుంది. అందరికీ ఉంది మమ్మీ క్లాస్‌లో... ఈ కష్టం పగోడిక్కూడా రాకూడదన్నంత ‘ఫీల్’తో ముఖం మాడ్చుక్కూర్చున్నాడు. ఇక సునీలెక్కడ ఆగుతాడూ... వెంటనే సెల్‌ఫోన్ రెడీ! తనకి సమకూర్చడమే తెలుసు గానీ కంట్రోల్ చేయడం తెలీదు. మా సుపుత్రుడు ముఖానికి దాన్ని అమర్చుకుని, సెల్లుకు సొంత కవల సోదరుడిలాగా తిరగటం మొదలెట్టాడు. ఎదురుగా నించొని ఏదైనా మనం అడుక్కోవచ్చు. మరేదైనా చెప్పుకోవచ్చు. వాడు మాత్రం అందులోంచి తలెత్తేదే లేదు. ఊ...ఊ..అనటమే. కదిలేదే లేదు. చివరకు టాయిలెట్లోక్కూడా తీసుకుపోతుంటే సహించలేక నాలుగు పద్ధతైన తిట్లు తిట్టాగానీ అవి కూడా సెల్లు దాఖలా అయిపోయాయ్. నా ఎనర్జీ వేస్ట్ అని తెలిశాక వాడిని మానేసి మా గదిలో మేం ఇద్దరం తిట్టుకునేవాళ్ళం. ‘కష్టపడి ఇల్లుకట్టి కల్లుతాగి కూలగొట్టాడట ఎవడో నీలాగే ఏం ఫోన్లో ఏంటో’ అని సునీల్‌ని సతాయించేదాన్ని. ఓ నెల కాగానే వాడికి సైటు కళ్ళద్దాలు సమకూర్చి పెట్టింది తన బాధ్యతగా ఫోను. వీడికి క్రమంగా వినే అలవాటు పోతే డిగ్రీ ఎలా పూర్తి చేస్తాడూ? అని నాకొకటే దిగులు. బాగా ఆలోచించి ‘ఇది’ ఆర్డరు పెట్టానందుకే! నాకర్థం అయిపోయింది ఇక నా ప్రాణం పోక తప్పదనీ...మూడు బారల దూరంలో అటుతిరిగి కూర్చున్న ముద్దుల కొడుకు తనను ‘చెవులారా’ సాగనంపబోతున్నాడనీనూ. ‘అరే నాన్నా’ వినపడదు పాపం! పొద్దున్నుండి చూస్తున్నదేగా తంతు. కళ్ళు మూసుకుని తలూపుతూంటాడంతే. అబ్బా.. గుండెలపై చేతితో గట్టిగా అదుముకున్నా... అయ్యో..సాయంత్రం మేనకోడలి పెళ్లికి వెళ్ళాలే. ఇక అంతా ఇటే వస్తారేమో! ‘ఒరేయ్...బాబూ...డ్రెస్సింగ్ టేబుల్లోంచి నాలుక కింది మాత్తర్లు తీసీయరారేయ్... అబ్బా....ప్రాణం పోయేట్టుందిరా....నేను నా కంటే నీకే ఎక్కువ అవసరంరో’...ఊ....మ్. నాలో నేనా...పైకా నేను మాట్లాడుతుంటా?! ఏమో. ‘ఒరేయ్..సన్యాసి..ఒక్కసారి ఇటు చూడ్రా’.. బలహీనమైన గొంతు... బలహీనమైన ఆలోచనలూ. బలవంతంగా లేచే ప్రయత్నం.. అబ్బే...ఉహూ... ఇందాకటి వరకూ ఆ అద్దం దగ్గరే కదా చచ్చానూ..ఏ మాత్రం చేయిలాగినా బిళ్ళ చప్పరిద్దునే. నోట్లో నిజంగా మందుబిళ్ళ స్పర్శ...ఒళ్ళు తేలిపోతుందేవిటీ...ఓహో పిల్లాడు చేతులపై ఎత్తుకుని అంబులెన్స్ ఎక్కిస్తున్నందుకా....హమ్మయ్య సేఫబ్బా నేను...ఎంతైనా మా వాడుకూడా నాలాగే వెంట వెంటనే స్పందించి నిర్ణయాలు తీ...సు...కు...ని....అరె..మా సీలింగ్ ఫేన్ నా ముఖం మీదికొచ్చి మరీ తిరుగుతుందెందుకూ. నిజమా...కలా..ఊహా...ఆశా...తెలీలా... ఇంకా ఇక్కడే ఉన్నానేంటీ? హూ... సాయంత్రం నా చుట్టూ చేరి వంటచేసి, నడుం వాల్చి హాయిగా నిద్రలోనే వెళిపోయిందంటమ్మా...ఎంత గొప్ప చావో! అని చెప్పుకుంటారైతే అంతా. ఔను.. వంటచేసే పోవటం...గొప్పేగా మరి.. ఏడుపు నిండిన నవ్వు వచ్చింది. ఆఖరి ప్రయత్నంగా మోచేతిపై లేచే ప్రయత్నం చేస్తూ...చేతికి దొరికిన రిమోట్ వాడికి విసురుదామను...కుంటూండ...గానే...రెండు నిమిషాలు కుదిపేసి జాలీగా భుజాలెగరేసుకుంటున్న కొడుకుని కళ్ళనిండా ‘జాలి’గా చూస్తూండగా....పోయింది.. ఎన్నిటికోసమో ప్రాకులాడిన ప్రాణం! పరుగులెత్తిన ప్రాణం! పిల్లల మీద పెట్టిన ప్రాణం...పువ్వులనీ, పుస్తకాలనీ, భానుమతనీ, శ్రీ శ్రీ అనీ, వెన్నెల్లో ఆడపిల్లా, అమావాస్య చంద్రుడూ... ఎన్నింటినో ప్రేమించిన ప్రాణం...ఆఖరుసారి అంతులేని నిస్సత్తువనూ, నొప్పినీ కలిగించి, తెలియని తీరాలకై వేగంగా బయటపడింది. కోడలితో, మనుమలతో పరిచయం లేకుండానే... వియ్యపోళ్ళని చూడకుండానే... కొడుకు పెళ్లికి పట్టుచీర రెప రెపతో సందడిగా సంతోషంగా తిరగకుండానే...పో..యిం...ది. అరె... ఎంతఖాళీ ఎంత తీరికెంత శాంతీ! ఊహ తెల్సాక ఇంత పనిలేకుండా ఎన్నడూ లేను. ఎత్తులో కూర్చొని కాళ్ళూపుకుంటూ అదే గదిలో ఉన్నా. నా నిర్జీవదేహం మంచంపై పడుంది. కర్రవాటు దూరంలో వాడింకా తలూపుతూ అలాగే కూర్చుని ఉన్నాడు. ఎంజాయ్ చేస్తూ. ఐనా నాకు బుద్ధుండాలి...బర్తడే గిఫ్ట్... బర్త్ డేకివ్వాలిగానీ ముందే చూపిస్తే వీడాగే రకమా?! ఎంజాయ్మెంట్ అంతుచూస్తూ అమ్మ ‘అంత’ మయేది చూడకుండానే కూర్చున్నాడు. ఒక్కసారిగా నాలో బాధ.. ఇపుడొకసారి పోయి ‘దీన్ని’ కనిపెట్టినోడిని రెండు పీకివస్తేనో.. మొన్న వీటిని ధరించి వినపడక రైలు పట్టాలు దాటుతా చనిపోయిన ఒక్కగానొక్క రమగారి పిల్లాడు గుర్తొచ్చాడు. వీడినీ, మా వెధవనీ కూడా పన్లోపని రెండు పీకుతా.. ఎలాగూ కనపడను గాబట్టి. వావ్..మా ఎదవ లేచాడు. ఇప్పుడదిరి, బెదురుతాడు చూడూ...పాపం పిచ్చికన్న! నన్నెంత మిస్ అవుతాడో... వాడు మంచం దగ్గరకొచ్చి ‘మమ్మీ..అన్నం తిందామా?’ ఒక్కసారే అడిగాడు చెవిలోంచి ఒక వైరే తీసి. నేను పలక్కపొయే సరికి ‘సర్లె..నువు పడుకోలే..నేను పెట్టుకుంటాలే’ మళ్ళీ వైరు చెవిలో ఇరికించుకుని డైనింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఒరే నీ యయ్య...తట్టిలేపరా..నీయమ్మ కట్టెకాల... నీ అడ్జస్ట్మెంట్ తగలెయ్య.. ఇంత తెలివిలేని వెధవనా నేను కన్నదీ... ఇహ బ్యాంక్ నుండి సునీల్ రావల్సిందేనా..నా అతీ,గతీ తేలాలంటే...ప్చ్. నా శరీరం అలా అంతసేపు ఏ ఐడీ లేకుండా, చచ్చిన మనిషికి తప్ప చచ్చినట్టు ఎవరికీ తెలీక ...ఫ్యాన్ గాలికి ముంగురులు ఊగుతూ పడుంది. నా ఆత్మ జలదరించింది. కానీ ఏదో తెలియని రిలీఫ్...ఎవరితోనూ చేయించుకోకుండా, తల్లిగా, భార్యగా, ఎంప్లాయిగా... క్లీన్ చిట్‌తో బయటపడ్డాను. ఇదీ మంచిదేలే. ఊహూ... కానేకాదు.. వీడి పెళ్ళి ఆదర్శంగా చేస్తానన్నదీ... కోడలితో ఫ్రెండ్లీగా ఉంటానన్నదీ... మనమరాలికి అంజలి అని పేరు పెడతానన్నదీ...అన్నీ ‘ఆన్లైన్ యమపాశాలు’ తీసుకుపోయాయి. కానీ ఇంత సిల్లీగా.. సింపుల్ గానా పోయేది? సాయంత్రం సునీల్ ‘టీ...టీ.’ అంటూ మంచం చుట్టూ తిరిగి ఎప్పటికో గమనించాక...ఆపై నేనూహించిందే. మేనకోడలి పెళ్ళిజనం అంతా ఖర్చులు కలిసొచ్చి...ఆనందం నుండి విషాదానికీ, సన్నాయి నుండి షహనాయికీ షిఫ్ట్ అయ్యారు. ‘గుత్తొంకాయ చేసిందంటమ్మా వాళ్ళాయన కిష్టమని’ ఒదిన కన్నీళ్ళతో! హు.. చావెవరిదైనాకానీ... గుత్తొంకాయనొదల్రే.. హ..హ...హ’. ‘వాషింగ్ మెషీన్లో బట్టలలాగే ఉన్నాయమ్మా.. మధ్యాహ్నం వేసుకుంది గావునూ.’ పిన్ని ఇంట్లో ఓ రౌండేసొచ్చి ముక్కు పిండుకుంది. కాదెహే...లేవంగానే వేసేసా...మధ్యాహ్నం ఏడుందీ చాకిరేవుకీ...చావురేవైపోతేనూ! ఇంతలో నాకు ఓ షాక్..నా పుత్ర రత్నం కాసేపటికో... కూసేపటికో జరిగిన సీన్లు రివైజై..రియలైజ్ అవటం చూసి తరిద్దామనుకుంటే...వాడు నా పార్థివ శరీరంపై పడి– ‘ఇవిగో అమ్మ నాకోసం కొన్న లాస్ట్ మెమరబుల్ గిఫ్ట్’ అంటూ ఆ నల్లని యమపాశపు ‘ఇయర్ ఫోన్స్’ అందరికీ చూపించి, ముద్దాడుతూ గావురుమంటూ ‘వాటిని’ అతి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు. అరే..ఒద్దురా...పాపిష్టివిరా...హెడ్ ఫోన్స్ కావవి...హెడ్ కొరివి రా నాకూ! ఎంత శ్రద్ధగా తీసుకున్నానురా వాట్నీ! పగోడిని పంచాంగమడిగితే, మధ్యాహ్నానికే మరణం అన్నాట్ట. అయ్యో...వీడు పూజించేసేట్టున్నాడే. ‘ఏవీ ఇలా చూపించూ. మేమంతా చూస్తాం మీ అమ్మిచ్చిన గిఫ్ ్ట‘పిన్నికి ఏదొక న్యూస్ లేటెస్ట్ ది కావాలి. వాడు తీసిస్తున్నాడు...ఇక నా గురించి మానేసి వాటి గురించే ఈ పూటంతా చెప్పుకుంటారు గావును. ఛ...ఖర్మ..ఖర్మ! హూ..ఇక పొండి. కర్మ కాండలు చేసుకోండి. మీ ఖర్మ... ఇక నా సమయం అయిందో, లేక అక్కడ ఉండాలనిపించలేదో తెలియదు, ఆలోచనారహితమైన నా ఆత్మ ప్రయాణం నా భర్తనీ, కొడుకునీ ఆర్తిగా చూసుకుంటూ ముందుకు సాగింది. ‘అరరే...అరరే...నేడు కన్నీట తేనె కలిసే’ ఎవరి టీవీలోంచో ఇష్టమైన పాట వినపడుతోంది. ►మనూ -
ఐసీసీ సీఈగా సాహ్ని
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత్‌కు చెందిన మను సాహ్ని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ఈ పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్సన్ తర్వాత ఆయన ఈ స్థానంలోకి వచ్చారు. రిచర్డ్సన్ వచ్చే వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బాధ్యతలనుంచి తప్పుకోనుండగా... అప్పటి వరకు ఆయనతో కలిసి సాహ్ని పని చేస్తారు. ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్ సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసిన సాహ్నికి ప్రసారహక్కులు, మార్కెటింగ్ వంటి అంశాలలో భారీ ఆదాయం తెచ్చి పెట్టిన అనుభవం ఉంది. -
‘మనూ’కు అరుదైన అవకాశం
రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి అరుదైన అవకాశం దక్కింది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఇన్సస్ట్రక్సనల్ మీడియా సెంటర్ (ఐఎంసీ) నిర్మించిన మూడు చిత్రాలు జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్–2019కు ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా ఐఎంసీ డైరెక్టర్ రిజ్వాన్ అహ్మద్ మాట్లాడుతూ.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జనవరి 27 నుంచి 31 వరకు నిర్వహిస్తారన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను చండీగఢ్‌లోని మొహాలీలో నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేçస్తున్నారన్నారు. ఈ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఇంటర్ఫేస్ కేటగిరీలో 15 చిత్రాలతో తుది జాబితాను విడుదల చేయగా.. అందులో మూడు ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఎంపికైన చిత్రాల్లో ‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్’ (డైరెక్టర్–ఒబైదుల్లా రైహన్), ‘ప్రొఫసర్ యూ ఆర్ రావు (డైరెక్టర్–మహ్మద్ ముజాహిద్ అలీ), స్టీఫెన్ హాకింగ్ (డైరెక్టర్–ఒమర్ ఆజ్మీ) చిత్రాలు ఉన్నాయన్నారు. మూడు చిత్రాలు జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం పట్ల యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ మహ్మద్ అస్లామ్ ఫర్వేజ్, విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, మీడియా సెంటర్‌ను అభినందించారు. మూడు చిత్రాలు కూడా ఉర్దూ భాషలో చిత్రీకరించినవి ఎంపిక కావడం విశేషమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలోచింపజేసే, సాంకేతికతను చాటే చిత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు. -
ఆటల్లోనూ సగం... సమం...
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీలకు ముందు వర్ధమాన అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పిస్తున్న యూత్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో మూడో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 2010లో తొలిసారి జరిగిన పోటీలకు సిం గపూర్, 2014లో చైనాలోని నాన్జింగ్ ఆతిథ్యమిచ్చాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు 2018 పోటీలు జరుగుతాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ చరిత్రలో తొలి సారి ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది. తాజా నిర్ణయంతో కొత్త తరహా ఒలింపిక్ స్ఫూర్తికి శ్రీకారం చుట్టినట్లవుతుం దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ‘ఇక్కడ మొదలు పెట్టే కొత్త మార్పులు ఒక్క యూత్ గేమ్స్‌కే పరిమితం కావు. అందరి కోసం ఆటలు అనే విధంగా మొత్తం ఒలింపిక్ ఉద్యమం గొప్పతనం చాటేలా నిర్ణయాలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బ్యూనస్ ఎయిర్స్ క్రీడలతోనే అనేక కొత్త అంశాలు ఈ పోటీల్లో ప్రవేశ పెడుతున్నారు. బ్రేక్‌డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. 47 మందితో భారత్: భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్‌లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారత్ మొదటిసారి ఫీల్డ్ హాకీ ఫైవ్స్, స్పోర్ట్ క్లైంబిం గ్లో పాల్గొంటోంది. షూటర్ మను భాకర్ ప్రారంభ వేడుకల్లో పతాకధారి కాగా... బ్యాడ్మింటన్‌లో సంచలన ఆటగాడు లక్ష్య సేన్‌తోపాటు తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి కూడా పోటీ పడుతోంది. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు గెలిచి 58వ స్థానంలో నిలిచింది. 2014 యూత్ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, మెహులీ ఘోష్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత్ ఈసారి పసిడి బోణీ చేసే అవకాశాలున్నాయి. బాక్సింగ్‌లో జ్యోతి గులియా (51 కేజీలు), టేబుల్ టెన్నిస్‌లో మానవ్ ఠక్కర్, బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్, రెజ్లింగ్‌లో మాన్సి పతకాలు గెలిచే అవకాశముంది. -
సుమీత్–మనూ జంట సంచలనం
టోక్యో: భారత అగ్రశ్రేణి డబుల్స్ జంట సుమీత్ రెడ్డి–మనూ అత్రి జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్–మనూ అత్రి ద్వయం 15–21, 23–21, 21–19తో ప్రపంచ 10వ ర్యాంక్, రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన గో వీ షెమ్–తాన్ వీక్ కియోంగ్ (మలేసియా) జంటను బోల్తా కొట్టించింది. 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ రెండో గేమ్‌లో భారత జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. అంతేకాకుండా నిర్ణాయక మూడో గేమ్‌లో 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ‘ఈ మధ్య మేమిద్దరం బాగా ఆడుతున్నాం. కీలకదశలో సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నాం. సమన్వయ లోపం లేకుండా చూసుకుంటున్నాం. ఆసియా క్రీడల్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా జోడీతో జరిగిన మ్యాచ్‌లో మేము 3 మ్యాచ్ పాయింట్లు కోల్పో యాం. ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కచ్చితంగా మాకు పతకం సాధించే అవకావకాశాలు ఉండేవి. ఏదేమైనా ఆ ఓటమితో మేము గుణపాఠం నేర్చుకున్నాం’ అని మనూ అత్రి అన్నాడు. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 12–21, 17–21తో మూడో సీడ్ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 17–21, 13–21తో చాంగ్ యె నా–జంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గావో ఫాంగ్‌జి (చైనా)తో పీవీ సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో విన్సెంట్ (హాంకాంగ్) తో శ్రీకాంత్; జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. డబుల్స్‌లో హీ జిటియాంగ్–తాన్ కియాంగ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తలపడతారు. ఇటీవల ఆసియా క్రీడల్లో విన్సెంట్ చేతిలో ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలతో ఉన్నాడు. నేటి ప్రిక్వార్టర్ ఫైనల్స్ ఉదయం గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మను జర్నీ లైఫ్‌లో మరచిపోలేను
‘‘బసంతి’ సినిమా తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ, నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై బాగా ఫోకస్ పెట్టా. ఓ కొత్త తరహా సినిమాలో నేను భాగమవ్వాలనే తపన నా మనసులో బలంగా పాతుకుపోయింది. ఇవన్నీ వద్దనుకుని నాకు కావాల్సిన దాని కోసం వెతుక్కున్నాను. ఇందుకు టైమ్ పట్టింది. ఇకపై స్పీడ్ పెంచుతా’’ అని రాజా గౌతమ్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్‌ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాజా గౌతమ్ మాట్లాడుతూ... ► ఫణీంద్ర షార్ట్‌ఫిల్మ్స్ చూసి నచ్చడంతో ఫోన్ చేసి అభినందించా. ఆ తర్వాత కలిశాం. అప్పుడే ‘మను’ సినిమా గురించి చెప్పారు. ఇందులో నటించే వారికి మంచి పేరు వస్తుందని చెప్పా. ఫైనల్‌గా ఓ రోజు ఫోన్ చేసి నువ్వే హీరో అన్నారు. ఈ సినిమాతో మూడేళ్ల నుంచి ట్రావెల్ అవుతున్నా. డబ్బు కన్నా ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ‘మను’ స్టార్ట్ చేశాం. ► ఈ కథతో నిర్మాతలదగ్గరికి వెళితే ప్రయోగాత్మక సినిమా కదా! అన్నారు. ఫణీంద్ర ఆలోచించి ఫేస్బుక్లో క్రౌడ్‌ఫండ్ పోస్ట్ పెట్టారు. అనూహ్య స్పందన వచ్చింది. ఈ రోజు వరకూ యూనిట్లో ఏ ఒక్కరూ పైసా కూడా తీసుకోలేదు. ► ఈ సినిమాలో మను అనే ఆర్టిస్టు(పెయింటర్) క్యారెక్టర్లో నటించాను. ఇదొక రొమాన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. సాంగ్స్ లేవు. పెద్దగా సీజీ వర్క్ లేదు. ‘మను’ జర్నీ నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇదొక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. ► బ్రహ్మానందంగారి అబ్బాయి అంటే ఫస్ట్ సినిమా చూస్తారు. అయితే యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాలి. కెరీర్ విషయంలో నాన్నగారు(బ్రహ్మానందం) సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ వాటినే ఫాలో అవుతున్నా. తర్వాతి సినిమాకు ఇంకా కమిట్ కాలేదు. హీరో పాత్రలే కాదు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. -
అదే నా ప్లస్ పాయింట్
‘‘మను’ చిత్రంతో నాకు బ్రేక్ వస్తుందా? రాదా? అనేది ఆడియన్స్ జడ్జ్‌మెంట్‌పై, దేవుడి దయపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు నేను ప్రాణం పెట్టి చేశాను. తెలుగు అమ్మాయిని అవ్వడం నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే భాషతో సమస్య ఉండదు’’ అని చాందినీ చౌదరి అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్మాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి చెప్పిన విశేషాలు... ఫణీంద్రగారి ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ పరిచయంతో ‘మను’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నీల పాత్ర చేశా. ఈ పాత్ర కోసం దాదాపు ఐదు నెలలు హోం వర్క్ చేశాను. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఇంత వరకూ ఏ సినిమాలో రాలేదు. బడ్జెట్ కంట్రోలింగ్ ఉండటం వల్ల సినిమా కాస్త లేట్ అయ్యింది. అవకాశాలు నా చేతిలో లేవు. నా వరకు నేను పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రస్తుతానికి హీరోయిన్‌గానే చేయాలనుకుంటున్నా. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో పేరొస్తే చాలు. ∙హీరో గౌతమ్ ‘మను’ అనే లోకల్ ఆర్టిస్టు క్యారెక్టర్లో నటించారు. నీల పాత్రలో బాగా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా సీన్స్‌ను నేచురల్‌గా తీశాం. కొన్ని సీన్స్‌కు గ్లిజరిన్ కూడా వాడలేదు. ప్రతిదీ ఫర్ఫెక్ట్గా ఉండాలని ఫణీంద్రగారు కోరుకుంటారు. అందుకే టైమ్ గురించి ఆలోచించలేదు. ∙ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేను. ఎందుకంటే చాలా వార్తలు వస్తున్నాయి. నా వరకు అలాంటివి ఎదురవలేదు. మా సినిమాతో పాటు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా కమిట్ కాలేదు. ఈ సినిమా రిజల్ట్ బట్టి ఉంటుంది. మంచి కథ ఉంటే ఇతర భాషల్లో నటించడానికి సిద్ధమే. -
మను ప్రి రిలీజ్ వేడుక
-
ఇలాంటి సినిమా తీయాలనిపించింది
‘‘మను, కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ‘మను’ ట్రైలర్ చూసిన తర్వాత ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని సుజన్‌ని అడిగా. అంతేకాదు.. ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీయాలనిపించింది’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించి ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను, గౌతమ్అన్న ఒకే కాలనీలో పెరిగాం. ఆయన హీరో కావడానికి చాలా కష్టపడ్డాడు. తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని మా సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. సరైన సినిమా తీస్తే క్రౌడ్ ఫండింగ్ అనే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమా చూస్తే కలుగుతుంది’’ అన్నారు రాజా గౌతమ్. చాందినీ చౌదరి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ పాల్గొన్నారు. -
నువ్వే మను అన్నాడు
‘‘మను’ సినిమా మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్ కాకముందు చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌ని కలిశాను. 40 – 50 కథలు విన్నాను. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ చూసి ఫణిని అభినందించా. అప్పుడే ఫణి ‘మను’ కథ చెప్పాడు’’ అన్నారు రాజా గౌతమ్. నూతన దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండింగ్ మూవీగా నిర్మితమైంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. గౌతమ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథ విన్నాక బావుందని అప్రిషియేట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత నువ్వే ‘మను’ క్యారెక్టర్ చేస్తున్నావన్నాడు ఫణి. చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బు పెట్టారు. ఎంతో బాధ్యతగా తీశాడు. సెప్టెంబర్ 7న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశా. ట్రైలర్ కంటే సినిమా ఎన్నో రెట్లు బాగుంటుంది. ఫణి విజన్ ఉన్న దర్శకుడు’’ అన్నారు చాందిని. ‘‘నాకు ఎమోషనల్ మూమెంట్. నా ఇన్వెస్టర్స్‌ని మర్చిపోలేను. వాళ్లందరికీ థ్యాంక్స్. నా సినిమా ఎక్కువ మాట్లాడుతుందని నమ్ముతున్నాను. నిర్వాణ సినిమాస్ వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఒక సినిమా అందరికీ రీచ్ కావాలంటే మంచి కథ కావాలి. ఫణి అలాంటి కథతోనే వస్తున్నాడు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత మాపై ఉందనిపించింది’’ అన్నారు నిహార్. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్, సంగీతం: నరేశ్. -
‘మను’ ట్రైలర్ విడుదల
-
ఆసక్తి రేకెత్తించేలా ‘మను’ ట్రైలర్
చిన్న సినిమాను, ప్రచారం అంతగా లేని సినిమాను అందరూ చిన్న చూపు చూస్తారు. కానీ ఒక్కసారి ఆ సినిమా తన స్టామినాను చూపిస్తే.. అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. ‘మను’ చిత్రం కూడా అలాంటిదే. ట్రైలర్ వచ్చే వరకు కూడా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. వినూత్న ప్రచారాలు చేసినా సినిమాకు హైప్ రాలేదు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ మూవీ గురించి మాట్లాడేలా చేస్తోంది. చాలా రోజుల తరువాత గౌతమ్ మళ్లీ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్, లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఎక్కువ క్యారెక్టర్స్ లేకుండా పరిమిత పాత్రలతోనే సినిమాను నడిపించినట్లు కనిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. గతంలోకూడా హీరోయిన్గా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. నిర్వాణ సినిమాస్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండేళ్ల కష్టం
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా ‘మధురం’ షార్ట్‌ఫిల్మ్ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘మను’. క్రౌడ్ ఫండింగ్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం గురించి నిర్వాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘మను’ చిత్రాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మేం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ఈ సినిమాలో చాలామంది కష్టం, కన్నీళ్లు, శ్రమ ఉన్నాయి. ఈ సినిమాను పూర్తి చేయడానికి సుమారు 20 మంది రెండేళ్లు కష్టపడ్డారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీ. వాల్ట్ డిస్నీ నమ్మే సిద్ధాంతాన్నే మేమూ నమ్ముతాం. ‘మేం డబ్బులు సంపాదించడానికి సినిమాలు తీయం, సినిమాలు తీయడానికి డబ్బులు సంపాదిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నరే‹శ్ కుమార్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి. -
బుర్రలో కొత్త ఐడియా!
కడవంత గుమ్మడి కాయ అయినా కత్తి పీటకు లోకువే... అని సామెత. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ వంటి తీగజాతి కాయలు మనకు ఎన్నో పండుతాయి. లేతగా ఉన్నప్పుడే చెట్టు నుంచి కోసి, తరిగి పులుసులో వేసేస్తాం. చక్కగా భోంచేసి ఆ కాయ జీవితానికి ధన్యత్వాన్ని ప్రసాదించినట్లు పోజ్ కొడతాం. పొరపాటున ఏ కాయ అయినా ముదిరిపోతే అది ఎందుకూ పనికిరానిదయిపోతుంది. ఎవరికీ కొరగానిదయిపోతుంది. సొరకాయ కూడా అంతే కానీ, క్రియేటివిటీ ఉన్న వాళ్ల కళ్లలో పడితే మాత్రం.. ముదిరిన కాయ కూడా ఇదిగో ఇలా ఎల్లకాలం ఇంట్లో ఒక డెకరేషన్ ఐటమ్‌గా ఉండిపోతుంది. మన పూర్వికులు తమ బుర్రను ఉపయోగించి సొరకాయ బుర్రతో వీణ మీటారు, పొలం పోయే రైతులు మంచినీటి సీసాగా మలిచారు. ఆదివాసులైతే ధాన్యాన్ని దాచుకునేది పెద్ద సొరకాయ బుర్రల్లోనే. ఆధునిక ప్రపంచం.. పింగాణి గుమ్మడికాయలో గుమ్మడికాయ సాంబారు వడ్డిస్తోంది, పింగాణి పనసకాయ, దోసకాయల్లో పులుసు, పెరుగు వడ్డించి భుజాలు చరుచుకుంటోంది. కానీ... ఎవరెన్ని విన్యాసాలు పోయినా బస్తర్ ఆదివాసుల దగ్గర ఈ ఒరిజినల్ కళ ఇంకా బతికే ఉంది. కాయను చెట్టునే ఎండనిచ్చి గింజలు తీసి బుర్రను శుభ్రం చేసి ఉపయోగిస్తారు. మైసూర్‌కు చెందిన సీమా ప్రసాద్ సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకున్నారు. అయితే ఆమెను ప్రభావితం చేసింది ఆఫ్రికా ఆదివాసులు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం సీమా ప్రసాద్ భర్త కృష్ణప్రసాద్ వ్యాపారరీత్యా కెన్యా, టాంజానియాలకు వెళ్లేవారు. అక్కడ వాటిని చూసిన సీమకు ఇండియాలో సొంతూరు గుర్తుకు వచ్చింది. పొలాల్లో తీగలకు ఎన్నెన్ని సొరకాయలు, వండినవి వండుకోగా మిగిలినవి ఎండి నేలపాలు కావడమే. వాటికి మార్కెట్ పెద్దగా ఉండదు కాబట్టి కాపు ఎంత విరివిగా ఉన్నా సరే సొరకాయను సాగుచేసే వాళ్లుండరు. సొరకాయలతో ఇంత చక్కని కళాకృతులను చేయవచ్చని తన ఊరి వాళ్లకు నేర్పిస్తే... సొరకాయలను పండించడానికి రైతులు కూడా ముందుకు వస్తారు. పెట్టుబడి తక్కువ, లాభాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలున్నప్పుడు ఓ ముందడుగు తానే ఎందుకు వేయకూడదు.. అనుకుంది సీమ. అలా పుట్టిందే ‘సీమసమృద్ధ’ సీమ బుర్రలో ఆలోచన తట్టినంత వేగంగానే సొంతూరులో అచరణలోకి వచ్చింది. ఇరుగుపొరుగు రైతు మహిళలనూ ఆమె కలుపుకుంది. ‘సీమ సమృద్ధ’ పేరుతో ఎన్జివో స్థాపించింది. మన సంప్రదాయ వంగడాలను సేకరించి పరిరక్షించే బాధ్యత తీసుకుంది. ఇండియాలో దొరికే దేశీయ సొరకాయ, గుమ్మడి వంటి తీగ పాదులతోపాటు ఆఫ్రికా నుంచి మన దగ్గర కనిపించని కొత్త రకం కాయల గింజలను సేకరించింది. పండించడం వరకు సరే, ఆ తర్వాత ఆ కాయలను కళాకృతులుగా మార్చడం ఎలా? అందుకోసం నిపుణులను మైసూరుకు పిలిపించింది. ఆసక్తి ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇప్పించింది, తానూ నేర్చుకుంది. కాయ ఆకారం పాడవకుండా గుజ్జు, గింజలు తీసి శుభ్రం చేయడంతోపాటు డిజైన్‌కి అనుగుణంగా రంగులు వేయడం కూడా నేర్చుకున్నారు. సీమ ఆఫ్రికాలో చూసిన, మన దగ్గర లేని డిజైన్లను నేర్చుకోవడానికి మరోసారి ఆఫ్రికాకు వెళ్లింది. అరచేతులకు మెహిందీ డిజైన్ పెట్టుకున్నట్లు సొరకాయ బుర్రల మీద డిజైన్ గీసి, ఆ డిజైన్‌కి అనుగుణంగా రంధ్రాలు చేయడం, రంగు వేయడం నేర్చుకుంది. అలా అందంగా రూపుదిద్దుకున్న ల్యాంప్ షేడ్లకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ లేని గిరాకీ. కాయ కూడా గిట్టుబాటే! తినడానికి మార్కెట్‌కొచ్చే సొరకాయ ధర కిలో పది నుంచి పన్నెండు రూపాయలుంటే, కళాకృతుల కోసం పెంచే కాయలకు వంద రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ కొద్దిగా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తినడానికి సొరకాయ ఏ రూపంలో ఉన్నా పట్టింపు ఉండదు. వీటికి ఆకారం తీరుగా ఉండాలి. అందుకే పిందెగా ఉన్నప్పుడే ఆ తీగను ఎత్తు పందిరికి అల్లించి కాయ నిటారుగా కిందకు దిగేటట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటికి ఆ ధర పలుకుతుంది. సీమ చేతిలో పడిన సొరకాయ ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ అవుతోంది, కొండపల్లి బొమ్మలను పోలిన బొమ్మగానూ రూపాంతరం చెందుతోంది. ఈ ‘ట్యూమా క్రాఫ్ట్’కి మంచి డిమాండ్ ఉంది. – మను -
‘స్వర్ణ’ మను .. హీనాకు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళా షూటర్లు రాణించటంతో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. ఆదివారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్(మహిళల) పోటీల్లో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ స్వర్ణం సాధించింది. ఇక భారత్‌కే చెందిన మరో షూటర్ హీనా సిధూ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా గలియా బోవిచ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో కామెన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 9కి చేరుకుంది. అందులో ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, ఈ ఉదయమే వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్ 69 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. -
మళ్లీ మెరిసిన మను
సిడ్నీ: భారత షూటింగ్ నయా సంచలనం మను భాకర్ మరోసారి స్వర్ణంతో మెరిసింది. ఇటీవల మెక్సికోలో జరిగిన సీనియర్ వరల్డ్‌కప్ షూటింగ్లో రెండు బంగారు పతకాలతో సత్తా చాటిన మను జూనియర్ ప్రపంచకప్‌లో మరో రెండు స్వర్ణాలతో ఆకట్టుకుంది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బరిలో దిగిన 16 ఏళ్ల మను 235.9 పాయింట్లు స్కోర్ చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. కన్యకోర్న్ హిరున్‌ఫోమ్ (థాయ్‌లాండ్–234.9 పాయింట్లు) రజతం... కైమన్ లూ (చైనా–214.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. టీమ్ విభాగంలో మను, దేవాన్షి, మహిమ అగర్వాల్ బృందం బంగారు పతకం దక్కించుకుంది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో గౌరవ్ రాణా రజతం, అన్మోల్ జైన్ కాంస్యం చేజిక్కించుకున్నారు. టీమ్ విభాగంలో అర్జున్ సింగ్ చీమా, గౌరవ్ రాణా, అన్మోల్ త్రయం కూడా స్వర్ణం చేజిక్కించుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆర్య, ఆదర్శ్, అన్హద్ జవాండా కాంస్యం దక్కించుకున్నారు. -
ఏ 'మను' వర్ణించను!
గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచ కప్ షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు... భారత్‌కు చెందిన 16 ఏళ్ల మను భాకర్ ఒకవైపు... సొంతగడ్డపై ఆడుతున్న 32 ఏళ్ల సీనియర్ అలెజాండ్రా జవాలా మరోవైపు... ఇద్దరి గత రికార్డు చూస్తే అసలు జవాలాకు మనూ పోటీనే కాదు. ఇంత పెద్ద టోర్నీలో తొలిసారి భారత షూటర్ బరిలోకి దిగితే, ఇప్పటికే రెండు ప్రపంచ కప్‌లలో స్వర్ణాలు గెలిచి, రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఘనత జవాలా సొంతం! 24 షాట్ల ఫైనల్లో 23 షాట్లు ముగిసేసరికి 1.3 పాయింట్ ముందంజలో ఉన్న మెక్సికో క్రీడాకారిణి దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖరి షాట్లో తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మను 10.6 స్కోరు సాధిస్తే... జవాలా తడబడి 8.8 పాయింట్లకే పరిమితమైంది. ఫలితంగా ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్ గోబర్‌విలే (ఫ్రాన్స్–217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో రవికుమార్ 226.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్త్వాన్ పెనీ (హంగేరీ– 249.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా, అలెగ్జాండర్ షిర్ల్ (ఆస్ట్రియా–248.7 పాయింట్లు) రజత పతకం గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన దీపక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. ఆరేళ్ల వయసులో బాక్సింగ్ సాధన, ఆరు నెలలు తిరిగే సరికి హరియాణా సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం... స్కేటింగ్‌లో రాష్ట్ర చాంపియన్, అథ్లెటిక్స్‌లోనూ పతకాలు... టాంగ్ టా మణిపూర్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయిలో స్వర్ణం, ఆపై కరాటేలో కూడా మరో పతకం... ఇంతే కాదు, క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, స్విమ్మింగ్... ఒక్కటేమిటి ఆ అమ్మాయి ఆడని ఆట లేదు. 16 ఏళ్ల వయసుకే మను భాకర్ స్పోర్ట్స్ రికార్డు ఇది. షూటింగ్‌ను ప్రారంభించింది ఏప్రిల్ 2016లో... జూన్ 2017కు వచ్చేసరికి జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీల బరిలో... ఏడాది కూడా కాక ముందే సీనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం... మను అనూహ్య ప్రస్థానమిది. మెరైన్ ఇంజినీర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో అన్ని ఆటలు ఆడేసి సత్తా చాటిన ఈ అమ్మాయి ఇప్పుడు షూటింగ్లో అంతర్జాతీయ యవనికపై మెరిసి శిఖరాన నిలిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామం మను స్వస్థలం. వేర్వేరు ఆటల్లో సత్తా చాటుతూ పోయిన ఈ అమ్మాయి బాక్సింగ్ ఆడే సమయంలో కంటికి స్వల్ప గాయమైంది. దాంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఇక చాలు అని గట్టిగా చెప్పడంతో షూటింగ్ వైపు మళ్లింది. ఝజ్జర్‌లోని యూనివర్సల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆమె షూటింగ్లో శిక్షణ పొందింది. సహజ ప్రతిభ, ఎక్కడ అడుగు పెట్టినా గెలవాలనే పట్టుదల వెరసి మను ఒక్కసారిగా దూసుకుపోయింది. 2017 సంవత్సరం మను కెరీర్‌కు సంబంధించి తొలి ఏడాది మాత్రమే. అయితేనేం ఆమె అన్ని విధాలా తన ముద్ర చూపించింది. జాతీయ స్థాయి జూనియర్ అండ్ యూత్ కేటగిరిలో తొలి స్వర్ణంతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్ షిప్లో రజతం సాధించింది. ఇక డిసెంబర్లో జరిగిన సీనియర్ నేషనల్స్లోనైతే వరుసగా రికార్డులు బద్దలు కొట్టి పతకాల వెల్లువతో సంచలనం సృష్టించింది. గత నెలలో జరిగిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో రెండు జూనియర్ జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన మను... కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే 27 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు తాజా ప్రదర్శన ఆమె స్థాయిని మరింత పెంచింది. ‘మా అమ్మాయి ఏ ఆట ఆడినా ఏనాడూ వద్దనలేదు. తనపై మాకు అంత గట్టి నమ్మకం ఉండేది. రూ.1 లక్ష 40 వేలతో ఆమెకు తొలిసారి గన్ కొనిచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు ఆమె సాధించిన ఘనత ముందు ఆ విలువ ఏమాత్రం ఎక్కువగా అనిపించడం లేదు’ అని ఆమె తండ్రి రామ్ కిషన్ గర్వంగా అన్నారు. చదువులోనూ ఎక్కడగా తగ్గని మను పదో తరగతి పరీక్షల్లో 10 సీజీపీఏ సాధించడం విశేషం. క్రీడల్లో ఉండేవారు సాధారణంగా ఎంచుకునే సులువైన సబ్జెక్ట్‌లకు భిన్నంగా మెడిసిస్ పూర్తి చేయాలనేది ఆమె లక్ష్యం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తమ కూతురు సత్తా చాటుతుందని ఆమె తల్లి సుమేధ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. సంచలన షూటర్... మను భాకర్ సత్తా ఏమిటో గత డిసెంబర్లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లోనే అందరికీ తెలిసింది. ఈ ఈవెంట్లో మను ఏకంగా 9 స్వర్ణాలు సహా మొత్తం 15 పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ హీనా సిద్ధును ఓడించిన మను... ఈ క్రమంలో హీనా పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక పాయింట్ల (240.6 పాయింట్లు) జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గింది. తొలి ప్రపంచకప్‌లోనే స్వర్ణం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వివిధ పోటీల్లో నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేలా ప్రయత్నిస్తా – మను భాకర్ -
టాలీవుడ్లో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ ‘మను’
పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన స్టార్ వారసుడు గౌతమ్. హాస్య నటుడు బ్రహ్మానందం వారసుడిగా తెరంగేట్రం చేసిన గౌతమ్ సక్సెస్ సాధించలేకపోయాడు. వారెవా, బసంతి సినిమాలు కూడా గౌతమ్‌కు నిరాశే మిగిల్చాయి. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గౌతమ్ త్వరలో ‘మను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కొత్త ప్రయోగం చేశారు చిత్రయూనిట్. మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలింస్ తో మంచి గుర్తింపు తెచ్చేకున్న ఫణీంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నిర్మాణం కోసం కావాల్సిన మొత్తాన్ని క్రౌడ్‌ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేశారు. తమ సినిమా నిర్మాణం కోసం ఫండ్ కావాలని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా కోటీ 20 లక్షలకు పైగా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా కలెక్ట్ అయ్యింది. ఆ మొత్తం తోనే సినిమాను పూర్తి చేశారు. క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మాణం జరుపుకున్న తొలి తెలుగు సినిమా మనునే కావటం విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆసక్తి రేపుతున్న 'మను' ఫస్ట్ లుక్
హైదరాబాద్: టాలీవుడ్ లో బ్రేక్ కోసం అష్టకష్టాలుపడుతున్న యువ హీరో, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. గౌతం హీరోగా తెరకెక్కుతున్న రాబోయే చిత్రం 'మను' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మరో హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ మను ఫస్ట్ లుక్ ను రీట్విట్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ' మను' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ మెప్పించేందుకు కష్టపడ్డట్టేకనిపిస్తోంది. కాగా 'పల్లకిలో పెళ్లి కూతురు' ,'వారెవ' , ' బసంతి' సినిమాలతో తెరకు పరిచయమయ్యాడు గౌతం. నటన పరంగా మార్కులు బాగానే పడినప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేకపోయాయి.. దీంతో ఈ యంగ్ హీరో ఈసారి ఎలాగైన సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. గౌతం హీరోగా సినిమాలు తీసి ఇప్పటికే చేతులు కాల్చుకున్న పలువురు నిర్మాతలకు ఈ సారైనా గుడ్ న్యూస్ అందిస్తాడా.. వేచి చూడాల్సిందే. And #Manu First look -
'మనూ'లో విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదా
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఆఫీసర్లతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్ననేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రధానంగా వర్శిటీ ప్రొక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ రాజీనామా చేయడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిసింది. మరో వైపు గురువారం జరగాల్సిన పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించం కుదరదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
'మనూ' లో ప్రవేశ దరఖాస్తులకు చివరి తేది మే 27
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దర ఖాస్తు ఆన్లైన్ గడువు మే 27తో ముగియనుంది. 14 రకాల విభిన్న కోర్సులను యూనివర్సిటీ ఆఫర్ చే స్తోంది. దరఖాస్తు ఫీజు జనరల్ విద్యార్థులకు రూ. 500, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు రూ. 300 చె ల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు చలాన్లు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పీహెచ్‌డీలో కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్, మేనేజ్మెంట్ స్టడీస్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, ఉమెన్ స్టడీస్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఇంగ్లీష్, హింది, అరబిక్, ఉర్దూ, పర్షియన్ కోర్సులను, ఎం.ఫిల్ విభాగంలో పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్, ఉమెన్ స్టడీస్,ఇస్లామిక్ స్టడీస్, స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, ఇంగ్లీష్, హింది, అరబిక్, పర్షియన్, ఉర్దూ కోర్సులున్నాయి. కాగా పోస్టుగ్రాడ్యుయేట్ విభాగంలో కంప్యూటర్ సైన్స్(ఎం.టెక్) మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ర్టేషన్, ఎం.ఏ జర్నలిజమ్ అండ్ మాస్ క మ్యూనికేషన్స్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులున్నాయి. అదేవిధంగా ఎం.టెక్, బి.టెక్ డిప్లోమో ఎంటమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులున్నాయి. వీటికి ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు.