హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దర ఖాస్తు ఆన్‌లైన్ గడువు మే 27తో ముగియనుంది. 14 రకాల విభిన్న కోర్సులను యూనివర్సిటీ ఆఫర్ చే స్తోంది. దరఖాస్తు ఫీజు జనరల్ విద్యార్థులకు రూ. 500, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు రూ. 300 చె ల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు చలాన్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పీహెచ్‌డీలో కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, ఉమెన్ స్టడీస్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఇంగ్లీష్, హింది, అరబిక్, ఉర్దూ, పర్షియన్ కోర్సులను, ఎం.ఫిల్ విభాగంలో పబ్లిక్ అడ్మినిష్ర్టేషన్, పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్, ఉమెన్ స్టడీస్,ఇస్లామిక్ స్టడీస్, స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, ఇంగ్లీష్, హింది, అరబిక్, పర్షియన్, ఉర్దూ కోర్సులున్నాయి. కాగా పోస్టుగ్రాడ్యుయేట్ విభాగంలో కంప్యూటర్ సైన్స్(ఎం.టెక్) మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ర్టేషన్, ఎం.ఏ జర్నలిజమ్ అండ్ మాస్ క మ్యూనికేషన్స్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులున్నాయి. అదేవిధంగా ఎం.టెక్, బి.టెక్ డిప్లోమో ఎంటమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులున్నాయి. వీటికి ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు.
'మనూ' లో ప్రవేశ దరఖాస్తులకు చివరి తేది మే 27
Published Thu, May 21 2015 12:07 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement