
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత్‌కు చెందిన మను సాహ్ని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ఈ పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్సన్ తర్వాత ఆయన ఈ స్థానంలోకి వచ్చారు. రిచర్డ్సన్ వచ్చే వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బాధ్యతలనుంచి తప్పుకోనుండగా... అప్పటి వరకు ఆయనతో కలిసి సాహ్ని పని చేస్తారు.
ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్ సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసిన సాహ్నికి ప్రసారహక్కులు, మార్కెటింగ్ వంటి అంశాలలో భారీ ఆదాయం తెచ్చి పెట్టిన అనుభవం ఉంది.