Dave Richardson
-
ఐసీసీ సీఈగా సాహ్ని
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత్‌కు చెందిన మను సాహ్ని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ఈ పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్సన్ తర్వాత ఆయన ఈ స్థానంలోకి వచ్చారు. రిచర్డ్సన్ వచ్చే వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బాధ్యతలనుంచి తప్పుకోనుండగా... అప్పటి వరకు ఆయనతో కలిసి సాహ్ని పని చేస్తారు. ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్ సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసిన సాహ్నికి ప్రసారహక్కులు, మార్కెటింగ్ వంటి అంశాలలో భారీ ఆదాయం తెచ్చి పెట్టిన అనుభవం ఉంది. -
భారత్‌లోనే ప్రపంచకప్!
దుబాయ్ : ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లేకుంటే భారత్‌లో నిర్వహించాలనుకున్న 2021 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌లను ఇతర దేశాలకు తరలిస్తామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలు భారత్‌లోనే జరుగుతాయని ఐసీసీ ఛీఫ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ‘పన్ను మినహాయింపులు ప్రపంచ క్రికెట్‌కు చాలా ముఖ్యం. ఎందుకంటే ఐసీసీకి వచ్చే ప్రతి రూపాయిని మళ్లీ ఆట కోసమే ఖర్చుపెడ్తాం. ఉదాహరణకు వెస్టిండీస్ వంటి జట్లు రెవెన్యూ పొందలేవు. అలాంటి జట్లకు ఐసీసీ అండగా ఉంటుంది. ఇక భారత్‌లో నిర్వహించే టోర్నీలను ఇతర దేశాలకు తరలించే ఆలోచనలైతే లేవు. ఆ సమయానికి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తోందని ఆశిస్తున్నాం.’ అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చాడు. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు భారత ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.161.32 కోట్లను వసూలు చేసింది. ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాకే, మిగిలిన మొత్తాన్ని ఐసీసీకి అందించింది. దీంతో తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ డిమాండ్ చేసింది. ఈనేపథ్యంలోనే తమ నష్టాన్ని చెల్లించకపోతే.. భారత్‌లో జరిగే మెగాటోర్నీలను ఇతర దేశాలకు తరలిస్తామని హెచ్చరించింది. (చదవండి: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే) అందుకే ఒకే గ్రూప్‌లో లేవు ఐసీసీ ఇటీవల ప్రకటించిన 2020 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై భారత్-పాకిస్తాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రపంచ కప్‌లో దాయాదుల పోరు అంటే అభిమానులకు ఎప్పుడైనా పండగే. అలాంటి ఈ షెడ్యూల్ లీగ్ దశలో భారత్-పాక్‌ల మధ్య పోరు లేదు. ఇరు జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటమే దీనికి కారణం. అయితే దీనిపై కూడా రిచర్డ్స్‌న్ వివరణ ఇచ్చారు. ఈ గ్రూప్‌లను ఐసీసీ ర్యాంకుల ఆధారంగా నిర్ణయించామని అందుకే భారత్-పాక్‌లు ఒకే గ్రూప్ లేవని స్పష్టం చేశాడు. ఇరు జట్లు సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో తలపడే అవకాశం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘మేం జట్ల ర్యాంకుల ఆధారంగా విశ్వసనీయతతో గ్రూప్‌లను విభజించాం. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉంది. మా విశ్వసనీయతను పక్కన పెట్టి ఇరుజట్లను ఒకే గ్రూప్‌లో ఆడించలేం. ఇరు జట్లు సెమీస్, ఫైనల్లో తలపడతాయని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. చదవండి : ఈసారి పాక్‌తో పోరు లేదు! -
కావాలనే భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్!
టీమిండియా, పాకిస్థాన్.. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లలోనే కాదు.. అభిమానుల్లో కూడా ఎక్కడ లేని ఉద్వేగం మొదలవుతుంది. అందులోనూ పెద్దపెద్ద టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాల్లో ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. అందుకే.. కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేస్తున్నట్లు సాక్షాత్తు ఐసీసీ చెప్పింది. 2017లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత, పాక్ జట్ల మధ్యనే తొలి మ్యాచ్ జరగనుంది. సుమారు ఏడాది తర్వాత.. జూన్ 4వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండేలా చూడాలనే తాము ప్రయత్నిస్తామని, అందులో అనుమానం అక్కర్లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైతే మంచి కిక్ వస్తుందని ఆయన అన్నారు. ఒక టోర్నమెంటు గ్రూప్ దశలోనే భారత్, పాక్ జట్లు తలపడటం వరుసగా ఇది ఐదోసారి. ఈ రెండు జ్టల మధ్య మ్యాచ్‌లను టీవీలలో దాదాపు వందకోట్ల మంది చూస్తారని అంచనా. కావాలనే డ్రా ఇలా వేయడం వల్ల టోర్నమెంటు సమగ్రతను కోల్పోతుందన్న వ్యాఖ్యలను రిచర్డ్సన్ ఖండించారు. గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే.. రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు. -
క్రికెట్‌ను జాగ్రత్తగా విస్తరిస్తాం: రిచర్డ్సన్
సిడ్నీ: క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచన ఉన్నా మరీ బలహీన స్థితిలో ఈ ఆటను చూడలేమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. వచ్చే ప్రపంచకప్‌లో కేవలం 10 జట్లతోనే టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత టోర్నీ 14 జట్లతో జరుగుతోంది. అయితే ఈ ఆలోచనను అసోసియేట్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే జరిగితే తమ దేశాల్లో క్రికెట్ అంతరించిపోతుందని ఆ జట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఇప్పుడు మేం ఓ నిర్ణయానికి వచ్చాం. క్రికెట్‌ను మరింత పటిష్టపర్చుకోవాలనుకుంటున్నామే తప్ప క్రేజ్ తగ్గించాలనుకోవడం లేదు. మాకు శాశ్వత సభ్య దేశాలున్నాయి. మేం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది’ అని రిచర్డ్సన్ అన్నారు. అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించినప్పుడు అమెరికా ఎందుకు సాధించకూడదని ఆయన ప్రశ్నించారు. -
ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది!
బీసీసీఐ ఏం చెబితే అది ఐసీసీకి వేదవాక్కు... ఇదీ ఇంతకాలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఆలోచన. కానీ అండర్సన్, జడేజా వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తప్పు చేశానని అండర్సన్ చెప్పినా... సాక్ష్యాలు లేవంటూ శిక్ష విధించలేదు. ఈ అంశంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా వ్యవహరించినా... ఐసీసీ నుంచి మాత్రం బోర్డుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీని ద్వారా ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది? ►అండర్సన్ తప్పు ఒప్పుకున్నా శిక్ష ఎందుకు పడలేదు? ►తొలిసారి భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న సిరీస్‌లో అండర్సన్ పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడు. అయినా ఐసీసీ కనీసం వివరణ కోరడం లేదు. తొలి టెస్టులో జడేజాతో వివాదం తర్వాత... నిషేధం గురించి ఏ మాత్రం భయపడని అండర్సన్ మూడో టెస్టులోనూ రహానేతో కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఐసీసీ దేనినీ పట్టించుకున్నట్లు లేదు. తాను జడేజాపై చేయి వేశానని ఇంగ్లండ్ పేసర్ ఒప్పుకున్నా...సాక్ష్యాలు లేవంటూ శిక్ష తప్పించుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహం...: అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోవడం బీసీసీఐకి ఆగ్రహం కలిగించింది. ‘అతడి పేరు ఉచ్ఛరించడానికి కూడా నేను ఇష్టపడను’ అని ధోని వ్యాఖ్యానించాడంటే ఈ విషయాన్ని భారత బృందం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఈ కేసులో తీర్పు పూర్తిగా తప్పు. ఇది ఒక చెడ్డ ఉదాహరణగా నిలిచిపోతుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అండర్సన్ విషయంలో అసలు బీసీసీఐని ఐసీసీ లెక్క చేసినట్లే కనిపించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. ‘ఈ ఉదంతంలో వరుసగా తప్పులు జరిగాయి. ముందు జడేజాను రిఫరీ శిక్షించారు. ఆ తర్వాత దానిని తొలగించారు. జడేజాను అండర్సన్ నెట్టడం రుజువైంది. అతనే స్వయంగా చెప్పాడు. అయినా అతడిని దోషిగా గుర్తించలేదు. అంపైర్ ఆక్సెన్‌ఫర్డ్ మైదానంలో తిట్లు ఆపాల్సిందిగా కోరారు. కానీ నిబంధనలు ఉల్లంఘించడంపై ఫిర్యాదు చేయలేదు. ఐసీసీ చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మా తరఫున మాట్లాడాలి...: ఇంతా జరిగితే అండర్సన్‌పై చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని బోర్డు అధికారి అభిప్రాయ పడ్డారు. ‘దీని ద్వారా యువ క్రికెటర్లకు ఏం సందేశం ఇవ్వదలిచారు. మీరు తోటి ఆటగాడిని తిట్టవచ్చు, తోసేయవచ్చు, కానీ హాయిగా తప్పించుకోవచ్చు అని చెబుతారా’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ తమ ప్రయత్నాలు కొనసాగిస్తుందని, ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ తమ తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. - సాక్షి క్రీడావిభాగం రిచర్డ్సన్ అంగీకరిస్తారా... జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ చేతుల్లో ఉంది. అయితే తను ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా భారత్‌కు చెందిన వారే కావడంతో ఈ వివాదంలో నొప్పింపక.. తానొవ్వక తరహాలో ఉండాలని డేవ్ భావిస్తున్నారు. ఈ నెల 10న ఒకవేళ రిచర్డ్సన్ అప్పీలుకు వెళితే 48 గంటల్లోగా ఐసీసీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ ప్యానెల్ చర్య తీసుకునేలోగా అండర్సన్ మిగతా రెండు టెస్టులూ ఆడే అవకాశం ఉంది. -
భారత్ పెత్తనం ఆటకు మంచిదే
ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ వ్యాఖ్య సాక్షి, ఢాకా: ఇటీవల ఐసీసీలో జరిగిన మార్పులపై రకరకాల చర్చలు జరిగినా... మొత్తం మీద బీసీసీఐ పెత్తనం ఆటకు మంచిదేనని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. ‘ఇంతకాలం బీసీసీఐ బయటి నుంచి ఆర్థికంగా మద్దతు ఇస్తూ ఇతర దేశాలకు బాధ్యత అప్పజెప్పింది. ఇకపై ఐసీసీ బాధ్యత బీసీసీఐ తీసుకోవడం ఆటకు మంచే చేస్తుంది’ అని రిచర్డ్సన్ అన్నారు. డీఆర్ఎస్ విషయంలో భారత్‌ను ఒప్పిస్తామని చెప్పారు. ‘ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ కుంబ్లే ఆధ్వర్యంలో డీఆర్ఎస్ను సమీక్షిస్తోంది. తొలుత కుంబ్లే డీఆర్ఎస్కు అంగీకరిస్తే, తర్వాత బీసీసీఐని ఒప్పించే అవకాశం ఉంటుంది’ అని రిచర్డ్సన్ చెప్పారు. 2015 వన్డే ప్రపంచ కప్ వరకు నాన్ పవర్‌ప్లేలో సర్కిల్‌కు ఆవల నలుగురు ఫీల్డర్ల నిబంధనను మార్చే ఆలోచనేదీ తమకు లేదన్నారు. మనసులో మాట వేరే! ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ పైకి ఏం చెప్పినా... లోపల మాత్రం బీసీసీఐ పెత్తనాన్ని ఇష్టపడటం లేదు. మీడియా సమావేశం ముగిశాక తనకు సన్నిహితంగా ఉన్న కొందరు విలేకరులతో మాట్లాడుతూ... భారత్ ప్రపంచకప్ నుంచి వైదొలుగుతానని బెదిరించడం వల్లే ఐసీసీలో మార్పులు జరిగాయని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.