దుబాయ్ : ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లేకుంటే భారత్‌లో నిర్వహించాలనుకున్న 2021 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌లను ఇతర దేశాలకు తరలిస్తామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలు భారత్‌లోనే జరుగుతాయని ఐసీసీ ఛీఫ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ‘పన్ను మినహాయింపులు ప్రపంచ క్రికెట్‌కు చాలా ముఖ్యం. ఎందుకంటే ఐసీసీకి వచ్చే ప్రతి రూపాయిని మళ్లీ ఆట కోసమే ఖర్చుపెడ్తాం. ఉదాహరణకు వెస్టిండీస్ వంటి జట్లు రెవెన్యూ పొందలేవు. అలాంటి జట్లకు ఐసీసీ అండగా ఉంటుంది. ఇక భారత్‌లో నిర్వహించే టోర్నీలను ఇతర దేశాలకు తరలించే ఆలోచనలైతే లేవు. ఆ సమయానికి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తోందని ఆశిస్తున్నాం.’ అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చాడు.
2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు భారత ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.161.32 కోట్లను వసూలు చేసింది. ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాకే, మిగిలిన మొత్తాన్ని ఐసీసీకి అందించింది. దీంతో తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ డిమాండ్ చేసింది. ఈనేపథ్యంలోనే తమ నష్టాన్ని చెల్లించకపోతే.. భారత్‌లో జరిగే మెగాటోర్నీలను ఇతర దేశాలకు తరలిస్తామని హెచ్చరించింది. (చదవండి: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే)
అందుకే ఒకే గ్రూప్‌లో లేవు
ఐసీసీ ఇటీవల ప్రకటించిన 2020 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై భారత్-పాకిస్తాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రపంచ కప్‌లో దాయాదుల పోరు అంటే అభిమానులకు ఎప్పుడైనా పండగే. అలాంటి ఈ షెడ్యూల్ లీగ్ దశలో భారత్-పాక్‌ల మధ్య పోరు లేదు. ఇరు జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటమే దీనికి కారణం. అయితే దీనిపై కూడా రిచర్డ్స్‌న్ వివరణ ఇచ్చారు. ఈ గ్రూప్‌లను ఐసీసీ ర్యాంకుల ఆధారంగా నిర్ణయించామని అందుకే భారత్-పాక్‌లు ఒకే గ్రూప్ లేవని స్పష్టం చేశాడు. ఇరు జట్లు సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో తలపడే అవకాశం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘మేం జట్ల ర్యాంకుల ఆధారంగా విశ్వసనీయతతో గ్రూప్‌లను విభజించాం. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉంది. మా విశ్వసనీయతను పక్కన పెట్టి ఇరుజట్లను ఒకే గ్రూప్‌లో ఆడించలేం. ఇరు జట్లు సెమీస్, ఫైనల్లో తలపడతాయని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. చదవండి : ఈసారి పాక్‌తో పోరు లేదు!
Comments
Please login to add a commentAdd a comment