సృజన్, క్రిష్, వరుణ్ తేజ్, రాజా గౌతమ్, ఫణీంద్ర నర్సెట్టి, సందీప్
‘‘మను, కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ‘మను’ ట్రైలర్ చూసిన తర్వాత ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని సుజన్‌ని అడిగా. అంతేకాదు.. ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీయాలనిపించింది’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించి ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను, గౌతమ్‌అన్న ఒకే కాలనీలో పెరిగాం. ఆయన హీరో కావడానికి చాలా కష్టపడ్డాడు.
తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని మా సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. సరైన సినిమా తీస్తే క్రౌడ్ ఫండింగ్ అనే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమా చూస్తే కలుగుతుంది’’ అన్నారు రాజా గౌతమ్. చాందినీ చౌదరి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment