Chandini chaowdary
-
Yevam Review: యేవమ్ మూవీ ఎలా ఉందంటే..?
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వికారాబాద్ చెందిన సౌమ్య(చాందిని చౌదరి) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తుంది. తను ఆ జాబ్ చేయడం తండ్రి, సోదరుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా సౌమ్య ఉద్యోగాన్ని వదులుకోదు. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు ఎనలేని అభిమానం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొనే పోలీసు వృత్తిని ఎంచుకుంటుంది. సౌమ్య ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకే వికారాబాద్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. యుగంధర్(వశిష్ట సింహ) అనే ఓ వ్యక్తి హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి..హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును సౌమ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అభికి సమాచారం యుగంధర్ని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యుగంధర్ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? అసలు ఎవరీ యుగంధర్? హీరోల పేర్లు చెప్పి ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు? అభికి యుగంధర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును సౌమ్య ఎలా డీల్ చేసింది? చిత్రానికి యేవమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సైకో థ్రిల్లర్‌ని, స్ల్పిట్ పర్సనాలిటీ కలిపి కథగా మార్చుకున్నాడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉన్నా.. తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసేందుకు ప్రయత్నించాడు. కథ ప్రారంభంలోనే యుగంధర్ నైజం ఏంటో అర్థమైపోతుంది. అఘరెడ్డి బెడ్ సీన్‌తో కథను ప్రారంభించి.. ఆ తర్వాత స్టోరీని వికారాబాద్ పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అభి, సౌమ్య పాత్రల పరిచయం..వారి నేపథ్యం చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉంటుంది. ప్రభాస్ పేరు చెప్పి ఓ అమ్మాయిని ట్రాప్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యుగంధర్ వరుసగా హీరోలను పేర్లు చెబుతూ అమ్మాయిలను ట్రాప్‌లోకి దించడం బోర్ కొట్టిస్తుంది.మరోవైపు అభి-సౌమ్యల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. అసలు సౌమ్య అభిలో ఏం చూసి ఇష్టపడిందనే పాయింట్‌ని బలంగా చూపించలేకపోయారు. సైకోని పట్టుకునేందుకు సౌమ్య ఇచ్చే సలహాలు కూడా సింపుల్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ బ్యాంగ్ షాకిస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఊహకందేలా సాగుంది. సైకో పక్కన తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం.. అతని కవ్వింపు చర్యలు అవన్నీ రొటీన్ సైకో థ్రిల్లర్స్లాగే ఉంటాయి. సౌమ్య సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనేది మరింత బలంగా చూపిస్తే బాగుండేది. అక్కడ రివీల్ చేసే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. తెలంగాణ ఒగ్గు కథ పాటతో ఓ ప్రధాన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్. స్క్రీన్‌ప్లే మాదిరి కథను కూడా ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. తొలిసారి చాందిని పోలీసులు పాత్రను పోషించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. అభిగా భరత్ రాజ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే బాగుండేది. కానిస్టేబుల్‌గా గోపరాజు రమణ తో పాటు మిగిలిన నటీనటులతో తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యూజిక్ షాప్ మూర్తినటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులునిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటిరచన & దర్శకత్వం: శివ పాలడుగు సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగంఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డివిడుదల తేది: జూన్ 14, 2024‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథేంటంటే.. పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన మూర్తి(అజయ్ ఘోష్)..అదే గ్రామంలో మ్యూజిక్ షాప్ రన్ చేస్తుంటాడు. వయసు 52 యేళ్లు. మొదటి నుంచి మ్యూజిక్ షాప్ లోనే పని చేయడంతో...లాభాలు లేకున్నా...అదే పని చేస్తుంటాడు. భార్య జయ(ఆమని) ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతూ..ఇద్దరి కూతుళ్ళని చదివిస్తుంది. మ్యూజిక్ షాప్ అమ్మి..మొబైల్ షాప్ పెట్టాలని జయ కోరిక.ఈ వయసులో కొత్త పని నేర్చుకునే కంటే...30 ఏళ్లుగా పని చేస్తున్న మ్యూజిక్ లోనే కొత్తగా ట్రై చేయాలని మూర్తి కోరిక. ఓ బర్త్‌డే పార్టీలో ఆయన పాటలు మిక్స్ చేసి ప్లే చేసిన విధానం అందరికి నచ్చి..డీజే అవ్వొచ్చు కదా అని సలహా ఇస్తారు. డీజే అయితే తనకు నచ్చిన పని చేస్తూనే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చని..ఆన్లైన్లో డీజే కోర్స్ గురించి తెలుసుకుంటుంటాడు.మరో వైపు అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చిన అంజన( చాందినీ చౌదరి) కి డీజే నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటుంది. అది ఆమె తండ్రి(భానుచందర్) కి నచ్చదు. తండ్రి అనుమతి తో డీజే అవ్వాలనుకుంటుంది. ఓ సందర్భంలో మూర్తిని కలిసిన అంజనా....మ్యూజిక్ పై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి డీజే నేర్పించాలనుకుంటుంది. అంజనాని గురువుగా భావించిన మూర్తి..ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని డీజే వాయించడం పూర్తిగా నేర్చుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మూర్తి డీజే అవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకు? అంజన, మూర్తి మధ్య ఉన్న సంబంధాన్ని సమాజంతో పాటు కుటుంబ సభ్యులు ఎలా తప్పుపట్టారు? అంజనా తండ్రి ముర్తిపై ఎందుకు కేస్ పెట్టాడు? డీజే అవ్వడం కోసం హైదరాబాద్ కి వచ్చిన మూర్తికి ఎదురైన కష్టాలు ఏంటి? ఫేమస్ డీజే డెవిల్(అమిత్ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? చివరకు 52 ఏళ్ల మ్యూజిక్ షాప్ మూర్తి.. ఫేమస్ డీజే మూర్తిగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథల్లో పెద్దగా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా..తెరపై చూడాలనిపిస్తుంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ కూడా అంతే. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కాస్త ఆలోచిస్తే..ఇంటర్వెల్ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఈజీగా అంచనా వేయ్యొచ్చు. అయినా కూడా తెరపై చూడాలనిపిస్తుంది. అలా అని ఈ కథ కొత్తదేమి కాదు. చాలా రోటీన్, సింపుల్ కథే. హీరో ఒకటి సాధించాలనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలు..వాటిని అధిగమించి చివరకు విజయం సాధించడం.. ఇదే మ్యూజిక్ షాప్ మూర్తి కథ.అయితే ఈ సినిమాలో హీరోకి 52 ఏళ్లు. ఆ వయసులో తన గోల్‌ని నెరవేర్చుకోవడమే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అనేది చాలా ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శివ పాలడుగు. కథనం రొటీన్‌గా సాగించినా.. ఎమోషన్ బాగా పండించి.. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ కథకి హీరోగా అజయ్ ఘోష్‌ని ఎంచుకోవడమే దర్శకుడి మొదటి విజయం. ఓ యంగ్ హీరోని పెట్టి ఈ కథ చెబితే.. రొటీన్‌గా అనిపించేంది. కానీ వయసు మీద పడిన వ్యక్తి కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఓ పది నిమిషాల తర్వాత కథనం ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే నేర్చుకోవడం కోసం చేసే అతను సాధన చూపించారు. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్ మరింత ఎమోషనల్‌గా సాగుతూనే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. డీజే అవ్వడానికి మూర్తి పడే కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీక్లైమాక్స్ కన్నిళ్లను తెప్పిస్తాయి. క్లైమాక్స్ బాగున్నా..ఎందుకో కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మ్యూజిక్ షాప్ మూర్తి జర్నీ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తుంది. ‘మొదటి ప్రయత్నానికే విజయం సాధించాలి..అది అవ్వకపోతే వదిలేసి..వేరే పని చేసుకోవాలి’అని ఆలోచించే నేటితరం యువతకి మూర్తి కథ ఆదర్శం అవుతుంది.ఎవరెలా చేశారంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరిని మెప్పిస్తున్న అజయ్ ఘోష్ ఇందులో లీడ్ రోల్ చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాభై ఏళ్లు పైబడిన మధ్యతరగతి వ్యక్తి మూర్తి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక్క పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించాడు. టైటిల్ సాంగ్‌కి స్టైప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇక అంజనా పాత్రకి చాందిని చౌదరి న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించిన గురువు పాత్ర తనది. ఆమె పాత్ర చెప్పే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్య జయగా ఆమని చక్కగా నటించింది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నానితో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పవన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
యేవమ్ అంటే...
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ వికారాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. తెలంగాణ కల్చర్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నేను మొదటిసారి పోలీసాఫీసర్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి’’ అన్నారు. ‘‘యేవమ్’ అంటే ‘ఇది ఇలా జరిగింది’ అని అర్థం. విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నలుగురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం’’ అన్నారు ప్రకాశ్. -
డేట్ ఫిక్స్
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘యేవమ్’. ఈ చిత్రంలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశ్ దంతులూరి మాట్లాడుతూ– ‘‘మహిళా సాధికారతను చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్ ఎప్పుడంటే?
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్‌గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్‌రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్‌గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్‌గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
అందుకే ‘గామి’ తీయడానికి ఐదేళ్లు పట్టింది : డైరెక్టర్
ఏదైనా కొత్తగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే అవతార్ తీయడానికి పదేళ్లు పట్టింది. గామి కూడా ఒక కొత్త ప్రయోగమే. అందుకే ఐదేళ్ల సమయం పట్టింది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి.. విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించాం’ అని అన్నారు దర్శకుడు విద్యాధర్ కాగిత. ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి హీరోయిన్. మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ విద్యాధర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘గామి’ ప్రాజెక్ట స్టార్ట్ అయింది నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన నన్ను చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే ఆలోచనతో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమానిస్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. విశ్వక్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలా పెద్ద అలోచించారు.ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరు రిస్క్ సీన్లు చేశారు. వాళ్లు చేసిన ప్రతి రిస్క్‌ని ముందు నేను లేదా మా సహాయ దర్శకుడు చేసి చూపించడం జరిగింది. అందరం రిస్క్ అంచునే ప్రయాణం చేశాం అది ఇప్పుడే చెప్పలేం ఈ సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. వాటి మధ్య ఉన్న లింక్ గురించి ఇప్పుడే చెప్పలేం.అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే ట్రైలర్ చూపినట్లుగానే ఆ పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి. సమద్, హారిక, చాందిని వీరందరినీ ఆడియన్స్ చేసే తీసుకున్నాం. అందుకే ‘గామి’ అనే టైటిల్ పెట్టాం 'గామి' సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇందులో డ్రామా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ప్రేక్షకులని సినిమాలో లీనం చేస్తుంది. గామి అంటే సీకర్. గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం ఉంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం మనం అనుకున్న ఎమోషన్స్ ని పెర్ఫార్మెన్స్ ల ద్వారా సరిగ్గా వ్యక్తం చేయించడం ఒక సవాల్. టెక్నికల్ గా ఎడిటింగ్ కూడా బిగ్గెస్ట్ సవాల్. కాంప్లెక్స్ సినిమాని ప్రేక్షకులందరినీ లీనం చేసేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం.యూవీ వారు ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఫైనాన్సియల్ ఫ్రీడమ్ వచ్చింది. అన్ని వనరులు పెరిగాయి. మాకు కావాల్సిన సమయం ఇచ్చారు. మేము ఎదో కొత్తగా చేస్తున్నామని వారు నమ్మారు. చాలా బిగ్గర్ స్కేల్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ చేసుకునే అవకాశం ఇచ్చారు. -
ఇదేం విడ్డూరం.. విడుదలైన రెండేళ్లకు థియేటర్లలో రిలీజ్
సుహాస్, చాందిని చౌదరి నటించిన చిత్రం 'కలర్ ఫోటో'. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ సొంత చేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు వరించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ఏర్పా ట్లు చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. (చదవండి: ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. స్పందించిన హీరో సుహాస్) జాతీయ అవార్డు దక్కించుకున్న చిత్రం కావడంతోనే థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీల్లో ప్రసారమైన ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీలో విడుదలై ఇప్పటికే రెండేళ్లు పూర్తి కావొస్తోంది. వచ్చేనెల 19న కలర్ ఫోటో సినిమాను బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. థియేటర్లలో రిలీజ్ చేస్తే మరింత గుర్తింపు దక్కుతుందని చిత్రబృదం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన చాందిని చౌదరి, సుహాస్‌కు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఈ విషయాన్ని కథానాయిక చాందిని చౌదరి సైతం ట్విటర్ ద్వారా వెల్లడించింది. #ColourPhoto in THEATRES from this NOV 19th🎬 An OTT blockbuster, a National Award later, we celebrate the 2️⃣ years milestone with pure joy #ColourPhotoOnNov19 pic.twitter.com/SMFdB8PtJW — Chandini Chowdary (@iChandiniC) October 23, 2022 -
‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్ ఫీల్ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.గడ్డంతో కిరణ్ హ్యాండ్సమ్ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. -
కామెడీ అండ్ ఫాంటసీ
‘ఈ నగరానికి ఏమైంది?’ ఫేమ్ సాయి సుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రాఘవేంద్ర వర్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు బీఏ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ–ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సాయి, సిమ్రాన్, చాందిని.. ఇలా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు కుదిరారు. మంచి సాంకేతిక నిపుణులతో తెరెక్కిస్తున్నాం’’ అన్నారు విశ్వాస్. తనికెళ్ల భరణి, ప్రియదర్శి, మకరంద్ దేశ్ పాండే, శిశిర్ వర్మ, ఝాన్సీ, వినీత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బి. జోష్ సంగీతం అందిస్తున్నారు. -
మను జర్నీ లైఫ్‌లో మరచిపోలేను
‘‘బసంతి’ సినిమా తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ, నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై బాగా ఫోకస్ పెట్టా. ఓ కొత్త తరహా సినిమాలో నేను భాగమవ్వాలనే తపన నా మనసులో బలంగా పాతుకుపోయింది. ఇవన్నీ వద్దనుకుని నాకు కావాల్సిన దాని కోసం వెతుక్కున్నాను. ఇందుకు టైమ్ పట్టింది. ఇకపై స్పీడ్ పెంచుతా’’ అని రాజా గౌతమ్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్‌ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాజా గౌతమ్ మాట్లాడుతూ... ► ఫణీంద్ర షార్ట్‌ఫిల్మ్స్ చూసి నచ్చడంతో ఫోన్ చేసి అభినందించా. ఆ తర్వాత కలిశాం. అప్పుడే ‘మను’ సినిమా గురించి చెప్పారు. ఇందులో నటించే వారికి మంచి పేరు వస్తుందని చెప్పా. ఫైనల్‌గా ఓ రోజు ఫోన్ చేసి నువ్వే హీరో అన్నారు. ఈ సినిమాతో మూడేళ్ల నుంచి ట్రావెల్ అవుతున్నా. డబ్బు కన్నా ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ‘మను’ స్టార్ట్ చేశాం. ► ఈ కథతో నిర్మాతలదగ్గరికి వెళితే ప్రయోగాత్మక సినిమా కదా! అన్నారు. ఫణీంద్ర ఆలోచించి ఫేస్బుక్లో క్రౌడ్‌ఫండ్ పోస్ట్ పెట్టారు. అనూహ్య స్పందన వచ్చింది. ఈ రోజు వరకూ యూనిట్లో ఏ ఒక్కరూ పైసా కూడా తీసుకోలేదు. ► ఈ సినిమాలో మను అనే ఆర్టిస్టు(పెయింటర్) క్యారెక్టర్లో నటించాను. ఇదొక రొమాన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. సాంగ్స్ లేవు. పెద్దగా సీజీ వర్క్ లేదు. ‘మను’ జర్నీ నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇదొక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. ► బ్రహ్మానందంగారి అబ్బాయి అంటే ఫస్ట్ సినిమా చూస్తారు. అయితే యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాలి. కెరీర్ విషయంలో నాన్నగారు(బ్రహ్మానందం) సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ వాటినే ఫాలో అవుతున్నా. తర్వాతి సినిమాకు ఇంకా కమిట్ కాలేదు. హీరో పాత్రలే కాదు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. -
ఇలాంటి సినిమా తీయాలనిపించింది
‘‘మను, కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ‘మను’ ట్రైలర్ చూసిన తర్వాత ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని సుజన్‌ని అడిగా. అంతేకాదు.. ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీయాలనిపించింది’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించి ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను, గౌతమ్అన్న ఒకే కాలనీలో పెరిగాం. ఆయన హీరో కావడానికి చాలా కష్టపడ్డాడు. తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని మా సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. సరైన సినిమా తీస్తే క్రౌడ్ ఫండింగ్ అనే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమా చూస్తే కలుగుతుంది’’ అన్నారు రాజా గౌతమ్. చాందినీ చౌదరి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ పాల్గొన్నారు. -
‘మను’ ట్రైలర్ విడుదల
-
లవ్లీ జర్నీ
‘‘రేవన్ యాదు నా కోసం మంచి పాత్రను తీర్చిదిద్దారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా బాగా వచ్చింది. అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటం లేదు. చాందిని, మనాలి చక్కగా నటించారు. శేఖర్ ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా లవ్లీ జర్నీ’’ అని హీరో రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆయన హీరోగా చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్వీఈ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా నా రెండో చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. సినిమా చాలా బాగా తీశాం’’ అన్నారు రేవన్ యాదు. హీరో నిఖిల్, ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చాందినీ చౌదరి, శేఖర్ చంద్ర, హీరోలు నారా రోహిత్, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాల వారధి
రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. ఇ.ఎమ్.వి.ఇ స్టూడియోస్ ప్రై లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ‘‘ఈ సినిమాకు ‘హౌరా బ్రిడ్జ్’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఓ రీజన్ ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఒక బ్రిడ్జ్ అయితే ఈ సినిమాలో మరో బ్రిడ్జ్ ఏంటి అనేది సస్పెన్స్. చాందిని చౌదరి, మనాలీ బాగా యాక్ట్ చేశారు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘రాహుల్ అద్భుతంగా నటించారు. మంచి ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అజయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: విజయ్ మిశ్రా. -
సూపర్‌స్టార్‌తో షార్ట్ ఫిలిం హీరోయిన్
షార్ట్ ఫిలిం హీరోయిన్ చాందినీ చౌదరి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. యూట్యూబ్ స్టార్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఆడిపాడనుంది. ఈ మధ్యే వెండితెర మీద కూడా అడుగుపెట్టిన ఈ భామ కుందనపు బొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో కీలక పాత్రతో పాటు ఓ సాంగ్ లోనూ కనిపించనుందట. శ్రీమంతుడు లాంటి ఘనవిజయం తరువాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సమయంలో వచ్చే కీలక సన్నివేశాలతో పాటు, పాటలోనూ నటించడానికి షార్ట్ ఫిలిం స్టార్ చాందినీ చౌదరిని ఎంపిక చేశారు. త్వరలోనే మహేష్, చాందినిల కాంబినేషన్లో తెరకెక్కనున్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.