‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల | Kiran Abbavaram Sammathame Movie First Look Released | Sakshi
Sakshi News home page

‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Published Thu, Jul 15 2021 5:02 PM | Last Updated on Thu, Jul 15 2021 5:06 PM

Kiran Abbavaram Sammathame Movie First Look Released - Sakshi

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్‌ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.గడ్డంతో కిరణ్‌ హ్యాండ్‌సమ్‌ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement