అందుకే ‘గామి’ తీయడానికి ఐదేళ్లు పట్టింది : డైరెక్టర్‌ | Director Vidyadhar Kagita interview About Gaami Movie | Sakshi
Sakshi News home page

అందుకే ‘గామి’ తీయడానికి ఐదేళ్లు పట్టింది : డైరెక్టర్‌

Mar 5 2024 6:19 PM | Updated on Mar 5 2024 6:58 PM

Director Vidyadhar Kagita interview About Gaami Movie - Sakshi

ఏదైనా కొత్తగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే అవతార్‌ తీయడానికి పదేళ్లు పట్టింది. గామి కూడా ఒక కొత్త ప్రయోగమే. అందుకే ఐదేళ్ల సమయం పట్టింది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి.. విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించాం’ అని అన్నారు దర్శకుడు విద్యాధర్‌ కాగిత. ఆయన దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి హీరోయిన్‌. మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్‌ విద్యాధర్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

అలా ‘గామి’ ప్రాజెక్ట స్టార్ట్‌ అయింది
నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన నన్ను  చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే ఆలోచనతో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమానిస్టార్ట్ చేశాం. తర్వాత  డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. 

 విశ్వక్‌ ధైర్యాన్ని మెచ్చుకోవాలి
నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలా పెద్ద అలోచించారు.ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరు రిస్క్‌ సీన్లు చేశారు. వాళ్లు చేసిన ప్రతి రిస్క్‌ని  ముందు నేను లేదా మా సహాయ దర్శకుడు చేసి చూపించడం జరిగింది. అందరం రిస్క్ అంచునే ప్రయాణం చేశాం

అది ఇప్పుడే చెప్పలేం
ఈ సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. వాటి మధ్య ఉన్న లింక్‌ గురించి ఇప్పుడే చెప్పలేం.అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే ట్రైలర్ చూపినట్లుగానే ఆ పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి. సమద్, హారిక, చాందిని వీరందరినీ ఆడియన్స్ చేసే తీసుకున్నాం.

అందుకే ‘గామి’ అనే టైటిల్‌ పెట్టాం
'గామి' సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇందులో డ్రామా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ప్రేక్షకులని సినిమాలో లీనం చేస్తుంది. గామి అంటే సీకర్. గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం ఉంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం
మనం అనుకున్న ఎమోషన్స్ ని పెర్ఫార్మెన్స్ ల ద్వారా సరిగ్గా వ్యక్తం చేయించడం ఒక సవాల్. టెక్నికల్ గా ఎడిటింగ్ కూడా బిగ్గెస్ట్ సవాల్. కాంప్లెక్స్ సినిమాని ప్రేక్షకులందరినీ లీనం చేసేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం.యూవీ వారు ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఫైనాన్సియల్ ఫ్రీడమ్ వచ్చింది. అన్ని వనరులు పెరిగాయి. మాకు కావాల్సిన సమయం ఇచ్చారు. మేము ఎదో కొత్తగా చేస్తున్నామని వారు నమ్మారు. చాలా బిగ్గర్ స్కేల్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement