సూపర్స్టార్తో షార్ట్ ఫిలిం హీరోయిన్
షార్ట్ ఫిలిం హీరోయిన్ చాందినీ చౌదరి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. యూట్యూబ్ స్టార్గా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్తో ఆడిపాడనుంది. ఈ మధ్యే వెండితెర మీద కూడా అడుగుపెట్టిన ఈ భామ కుందనపు బొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో కీలక పాత్రతో పాటు ఓ సాంగ్ లోనూ కనిపించనుందట.
శ్రీమంతుడు లాంటి ఘనవిజయం తరువాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సమయంలో వచ్చే కీలక సన్నివేశాలతో పాటు, పాటలోనూ నటించడానికి షార్ట్ ఫిలిం స్టార్ చాందినీ చౌదరిని ఎంపిక చేశారు. త్వరలోనే మహేష్, చాందినిల కాంబినేషన్లో తెరకెక్కనున్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.