శ్రీకాంత్‌ అడ్డాల సినిమా మొదలవుతోంది..! | Srikanth Addala New Movie With Sharwanand | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 11:00 AM | Last Updated on Tue, Sep 18 2018 11:00 AM

Srikanth Addala New Movie With Sharwanand - Sakshi

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ రావటంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్‌ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. దీంతో నెక్ట్స్‌ ప్రాజెక్ట్ మొదలెట్టడానికి చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్‌ అడ్డాల లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్‌ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసర రోజున లాంఛనంగా ప్రారభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement