brahmostavam
-
అద్వితీయం.. బోయకొండ క్షేత్రం
చిత్తూరు జిల్లాలో కాణిపాకం తరువాత అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ క్షేత్రం నూతన శోభను సంతరించుకుంది. మూడేళ్లలోనే బోయకొండ అతి సుందరంగా రూపుదిద్దుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో వందల కోట్ల రూపాయల నిధులు బోయకొండ అభివృద్ధికి వెచ్చించడంతో, రూపురేఖలు మారిపోయాయి. అత్యాధునిక సదుపాయాల మధ్య అమ్మవారి దసరా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ బోయకొండ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుణ్యక్షేత్రం విశిష్టతపై ప్రత్యేక కథనం. చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వతేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు రోజూ వారీ సేవల వివరాలను తెలియజేయడానికి పోస్టర్లు ముద్రించి జిల్లాతోపాటు, కర్ణాటక, తమిళనాడులో పంపిణీ చేశారు. ఆలయ చరిత్ర జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటి. భారతావని నవాబులు పాలించే సమయంలో పుంగనూరు సంస్థానంపై నవాబుల కన్నుపడింది. గోల్కొండ నవాబు సైన్యం పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాల్లో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టింది. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరు వైపు వస్తున్న నవాబు పదాథిదళాలు చౌడేపల్లె వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయల, ఏకిల గూడేలలో బీభత్సం సíష్టించాయి. దీంతో బోయలు, ఏకిల దొరలు భయంతో కొండ గుట్టకు వెళ్లి తలదాచుకొని జగజ్జనని మాతను ప్రార్థించారు. వీరిమొర ఆలకించిన శక్తి స్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. నవాబుసేనలను అవ్వ తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతిగుండు సైతం నిట్ట నిలువుగా చీలిపోయింది. (ఇప్పటికీ ఈ రాతిగుండును చూడవచ్చు) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపచేయడానికి ఒకమేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండాలని ప్రారి్థంచారు. వారి కోరిక మేరకు అక్కడే వెలసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలవడం మొదలైంది. కొండపై హిందువులు కట్టుకున్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మనీరు తాగిన స్థలం గుర్తులు, గుండ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన గుండ్లు అమ్మవారి మహిమలకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. పవిత్రమైన పుష్కరిణి తీర్థం కొండపై వెలసిన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతిపవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థంను సేవిస్తే సకల రోగాలు, పంటలపై తీర్థాన్ని చల్లితే చీడపీడలు, దుష్టసంబంధమైన గాలి భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.కేవలం రూ.20కే బాటిల్‌తో సహా తీర్థములను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. అమ్మవారి పుష్ప మహిమ భక్తులు తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని తెలుసుకోవడానికి అమ్మవారి శిరస్సుపై మూడు పుష్పములు ఉంచి కోరికలను మనస్సులో స్మరించుకోమంటారు. అమ్మవారికి కుడివైపున ఆ పుష్పము పడినచో కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడినచో ఆలస్యంగా నెరవేరుతాయని, మధ్యలో పడితే తటస్థంగా ఉంటాయని అమ్మవారి మాటగా భక్తులు భావిస్తారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ చైర్మన్ మిద్దెంటి శంకర్‌నారాయణ తెలిపారు. అమ్మవారి అలంకారాలతో తీర్చిదిద్దిన తొమ్మిది డిజిటల్ హెచ్డీ ఆర్చిలను బోయకొండపై ఏర్పాటు చేశామన్నారు. దసరా మహోత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దుర్గా సప్తశతి చంఢీ హోమం (పౌర్ణమి రోజున) పాల్గొనే ఉభయదారులు రూ.2,116 చెల్లించి ఉభయదారులుగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. శ్రీఘ్ర ఫలదాయిని పూజలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు ఊంజల్‌సేవ, అభిõÙకం, గణపతి, చంఢీహోమములు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉభయదారులకు అమ్మవారి ప్రసాదము, పవిత్రమైన శేషవస్త్రం, చీరతోపాటురవిక, అమ్మవారి కుంకుమ, గాజులు, అమ్మవారి జ్ఞాపిక ఇవ్వనున్నట్లు ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. ఉభయదారుల నమోదుకోసం 79016 42845, 79016 42846ను సంప్రదించాలని కోరారు రవాణా మార్గాలు పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయానికి చౌడేపల్లె నుంచి 12 కిమీ, పుంగనూరు నుంచి 14 కి.మీ, మదనపల్లె నుంచి 16 కి.మీ దూరం ఉంది. ఈ మూడు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో గతుకుల రోడ్లతో భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డబుల్ రోడ్డు వేయడంతో ప్రయాణం సులభతరంగా మారింది. కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
ఈసారి పరిమితుల మధ్య బ్రహ్మోత్సవాలు
తెలుగువారి ఇలవేలుపు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలయ్యాయని, నవ బ్రహ్మలలోని ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు వచ్చి జరిపిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని, పరబ్రహ్మ స్వరూపుడైన వేంకటేశ్వరునికి జరిపే ఉత్సవాలు అయినందున బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని, బ్రహ్మాండ నాయకుడిని తలుస్తూ, కొలుస్తూ బ్రహ్మాం డంగా చేసే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని, ఇలా రకరకాలుగా చెబుతారు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ అని అన్నమయ్య అన్నట్లుగా, ఏ తీరున అభివర్ణించినా, ఏ రీతిన కొలిచినా, ఇవి బ్రహ్మోత్సవాలే. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. కరోనా వల్ల ఈ సంవత్సరం ఏకాంతంగా జరుపుకుంటున్నారు. అందరి మేలుకోరి ఇలా జరుపుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. శ్రీ విష్వక్సేనుడి వద్ద తొలి రోజు పూజలు జరిపి అంకురార్పణ చేశారు. శనివారం నాడు ధ్వజారోహణంతో మొదలైన ఈ సంబ రాలు చక్రస్నానంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 19వ తేదీన మొదలైన ఈ వేడుకలు 27 వరకూ సాగుతాయి. గరుడసేవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంకురార్పణకు ఒక విశిష్టత వుంది. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగ మొదలైన నవధాన్యాలను పోసి పూజిస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థనలు జరుపుతారు. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞ కుండలాలను నిర్మిస్తారు. తరువాత, పూర్ణకుంభ ప్రతిష్ఠ చేస్తారు. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోస్తారు. అవి పచ్చగా మొలకెత్తుతాయి. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు. మొదటి రోజు జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఉదయాన్నే సుప్రభాత, తోమాల సేవలు జరిపాక, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజనం చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణ చేస్తారు. ఈ గరుడ పతాకమే సకల దేవతలను పిలిచే ఆహ్వానపత్రం. రెండవరోజు శేషవాహనంలో ఇరువురు అమ్మలతో అయ్యవారిని ఊరేగిస్తారు. సింహవాహనంపై స్వామివారిని మూడవరోజు ఊరేగిస్తారు. సర్వ భక్తుల సకల కోరికలు తీర్చడానికి కల్పవృక్ష వాహనంపై స్వామివారు నాల్గవరోజు ఎల్లరకు కన్నుల విందు చేస్తారు. అన్ని రోజులు ఆలయ వాహన మండపంలో ఆరంభమైతే, ఐదోరోజు ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. ఈరోజు స్వామి మోహినీ అవతారంలో ఉంటారు. స్వామివారి ప్రధానభక్తుడైన గరుడవాహనం సేవ ఈరోజు ఉంటుంది. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు సమర్పించే విశేష కార్యక్రమం ఈరోజు ఉంటుంది. ఆరవరోజు గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, ఎనిమిదవ రోజు ర«థోత్సవం, తొమ్మిదవ రోజు చక్రస్నానం జరుగుతాయి. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత, సాయంకాలం ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. అంటే దించుతారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికినట్లే. ఇలా ప్రతి ఏటా వేడుకలు జరపడం కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతోన్న ఆనవాయితీ. ఏనాడూ ఉత్సవాలు ఆగలేదు. ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ అన్నట్లు ఇంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఎక్కడా జరుగవు, క్షేత్రరాజంగా విరాజిల్లే తిరుమలలో తప్ప. వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని విశ్వసిద్దాం. వ్యాసకర్త: మాశర్మ , సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 93931 02305 -
పతిభక్తికి ప్రతిరూపం..వెంగమాంబ చరితం
సాక్షి, దుత్తలూరు నెల్లూరు : భక్తుల కొంగు బంగారంగా.. మెట్ట ప్రాంత ఆరాధ్య దైవంగా.. పతిభక్తికి ప్రతిరూపంగా.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. అంటరానితనం నిర్మూలనకర్తగా.. వలస వాసుల వరాల తల్లిగా విరాజిల్లుతున్న నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఏటా జ్యేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి దాటిన మొదటి ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు హాజరవుతారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వెంగమాంబ చరిత్ర దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన వడ్డిపాళెం వాస్తవ్యులైన పచ్చవ వెంగమనాయుడు, సాయమ్మ దంపతులకు కుల దైవమైన రేణుకాదేవి అనుగ్రహంతో వెంగమాంబ జన్మించింది. వెంగమాంబకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఉండేది. వెంగమాంబకు నర్రవాడకు చెందిన వేమూరి గురవయ్యతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహానంతరం భర్తకు అనుకూలంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా ఉండేవారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడేవారు. అభాగ్యులను ఆదుకుంటూ ఆదర్శ గృహిణిగా నిలిచారు. అగ్రవర్ణాలు దళితులను మంచినీటి బావుల వద్దకు రాకూడదనే సమయంలో ఈమె నీటిని చేది దళితులకు అందించేవారు. వారి కోసం బావిని కూడా తవ్వారు. ఇప్పటికీ ఆ బావిని వేమూరి వారి బావిగా పిలుస్తున్నారు. ఒక రోజు ఆమె భర్త గురవయ్యనాయుడు పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు. దీన్నే దొడ్డకొండ అంటారు. అదే సమయాన వెంగమాంబ స్నేహితులతో కలిసి గడ్డికోసం అడవికి వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా దొంగలు వచ్చి వెంగమాంబ, స్నేహితులను అటకాయించారు. దీంతో బిగ్గరగా కేకలు వేశారు. అడవిలో ఉన్న గురవయ్య ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుని దొంగలతో తలపడ్డారు. దొంగలందర్నీ హతమార్చగా ఒక దొంగ చాటుగా ఈటెతో గురవయ్య గుండెకు విసిరాడు. దీంతో గురవయ్యకు తీవ్రగాయమై రక్తస్రావమై స్పృహ కోల్పోయారు. మూడు రోజుల పాటు భార్య వెంగమాంబ, గ్రామస్తులు ఎన్ని సపర్యలు చేసినా స్పృహలోకి రాలేదు. దీంతో వెంగమాంబ తన భర్త మరణించకముందే ముత్తయిదువుగా అగ్నిగుండ ప్రవేశం చేయాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులు, గ్రామస్తులను ఒప్పించారు. నర్రవాడ గ్రామంలోని మధ్యభాగాన అందరూ చూస్తుండగానే అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆమె అగ్నిగుండ ప్రవేశం చేసిన తెల్లవారి అక్కడ వెంగమాంబ మంగళసూత్రాలు, పైటకొంగు కాలకుండా గ్రామస్తులకు కనిపించాయి. అనంతరం వెంగమాంబ తన స్నేహితురాలైన తుమ్మల పెదవెంగమ్మ, వెంగమాంబ బావగారైన ముసలయ్యనాయుడికి కల్లో కనిపించి తనకో దేవాలయాన్ని నిర్మించాలని కోరారు. అనంతరం వెంగమాంబకు దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మ పెట్టుబడితో వ్యాపారంలో అధిక ఆదాయాలు వెంగమాంబ పేరంటాలు దేవస్థానం తరఫున అమ్మవారి నగదును భక్తులకు అందజేస్తారు. భక్తులు రూ.100 చెల్లిస్తే అమ్మవారి నగదును చిల్లర రూపంలో రూ.80 అందజేస్తారు. ఈ నగదును వ్యాపార పెట్టుబడిలో కలపగా అధిక ఆదాయాలు వస్తాయనేది భక్తుల నమ్మకం. ఈ విధంగా అధిక ఆదాయాలు పొందిన భక్తులు అమ్మవారి దేవస్థాన ఆభివృద్ధికి తమ వంతు కానుకలను అందిస్తున్నారు. అమ్మవారి పేరుతో పలు జిల్లాలు, రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు, హోటళ్లు నడుస్తున్నాయి. దేవస్థానానికి చేరుకునేదిలా.. దుత్తలూరు మండలం నర్రవాడలో దేవస్థానం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి దుత్తలూరు మీదుగా పామూరు వెళ్లే మార్గంలో నర్రవాడలో దిగాలి. ఒంగోలు నుంచి కందుకూరు మీదుగా దుత్తలూరు వెళ్లే మార్గాన, కడప నుంచి బద్వేలు, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు వెళ్లే మార్గాన, పోరుమామిళ్ల నుంచి సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు మార్గాన నర్రవాడకు చేరుకోవాలి. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23న నిలుపు కార్యక్రమంతో ప్రారంభంకానున్నాయి. అదే రోజున సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడతారు. 24న వెంగమాంబ, గురవయ్య రథోత్సవం, సంతానం లేనివారు వరపడతారు. 25న రథోత్సవం, 26న ఉదయం వెంగమాంబ, గురవయ్య కల్యాణోత్సవం, పసుపు, కుంకుమ ఉత్స వం, రాత్రికి ప్రదానోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాల్లో చివరి రోజైన 27న పొంగళ్లు, ఎడ్ల బండలాగుడు పందేలు, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సారి బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లో అన్నదా న, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
శ్రీకాంత్ అడ్డాల సినిమా మొదలవుతోంది..!
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ మొదలెట్టడానికి చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. 2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్ అడ్డాల లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసర రోజున లాంఛనంగా ప్రారభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. -
గరుడ వాహనా గోవిందా..
-
అక్షయ్‌తో మహేశ్ పోరాటం లేనట్టే!
'శ్రీమంతుడు' వంటి భారీ హిట్ తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' అట్టర్ ప్లాప్ కావడంతో మహేశ్ బాబు తన తదుపరి సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. 'గజనీ', స్టాలిన్ వంటి భారీ సినిమాలు తెరకెక్కించిన తమిళ అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ద్విభాష చిత్రానికి మహేష్ ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఈ నెలాఖరులో లేదా జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో మహేశ్ కెరీర్లోనే అత్యంత భారీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బాగా హల్చల్ చేసింది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్‌కుమార్ నటిస్తారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే అక్కీ రజనీకాంత్ ప్రతిష్టాత్మక సినిమా 'రోబో-2'లో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాలోనూ ఈ యాక్షన్ స్టార్‌ను విలన్‌గా తీసుకొనే అవకాశముందని కథనాలు వినిపించాయి. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలివుడ్‌లోనూ హల్చల్ చేసిన ఈ కథనాలపై తాజాగా దర్శకుడు మురుగదాస్ స్పందించాడు. తమ సినిమాలో అక్షయ్‌కుమార్ నటించడం లేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వదంతులకు ఫుట్‌స్టాప్ పడింది. కానీ అక్షయ్‌కుమార్ లేనప్పటికీ ఈ సినిమాలో మరో బాలీవుడ్ తార కనిపించే అవకాశం కనిపిస్తోంది. మహేశ్ సరసన పరిణీతచోప్రాను హీరోయిన్గా తీసుకొనే అవకాశమున్నట్టు వినిపిస్తోంది. -
మహేష్‌ను మోసం చేసిన దర్శకులు!
ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్‌తో మహేష్‌కు షాక్ ఇచ్చారు. ఒక్కడు సినిమాతో మహేష్‌కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్లో మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా డిజాస్టర్ టాక్‌తో నిరాశ పరిచింది. రీసెంట్గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్‌తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్‌మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు. -
ఈ సారి వర్మ టార్గెట్ మహేష్
ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ సెలబ్రీటిలపై విమర్శనాస్త్రాలను సంధించే రామ్ గోపాల్ వర్మ, కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసే వర్మ ఈ సారి మహేష్ బాబు లేటెస్ట్ సినిమాపై స్పందించాడు. అయితే డైరెక్ట్‌గా మహేష్ బాబు, బ్రహ్మోత్సవం అనే పేర్లను వాడకుండా జాగ్రత్తగా చురకలంటించాడు. ముందుగా బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ డ్యాన్స్ వీడియోతో పాటు ' అంతర్జాతీయ నృత్యదర్శకులు సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వారు, ఈ డ్యాన్స్ చూసి నేర్చుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఫ్యామిలీ సినిమాను ఒక కుటుంబంలోని సభ్యులు ఎలా చూస్తారో వివరించాడు వర్మ. ' కుటుంబ కథా చిత్రానికి వెళ్తే.. తండ్రి హీరోయిన్ అందం చూస్తాడు. తల్లి వాళ్ల దుస్తులను చూస్తుంది. కూతురు థియేటర్లో కూర్చొని బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తుంది. కొడుకు నిద్రపోతాడు. ఈ విషయాన్ని ఎమ్ తెలుసుకోవాలి. శోభన్ బాబు లాంటి స్టార్లు మాత్రమే ఫ్యామిలీ సినిమాలు చేస్తారు. కృష్ణ, ఎన్టీఆర్‌లు కాదు. నాకు శోభన్ బాబు చేసిన దేవత సినిమా గుర్తుంది కానీ హీరో గుర్తులేడు. కానీ కృష్ణ, ఎన్టీఆర్‌ల సినిమాల స్టోరి గుర్తు లేదు. వాళ్లే గుర్తున్నారు. మిస్టర్ ఎమ్ స్టార్ డమ్ గురించి తెలుసుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు. ఈ స్థాయిలో విమర్శలకు దిగిన వర్మ చివరలో మిస్టర్ ఎమ్ ఈ కామెంట్స్ పాజిటివ్ గా తీసుకోవాలని కోరాడం కోసమెరుపు. All world famous choreographers like Savion glover,Martha Graham,George Balanchine etc should learn from this pic.twitter.com/O1heqZCh7K — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 In family film father watches heroines assets,mother watches clothes,daughter texts boy friend and bored son sleeps.. M shud understand this — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 Mr M should understand family films are just entry exit visuals at theatres but once in seats they all want to see Pokiri,okkadu,Businessman — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 Mr.M should understand so called super hit family films at best will create Shoban Babus and not Krishna's and NTR's — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 Devata super story I remember but don't remember Sobhan babu..I remember Krishna Ntr in agent gopi Adavi Ramudu..but I don't remember story — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 Mr.M You need to understand that ur super stardom should be extraordinarily very many times much above very very much ordinary families — Ram Gopal Varma (@RGVzoomin) 21 May 2016 Am really happy that all the M fans took my comments so positively — Ram Gopal Varma (@RGVzoomin) 22 May 2016 -
మహేష్‌కి రికార్డ్ మిస్ అయ్యింది
ఈ సమ్మర్ బరిలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు నాట అన్ని రికార్డులు తిరగరాస్తుందని భావించారు. ఇక నాన్ బాహుబలి రికార్డులన్ని మహేష్ సొంతం కావటం ఖాయం అన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. అయితే అనుకున్నట్టుగా మహేష్ రికార్డ్‌లు తిరగరాయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇతర హీరోల రికార్డులనే కాదు, తన పాత రికార్డులను కూడా బ్రేక్ చేయలేకపోయాడు. తొలి రోజు కలెక్షన్ల విషయంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సర్థార్ గబ్బర్‌సింగ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయగా, ఆ రికార్డ్లను బ్రహ్మోత్సవంతో మహేష్ తిరగరాస్తాడని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. మహేష్, సర్థార్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. సర్థార్ గబ్బర్‌సింగ్ 29 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తే, మహేష్ మాత్రం 18 కోట్లతో సరిపెట్టుకున్నాడు. -
మంచి మాట చెప్పండి!
కొత్త సినిమా గురూ! తారాగణం: మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావు రమేశ్, శరణ్య తదితరులు. సంగీతం: మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం: గోపీ సుందర్ ఆర్ట్: తోట తరణి సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు నిర్మాత: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల-మహేశ్‌బాబు కాంబినేషన్లో సినిమా అనగానే అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ‘క్షణం’, ‘ఊపిరి’ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్న పీవీపీ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ ‘బ్రహ్మోత్సవం’ కావడంతో మంచి పండగలాంటి సినిమా చూడబోతున్నామనే ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. శుక్రవారం ఈ చిత్రం తెరపైకొచ్చింది. కథ ఏంటంటే... ‘బతకడం అంటే అమ్ముకోవడం కాదు... నలుగుర్నీ నమ్ముకోవడం’ అనే ఫిలాసఫీతో కోట్లు సంపాదించినా మనవాళ్లు చుట్టూ ఉండాలనుకునే వ్యక్తి చంటిబాబు (సత్యరాజ్). కేవలం తన మావగారు ఇచ్చిన 400 రూపా యలతో వ్యాపారం మొదలుపెట్టి, 400 కోట్లు సంపాదిస్తాడు. చంటిబాబుకి నా అన్నవాళ్లు లేకపోవడంతో భార్య తమ్ముళ్లను కూడా తన వాళ్లలా చూసుకుంటాడు. ఈ చంటిబాబు కొడుకే హీరో (మహేశ్‌బాబు). తండ్రితో కలిసి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. అయితే, భార్య తమ్ముళ్లలో ఒకరైన బుజ్జి (రావు రమేశ్) తన బావ చంటిబాబులా ఎదగలేకపోతున్నాననే బాధ, అసూయలతో రగిలిపోతూ ఉంటాడు. బావ ఆస్తి ఎలాగైనా తనకే రావాలని తన కూతురు (ప్రణీత)ను హీరోకిచ్చి చేద్దామను కుంటాడు. ఈలోపే హీరో- తన తండ్రి స్నేహితుని (‘శుభలేఖ’ సుధాకర్) కూతురు కాశీ అన్నపూర్ణతో (కాజల్) ప్రేమలో పడతాడు. కాశీకి కూడా ఇష్టమే అయినప్పటికీ వచ్చే పోయే బంధువులతో ఎప్పుడూ హడావిడిగా ఉండే ఇంట్లో ఎడ్జస్ట్ కాలేనంటుంది. దాంతో ఈ ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసిన బుజ్జి రగిలిపోతాడు. ఆ కోపంలో చంటిబాబును తిడతాడు. ఈ హఠాత్పరిణామంతో తల్లడిల్లిన చంటిబాబు చనిపోతాడు. తన మూలాలను వెతుక్కోవాలనే.. తన వాళ్లను కలవాలనుకుంటాడు హీరో. ఏడు తరాల వాళ్లను అన్వేషించే మజిలీలో హీరో చెల్లి ఫ్రెండ్ (సమంత) కూడా హీరోకు జత కలుస్తుంది. ఆ తరువాత ఏమైంది అన్నది తాపీగా చూడాల్సిన మిగతా కథ. తన కుటుంబానికి సంబంధించిన ఏడుతరాల వాళ్లను కలుసుకునే హీరో పాత్రలో మహేశ్‌బాబు అందంగా కనిపిస్తారు. సినిమాలో చెప్పుకోదగ్గది అసూయతో రగిలిపోయే పాత్రలో రావు రమేశ్ నటన. ఇంటర్వెల్‌కు ముందు అచ్చంగా ప్రేక్షకుల లానే ఆలోచిస్తూ, ఆ పాత్ర చెప్పే డైలాగులు. అక్కడ క్కడ కొన్ని సీన్లు మనసును తాకుతాయి. పీవీపి ఎంతో గ్రాండియర్‌గా నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ తోటతరణి సెట్స్, రత్న వేలు సినిమాటోగ్రఫీ ఆయువుపట్టుగా నిలిచాయి. ఈ చిత్రంలో ‘ఓ మంచి మాట చెప్పండి’ అనే డైలాగుంటుంది. సినిమా చూసినవాళ్లకా మాట చెప్పాలనిపిస్తే ఈ సినిమా ఉత్సవమే. -
'బ్రహ్మోత్సవం' మూవీ రివ్యూ
టైటిల్: బ్రహ్మోత్సవం జానర్: ఫ్యామిలీ డ్రామా తారాగణం: మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావూ రమేష్ ఇంకా చాలా మంది... సంగీతం: మిక్కీ జే మేయర్ దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్మాత: పీవీపీ సినిమా, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో చేసిన సినిమా బ్రహ్మోత్సవం. గతంలో మహేష్ హీరోగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన బ్రహ్మోత్సవం, రిలీజ్‌కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. సమ్మర్ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న బ్రహ్మోత్సవం వెండితెర మీద పండగ వాతావరణం తీసుకు వచ్చిందా...? కథ : రూ. 400తో మొదలు పెట్టి రూ. 400 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీకి ఓనర్ అయిన మంచిమనిషి చంటబ్బాయి (సత్యరాజ్). నా అన్న వాళ్లంతా తన చుట్టే ఉండాలన్న కోరికతో తన నలుగురు బావమరుదులను తన వ్యాపారంతో పాటు కుటుంబంలోనూ భాగస్వాములను చేసుకుంటాడు. తన ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఓ ఉత్సవంలా జరుపుతూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. చంటబ్బాయి కొడుకు (మహేష్ బాబు) కూడా తండ్రి లాగే అందరూ తనతోనే ఉండాలనుకుంటాడు. చంటబ్బాయికి సమాజంలో, కుటుంబంలో ఉన్న గౌరవం చూసి ఆయన పెద్ద బావమరిది (రావు రమేష్)కి అసూయ కలుగుతోంది. తన కూతురిని చంటబ్బాయి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి, పెత్తనం అంతా తనదవుతుందనుకుంటాడు. కానీ అదే సమయంలో ఆ ఇంటికి చుట్టంగా వచ్చిన అమ్మాయి (కాజల్ అగర్వాల్)తో చంటబ్బాయి కొడుకు చనువుగా ఉండటం చూసి వారి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. అతన్ని వారించాలని ప్రయత్నించిన చంటబ్బాయి, అతనన్న మాటలతో బాధపడతాడు. అదే బాధలో తన కోరికేంటో కొడుక్కి చెబుతూ కొడుకు చేతుల్లోనే చనిపోతాడు. చంటబ్బాయి కోరిక ఏంటి, ఆ కోరిక తీర్చడానికి అతని కొడుకు ఏం చేశాడన్నదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. హీరోయిన్లకే అసూయ పుట్టించేంత అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. మహేష్ బాబు లుక్, పర్ఫామెన్స్ ఒకదానితో ఒకటి పోటి పడ్డట్టుగా కనిపించింది. సినిమాలో కీలక పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నాడు. ఆనందంగా ఉన్న కుటుంబంలో కల్లోలం సృష్టించే పాత్రలో సరిగ్గా సరిపోయాడు. హీరో తండ్రి పాత్రలో సత్యరాజ్ మంచి నటన కనబరిచాడు. హుందాతనంతో పాటు సెంటిమెంట్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. ప్రణీతకు పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం లేకపోయినా స్క్రీన్కు బాగానే గ్లామర్ యాడ్ చేసింది. తొలి భాగంలో హీరోయిన్గా కనిపించిన కాజల్, సెటిల్డ్ పర్ఫామెన్స్తో మెప్పించింది. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇక సమంత మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించింది. చిలిపితనం, అల్లరి, అదే స్థాయిలో ఎమోషన్స్ చూపిస్తూ కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఇతర పాత్రలో నరేష్, షియాజీ షిండే, కృష్ణభగవాన్, తనికెళ్ల భరణి, జయసుధ లాంటి లెక్కకు మించిన నటులు కథను నడిపించడంలో తమ వంతు పాత్ర పోషించారు. సాంకేతిక నిపుణులు : నలుగురితో కలిసుంటే బాగుంటుంది అన్న చిన్న పాయింట్‌ను ఇంత భారీ స్థాయిలో ఇంత రిచ్‌గా తెర మీద ప్రజెంట్ చేయటంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విజయం సాధించాడు. ముఖ్యంగా ఇంతటి భారీ స్టార్ కాస్ట్‌ను ఒకేసారి తెరమీద చూపించటం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన శ్రీకాంత్, మరోసారి తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ లాంటి సూపర్ స్టార్‌ను హీరోగా తీసుకొని కూడా తన స్టైల్ సినిమాతోనే ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అనవసరమైన కామెడీ ట్రాక్‌లు, యాక్షన్ సీన్స్ ఇరికించకుండా కథానుగుణంగా సినిమా అంతా ఉమ్మడి కుటుంబంలో జరిగే పండుగలా తెరకెక్కించాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ముఖ్యంగా హరిద్వార్, కాశీ లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించిన సన్నివేశాలు చూపు తిప్పుకోనివ్వవు. మిక్కీ జే మేయర్ సంగీతంతో పాటు గోపిసుందర్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : మహేష్ బాబు రావూ రమేష్ సినిమాటోగ్రఫి క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ మొత్తమ్మీద ఈ సినిమా కుటుంబ బాంధవ్యాల విలువలు తెలిపే వెండితెర ఉత్సవం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్
హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీ ఆడియో మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఓ సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రిన్స్ కు జతగా సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన బ్రహ్మోత్సవం సినిమాలోని 'వచ్చింది కదా అవకాశం' సాంగ్ మేకింగ్ వీడియోను మహేష్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్రహ్మోత్సవం మ్యూజిక్ బిగిన్స్ అంటూ కమెంట్ చేశారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులతోపాటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా ఈ సాంగ్ మేకింగ్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకోవడంవిశేషం.అభిమానులందరూ పండగ చేసుకుంటున్న ఆ వీడియో మీ కోసం. కాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో వేడుక శనివారం సాయంత్రం జరగనుండగా మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ సహకారం అందిస్తున్నాడట. మరోవైపు ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. #VacchindiKadaAvakasamMaking #BrahmotsavamMusicBegins!!https://t.co/0XIwmNkoks — Mahesh Babu (@urstrulyMahesh) 7 May 2016