సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్ | maheshbabu shares song of making video | Sakshi
Sakshi News home page

సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్

Published Sat, May 7 2016 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన  మహేష్

సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్

హైదరాబాద్‌:  వరుస హిట్లతో దూసుకుపోతున్న సూపర్‌స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీ ఆడియో  మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఓ సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు.     ప్రిన్స్ కు జతగా సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న   శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన బ్రహ్మోత్సవం సినిమాలోని 'వచ్చింది కదా అవకాశం' సాంగ్ మేకింగ్ వీడియోను మహేష్ బాబు ట్విట్టర్‌లో  పోస్ట్ చేశారు.  బ్రహ్మోత్సవం మ్యూజిక్  బిగిన్స్  అంటూ    కమెంట్  చేశారు.
 
భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులతోపాటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా ఈ సాంగ్ మేకింగ్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకోవడంవిశేషం.అభిమానులందరూ పండగ చేసుకుంటున్న ఆ వీడియో మీ కోసం.

కాగా సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా  తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం'  చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో వేడుక శనివారం సాయంత్రం జరగనుండగా మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్  చేస్తున్నట్టు సమాచారం. మిక్కీ జె మేయర్  సంగీతం  సమకూర్చిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ సహకారం అందిస్తున్నాడట. మరోవైపు ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement