song making video
-
కల్వకుంట్ల హిమాన్షు పాట.. కేటీఆర్ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే తన నాయకత్వ ప్రతిభతో మంత్రి కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అందరిన్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా తనలో ఉన్న మరో టాలెంట్‌ను ప్రపంచానికి చూపించి ప్రశంసలు పొందాడు. ‘గోల్డెన్ అవర్’ హిమాన్షు రావు ఆలపించారు. ఈ ఇంగ్లిష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడు. అయితే, అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ (JVKE) ఈ పాటను ఆలపించారు. Super proud and excited for my son @TheRealHimanshu 😊 I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK — KTR (@KTRBRS) February 17, 2023 ఇక, తాను పాడిన సాంగ్‌ను హిమాన్షు.. ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్లో షేర్ చేశారు. కాగా, తన కొడుకు పాట విని మంత్రి కేటీఆర్.. మురిసిపోయారు. పాటకు ఫిదా అవుతూ.. సోషల్ మీడియాలో ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జయిటెడ్ ఫర్ మై సన్’ అంటూ కామెంట్స్ చేశారు. ‘I loved it; Hope you all do too’ అంటూ మెచ్చుకున్నారు. ఇక, పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పాట విన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. A beautiful and soothing euphony ❤️ So proud of you alludu @TheRealHimanshu , already waiting to hear more beautiful music by you. God bless you !! https://t.co/9PqqApnlJF — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2023 హిమాన్షు పాటపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చెవులకు శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు అల్లుడు.. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నదని పొగిడారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు అని పేర్కొన్నారు. అంతేకాదు, హిమాన్షు చేసే మరో మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు. -
దారి చూపే పాట
‘‘మనుషులందరూ సమస్యల కూడలిలో చిక్కుకున్నప్పుడు, ఎటు పోవాలో అర్థం కానప్పుడు ఓదార్పుగా, కొంతసేపు ఉపశమనంగా ఉండేందుకు, స్ఫూర్తి నింపేందుకు, దారి చూపేందుకు పాట ఉపయోగపడుతుంది’’ అంటున్నారు ప్రముఖ గాయకురాలు కేయస్ చిత్ర. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపడానికి కళాకారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేయస్ చిత్ర కూడా ఓ పాటను పాడి, రిలీజ్ చేశారు. 1972లో మలయాళ చిత్రం ‘స్నేహదీపమే మిళి తురక్కు’లో జానకి పాడిన ‘లోకం ముళువన్ సుగం పకరనాయి...’ అంటూ సాగే పాటను ఈ సందర్భంగా కొత్తగా ఆలపించారు చిత్ర. ఆమెతో పాటు 22 మంది గాయకులు (సుజాత, కావాలం శ్రీ కుమార్, షరత్, శ్రీరామ్, ప్రీత, శ్వేతా, సంగీత, విదు ప్రతాప్, రిమి టామీ, అఫ్జల్, జ్యోత్స్న, నిషాద్, రాకేష్, టీను, రవిశంకర్, దేవానంద్, రేంజిని జోస్, రాజ్య లక్ష్మి, రమేష్ బాబు, అఖిలా ఆనంద్, దివ్యా మీనన్, సచిన్ వారియర్ ) గొంతు కలిపారు. ఈ పాటలోని ఒక్కో వాక్యాన్ని ఒక్కో సింగర్ పాడి, రికార్డ్ చేసి, వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ‘‘కరోనా వైరస్ పూర్తిగా అంతం అయిపోవాలని, మళ్లీ ప్రపంచమంతా శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఈ పాటను దేవుడికి ప్రార్థన గీతంలా పాడాం’’ అని పేర్కొన్నారు చిత్ర. -
సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్
హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీ ఆడియో మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఓ సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రిన్స్ కు జతగా సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన బ్రహ్మోత్సవం సినిమాలోని 'వచ్చింది కదా అవకాశం' సాంగ్ మేకింగ్ వీడియోను మహేష్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్రహ్మోత్సవం మ్యూజిక్ బిగిన్స్ అంటూ కమెంట్ చేశారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులతోపాటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా ఈ సాంగ్ మేకింగ్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకోవడంవిశేషం.అభిమానులందరూ పండగ చేసుకుంటున్న ఆ వీడియో మీ కోసం. కాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో వేడుక శనివారం సాయంత్రం జరగనుండగా మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ సహకారం అందిస్తున్నాడట. మరోవైపు ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. #VacchindiKadaAvakasamMaking #BrahmotsavamMusicBegins!!https://t.co/0XIwmNkoks — Mahesh Babu (@urstrulyMahesh) 7 May 2016