కల్వకుంట్ల హిమాన్షు పాట.. కేటీఆర్‌ ప్రశంస | KTR Son Himanshu Rao Croon Golden Hour Song | Sakshi
Sakshi News home page

సూపర్‌ అల్లుడు.. హిమాన్షు పాటకు ఫిదా అయిన ఎమ్మెల్సీ కవిత

Published Fri, Feb 17 2023 7:57 PM | Last Updated on Fri, Feb 17 2023 8:46 PM

KTR Son Himanshu Rao Croon Golden Hour Song - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే తన నాయకత్వ ప్రతిభతో మంత్రి కేటీఆర్‌ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అందరిన్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా తనలో ఉన్న మరో టాలెంట్‌ను ప్రపంచానికి చూపించి ప్రశంసలు పొందాడు. ‘గోల్డెన్‌ అవర్‌’ హిమాన్షు రావు ఆలపించారు. ఈ ఇంగ్లిష్‌ సాంగ్‌ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు. అచ్చం జాకబ్‌ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్‌ సాంగ్‌ పాడాడు. అయితే, అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్‌ లాసన్‌ (JVKE) ఈ పాటను ఆలపించారు. 

ఇక, తాను పాడిన సాంగ్‌ను హిమాన్షు.. ‘గోల్డెన్‌ అవర్‌ X హిమాన్షు కవర్‌’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో షేర్‌ చేశారు. కాగా, తన కొడుకు పాట విని మంత్రి కేటీఆర్‌.. మురిసిపోయారు. పాటకు ఫిదా అవుతూ.. సోషల్‌ మీడియాలో ‘సూపర్‌ ప్రౌడ్‌ అండ్ ఎగ్జయిటెడ్‌ ఫర్‌ మై సన్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. ‘I loved it; Hope you all do too’ అంటూ మెచ్చుకున్నారు. ఇక, పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పాట విన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

హిమాన్షు పాటపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. చెవులకు శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు అల్లుడు.. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నదని పొగిడారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు అని పేర్కొన్నారు. అంతేకాదు, హిమాన్షు చేసే మరో మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement