నా చెల్లి డైనమిక్‌.. కూతురు పుట్టాక జీవితం మారిపోయింది: కేటీఆర్‌ | Minister KTR Interesting Comments Over His Family | Sakshi
Sakshi News home page

మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా.. నా భార్యకు ఓపిక ఎక్కువ: కేటీఆర్‌

Published Sun, Nov 19 2023 12:44 PM | Last Updated on Sun, Nov 19 2023 2:03 PM

Minister KTR Interesting Comments Over His Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను. ప్రజా జీవితంలో ఉండటం వల్ల నాన్న కేసీఆర్‌ ప్రభావం నాపై చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉండేది. నా చెల్లి కవిత చాలా డైనమిక్‌.. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్‌. తన కుటుంబ సభ్యుల గురించి కీలక కామెంట్స్‌ చేశారు కేటీఆర్‌

కాగా, మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీసీ కాకతీయలో వివిధ రంగాల మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మా కుటుంబంలోనే మా చెల్లి కవిత ధైర్యవంతురాలు. మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నారు. నా చిన్నతనం నుంచి నాన్న ప్రభావం ఎక్కువగానే ఉంది. నా భార్యకు ఓపిక ఎక్కువ. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. కోవిడ్‌ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా నిలిచారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు. 

మహిళలకు ఎంతో చేశాం..
ప్రతీ ఇంటికీ నీళ్లు అందించాం. మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాం. ప్రతీ చిన్నారిపై రూ.10వేలు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 61 శాతానికి పెరిగాయి. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. మేము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేసాము ఇంకా చేయాల్సిన ఉన్నాయి. మహిళా యూనివర్సిటీ , కల్యాణ లక్ష్మీ , అమ్మఒడి సేవలు వంటివి  తెచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తాం. ప్రతిపక్షాలు మాపై  సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదు.

మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నాం. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారు. ప్రతి పక్షాలకు కూడా  మేమే గెలుస్తామని తెలుసు కానీ వాళ్లు నటిస్తున్నారు. రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా. రక్షణ పరంగా ఇప్పటికే షీ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చాం’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement