
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు.
కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment