నిజామాబాద్ అర్బన్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్‌లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) వినూత్న రీతిలో స్పందించింది. ఒకే ఫ్లెక్సీలో హిమాన్షును ఒకవైపు అభినందిస్తూ.. మరోవైపు సమస్యలపై సీఎంను నిలదీద్దాం రావాలంట స్వాగతం పలికింది. ‘ఒక్క స్కూల్ కాదు, తెలంగాణలోని అన్ని పాఠశాలలను మారుద్దాం.. టీజీవీపీలోకి స్వాగతం.. కలిసి ఉద్యమిద్దాం.. మీ తాతను నిలదీద్దాం’అని ఫ్లెక్సీలో పేర్కొంది.
నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం టీజీవీపీ నిరసన తెలిపింది. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో బెంచీ లు సరిగ్గా లేవని, వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయని, కరెంట్ షాక్, పాము కాటుతో విద్యార్థులు మరణిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హిమాన్షు కార్యక్రమంతో కళ్లు తెరవాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్, దేవేందర్, నేతలు ప్రశాంత్, సన్నీ, రాహుల్, మాధవ్, ధీరజ్, ఫణీందర్, రాకేష్, రాజేందర్ పాల్గొన్నారు.
ఈ అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘సీఎం కేసీఆర్ మనువడు నిజాయితీగా మాట్లాడిండు. శిథిలావస్థకు చేరిన విద్యావస్థపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా. పాఠశాల వ్యవస్థను తెలుసుకోవడానికి హిమాన్సును బీఎస్పీ వాలంటీర్గా చేరమని కోరుతున్నా. తాత. తండ్రి దాచిన ప్రపంచాన్ని నేను చూపిస్తా... హిమాన్షు లాగా చాలమందికి సేవ చేయాలని ఉంటుంది. కాని హిమాన్షుకు వచ్చినంత సీఎస్ అర్ పండ్స్ రావడం లేదు. దాతలు సహకరించడం లేదు.. తాత, తండ్రి చేస్తున్నా స్వార్థ రాజకీయాలు బాబు త్వరలోనే తెలుసుకుంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు.
చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
Comments
Please login to add a commentAdd a comment