rs praveenkumar
-
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
తాత-మనవడు: సీఎం కేసీఆర్‌ను నిలదీద్దాం, రా.. హిమాన్షు!
నిజామాబాద్ అర్బన్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్‌లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) వినూత్న రీతిలో స్పందించింది. ఒకే ఫ్లెక్సీలో హిమాన్షును ఒకవైపు అభినందిస్తూ.. మరోవైపు సమస్యలపై సీఎంను నిలదీద్దాం రావాలంట స్వాగతం పలికింది. ‘ఒక్క స్కూల్ కాదు, తెలంగాణలోని అన్ని పాఠశాలలను మారుద్దాం.. టీజీవీపీలోకి స్వాగతం.. కలిసి ఉద్యమిద్దాం.. మీ తాతను నిలదీద్దాం’అని ఫ్లెక్సీలో పేర్కొంది. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం టీజీవీపీ నిరసన తెలిపింది. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో బెంచీ లు సరిగ్గా లేవని, వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయని, కరెంట్ షాక్, పాము కాటుతో విద్యార్థులు మరణిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హిమాన్షు కార్యక్రమంతో కళ్లు తెరవాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్, దేవేందర్, నేతలు ప్రశాంత్, సన్నీ, రాహుల్, మాధవ్, ధీరజ్, ఫణీందర్, రాకేష్, రాజేందర్ పాల్గొన్నారు. ఈ అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘సీఎం కేసీఆర్ మనువడు నిజాయితీగా మాట్లాడిండు. శిథిలావస్థకు చేరిన విద్యావస్థపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా. పాఠశాల వ్యవస్థను తెలుసుకోవడానికి హిమాన్సును బీఎస్పీ వాలంటీర్‌గా చేరమని కోరుతున్నా. తాత. తండ్రి దాచిన ప్రపంచాన్ని నేను చూపిస్తా... హిమాన్షు లాగా చాలమందికి సేవ చేయాలని ఉంటుంది. కాని హిమాన్షుకు వచ్చినంత సీఎస్ అర్ పండ్స్ రావడం లేదు. దాతలు సహకరించడం లేదు.. తాత, తండ్రి చేస్తున్నా స్వార్థ రాజకీయాలు బాబు త్వరలోనే తెలుసుకుంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయం
సిద్దిపేటజోన్: తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజుల సమయం ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మరో 55 మంది కార్యకర్తలను తయారు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుగాను ‘మై బీఎస్పీ టాక్ ఇన్’అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదన్నారు. ఇదీ చదవండి: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ! -
ప్రగతి భవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజు ఎంతో దూరం లేదు
హస్తినాపురం(హైదరాబాద్): తెలంగాణలో దోపిడీ, గడీల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని.. బంగారు తెలంగాణ కాదు బంజరు తెలంగాణగా తయారయ్యిందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్బండవర్గాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. అది మరచిపోయి అనచివేతే లక్ష్యంగా పని చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతిభవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజులు ఎంతో దూరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 800మంది వివిధ పార్టీల నుంచి ప్రవీణ్‌కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పసుల బాలస్వామి, కటికల శ్రీహరి, దర్మేందర్, రాంచందర్, విజయ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేసీఆర్ పోటీ చేస్తే బరిలోకి రేవంత్‌రెడ్డి -
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరపాలి
లక్డీకాపూల్ (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు గణన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనగణనకు ఏర్పాటు చేసిన ఐక్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ డేటా తన దగ్గర ఉంచుకుని కులం ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అధికారులను ఎంతమందిని పెట్టుకున్నారో పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. చివరికి కాళేశ్వరంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్ అంటే అందరి వాడని, కొందరి వాడు కాదన్నారు. గ్రామాల్లో ప్రతి ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జన గణన కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అనిల్, శారద, కృçష్ణుడు, రియాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు
-
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు
సాక్షి, కరీంనగర్: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ జడ్డి ఆదేశించారు. కాగా హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. మంగళవారం ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్కు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. -
ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్ మెంబర్స్ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దారుణాలను ఎండగడతారనే దాడి..! దళిత నేత శ్రీశైలంపై స్వేరోస్ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ అండదండలతో స్వేరోలు రెచ్చిపోతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. తమ బాగోతాన్ని బయటపెడతాడనే స్వేరోలు శ్రీశైలంపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంపై దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని కిరణ్ డిమాండ్ చేశారు. స్వేరోస్ (స్టేట్ వెల్ఫేర్ ఎయిరో) అంటే జాతి సంక్షేమం కోసం ఆకాశం (అనంతం) హద్దుగా పనిచేసేవారు అని అర్థం. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2012 అక్టోబర్ 19న ఈ సంస్థను స్థాపించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ -
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ షాద్‌నగర్‌రూరల్: సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని భవిష్యత్‌లో స్వేరోస్ ప్రపంచంలోనే ఒకబలమైన శక్తిగా ఎదగాలని గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సహయసహకారాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. పట్టణంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్లో వర్క్‌షాప్ ఆన్ స్వేరోయిజం(అంబేద్కరిజం) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ హాజరై డాక్టర బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే చిత్రపటాలకు పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన స్వేరోస్, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బడుగుబలహీన వర్గాల ప్రజల అభివృద్దికి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కృషిచేశారని, ఆయన చలవతోనే బీదప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నారు. ఆంబేద్కర్ ఆశించిన ఆశయసాధనకోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతివిద్యార్థిలో ఒకఆలోచన‡ మొదలైందని, యెగాలో ప్రపంచస్థాయిలో గెలిచిన సుందర్రాజ్, ఎవరెస్ట్‌ను ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లా ఎదగాలని విద్యార్థులు ఆలోచిస్తున్నారని ఉత్సాహపరిచారు. ప్రపంచంలో కులాలు, మతాలు, వర్గాలు ఇలా ఎన్నోరకాలుగా చెప్పుకుంటారని, ఈ ప్రపంచంలో రెడువర్గాలు మాత్రమే ఉన్నాయని, అవి స్వేరోస్, జీరోస్ మాత్రమేనన్నారు. ఎన్క్యూపీతో విద్యార్థులకుమేలు... గురుకుల విద్యావిధానంలో తీసుకువస్తున్న ఎన్క్యూపీ విధానాన్ని కొందరు తమస్వార్థానికి వ్యతిరేకిస్తున్నారేతప్పా పాలసీతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పాలసీ గురించి మీ గ్రామంలో, మీ కుటుంబసభ్యలతో చర్చించాలని సూచించారు. మనబతుకులు మారాలంటే మన జీవన విదానంలో మార్పు వచ్చినప్పుడే అభివృద్దిపథంలో ముందుకు సాగుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‡ గురుకుల పాఠశాలలకు రూ.5వేలకోట్లను మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్కిల్స్, కాంపిటేషన్ స్కిల్స్‌లో నైపుణ్యతను పెంపొందించుకొని రాణించాలన్నారు. రానున్న ఒలింపిక్స్‌లో మన స్వేరోస్ రాణించాలని, అందుకు ప్రతిజిల్లాకు ఒకస్పోర్ట్స్ అకాడమీని పెట్టనున్నామన్నారు. రానున్న 2028 ఒలింపిక్స్‌లో 5పతకాలు స్వేరోస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, గువ్వలబాల్రాజ్, జాయింట్‌కలెక్టర్ రాంకిషన్, తహసీల్దారు చందర్రావు, స్వేరోస్ కేంద్రకమిటి సభ్యులు స్వాములు, సుధాకర్, రాష్ట్రఅధ్యక్షులు రాజన్న, నాయకులు కృష్ణ, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని భవిష్యత్‌లో స్వేరోస్ ప్రపంచంలోనే ఒకబలమైన శక్తిగా ఎదగాలని గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సహయసహకారాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. పట్టణంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్లో వర్క్‌షాప్ ఆన్ స్వేరోయిజం(అంబేద్కరిజం) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ హాజరై డాక్టర బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే చిత్రపటాలకు పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన స్వేరోస్, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బడుగుబలహీన వర్గాల ప్రజల అభివృద్దికి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కృషిచేశారని, ఆయన చలవతోనే బీదప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నారు. ఆంబేద్కర్ ఆశించిన ఆశయసాధనకోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతివిద్యార్థిలో ఒకఆలోచన‡ మొదలైందని, యెగాలో ప్రపంచస్థాయిలో గెలిచిన సుందర్రాజ్, ఎవరెస్ట్‌ను ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లా ఎదగాలని విద్యార్థులు ఆలోచిస్తున్నారని ఉత్సాహపరిచారు. ప్రపంచంలో కులాలు, మతాలు, వర్గాలు ఇలా ఎన్నోరకాలుగా చెప్పుకుంటారని, ఈ ప్రపంచంలో రెడువర్గాలు మాత్రమే ఉన్నాయని, అవి స్వేరోస్, జీరోస్ మాత్రమేనన్నారు. ఎన్క్యూపీతో విద్యార్థులకుమేలు... గురుకుల విద్యావిధానంలో తీసుకువస్తున్న ఎన్క్యూపీ విధానాన్ని కొందరు తమస్వార్థానికి వ్యతిరేకిస్తున్నారేతప్పా పాలసీతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పాలసీ గురించి మీ గ్రామంలో, మీ కుటుంబసభ్యలతో చర్చించాలని సూచించారు. మనబతుకులు మారాలంటే మన జీవన విదానంలో మార్పు వచ్చినప్పుడే అభివృద్దిపథంలో ముందుకు సాగుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‡ గురుకుల పాఠశాలలకు రూ.5వేలకోట్లను మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్కిల్స్, కాంపిటేషన్ స్కిల్స్‌లో నైపుణ్యతను పెంపొందించుకొని రాణించాలన్నారు. రానున్న ఒలింపిక్స్‌లో మన స్వేరోస్ రాణించాలని, అందుకు ప్రతిజిల్లాకు ఒకస్పోర్ట్స్ అకాడమీని పెట్టనున్నామన్నారు. రానున్న 2028 ఒలింపిక్స్‌లో 5పతకాలు స్వేరోస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, గువ్వలబాల్రాజ్, జాయింట్‌కలెక్టర్ రాంకిషన్, తహసీల్దారు చందర్రావు, స్వేరోస్ కేంద్రకమిటి సభ్యులు స్వాములు, సుధాకర్, రాష్ట్రఅధ్యక్షులు రాజన్న, నాయకులు కృష్ణ, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులకు శ్రీకారం
వచ్చే జూన్ కల్లా 250 కొత్త గురుకులాల ప్రారంభం వీటి ఏర్పాటుకు మొత్తం రూ.5,500 కోట్ల వ్యయం డిగ్రీ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సులకు భిన్నంగా కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి లభించేలా సంక్షేమ గురుకుల డిగ్రీ కోర్సుల సిలబస్‌కు తుదిరూపునిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, పరిశ్రమల్లో సిబ్బంది, ఉద్యోగులు, సదుపాయాల కల్పనకు ఉత్పన్నమయ్యే అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను రూపొందిస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమల ప్రతినిధులతో చర్చలప్రక్రియను ప్రారంభించారు. ఆంగ్లం, కంప్యూటర్ వినియోగంలో విద్యార్థులు పైచేయిని సాధించేలా శిక్షణను ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్షను నిర్వహించడం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీలను పెద్ద పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జూన్‌కల్లా కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు.. వచ్చే జూన్ చివరికల్లా రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అవసరమైన బడ్జెట్, మౌలిక సదుపాయాలు, టీచర్లు, సిబ్బంది, భవనాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖలు వెల్లడించాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల సొసైటీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. 250 గురుకులాల ఏర్పాటుకు రూ.5,500 కోట్లు.. కొత్తగా ఏర్పాటు చేయనున్న 250 గురుకుల విద్యాలయాల ద్వారా 1.6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఏర్పాటుకు రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేస్తున్నారు. ఒక్కో రె సిడెన్షియల్ స్కూల్‌కు 7 ఎకరాల స్థలంతో పాటు రూ.22 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ విద్యాసంవత్సరం (2016-17) నుంచే ఎస్సీ విద్యార్థుల కోసం వంద రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ విద్యార్థుల కోసం 70 గురుకులాలు, ఎస్టీ విద్యార్థులకు 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళల కోసం 25, అబ్బాయిల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్, స్పానిష్నూ బోధిస్తాం.. ‘‘ డిగ్రీ నుంచే సివిల్స్, కేంద్ర, రాష్ట్ర, కార్పొరేట్ రంగాల్లోని పోటీ పరీక్షలకు అవసరమైన లాంగ్‌టర్మ్ శిక్షణను అందిస్తాం. దేశంలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిలో సింహభాగం తెలంగాణ వారికే దక్కేలా చూడాలన్నది ప్రభుత్వ ధ్యేయం. డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే. ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషలను బోధిస్తాం. సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఫ్రీలాన్సింగ్‌లో విద్యార్థులు ఆరితేరేలా తరగతులుంటాయి. బయట జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాం. వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి, స్కూల్ నుంచి బయటకు రాగానే ఉపాధి దొరికేలా సశక్తులను చేస్తాం. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్‌లలో శిక్షణనిచ్చేలా రూపొందిస్తున్నాం.’’ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి -
త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల
-గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గురుకుల కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు పేదరికంతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.