మాట్లాడుతున్న డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
Published Mon, Sep 5 2016 12:56 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
షాద్‌నగర్‌రూరల్: సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని భవిష్యత్‌లో స్వేరోస్ ప్రపంచంలోనే ఒకబలమైన శక్తిగా ఎదగాలని గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సహయసహకారాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. పట్టణంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్‌లో వర్క్‌షాప్ ఆన్ స్వేరోయిజం(అంబేద్కరిజం) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురుకుల పాశాలల రాష్ట్రకార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ హాజరై డాక్టర బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే చిత్రపటాలకు పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన స్వేరోస్, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బడుగుబలహీన వర్గాల ప్రజల అభివృద్దికి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కృషిచేశారని, ఆయన చలవతోనే బీదప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నారు. ఆంబేద్కర్ ఆశించిన ఆశయసాధనకోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతివిద్యార్థిలో ఒకఆలోచన‡ మొదలైందని, యెగాలో ప్రపంచస్థాయిలో గెలిచిన సుందర్‌రాజ్, ఎవరెస్ట్‌ను ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లా ఎదగాలని విద్యార్థులు ఆలోచిస్తున్నారని ఉత్సాహపరిచారు. ప్రపంచంలో కులాలు, మతాలు, వర్గాలు ఇలా ఎన్నోరకాలుగా చెప్పుకుంటారని, ఈ ప్రపంచంలో రెడువర్గాలు మాత్రమే ఉన్నాయని, అవి స్వేరోస్, జీరోస్ మాత్రమేనన్నారు.
ఎన్‌క్యూపీతో విద్యార్థులకుమేలు...
గురుకుల విద్యావిధానంలో తీసుకువస్తున్న ఎన్‌క్యూపీ విధానాన్ని కొందరు తమస్వార్థానికి వ్యతిరేకిస్తున్నారేతప్పా పాలసీతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పాలసీ గురించి మీ గ్రామంలో, మీ కుటుంబసభ్యలతో చర్చించాలని సూచించారు. మనబతుకులు మారాలంటే మన జీవన విదానంలో మార్పు వచ్చినప్పుడే అభివృద్దిపథంలో ముందుకు సాగుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‡ గురుకుల పాఠశాలలకు రూ.5వేలకోట్లను మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్‌స్కిల్స్, కాంపిటేషన్ స్కిల్స్‌లో నైపుణ్యతను పెంపొందించుకొని రాణించాలన్నారు. రానున్న ఒలింపిక్స్‌లో మన స్వేరోస్ రాణించాలని, అందుకు ప్రతిజిల్లాకు ఒకస్పోర్ట్స్ అకాడమీని పెట్టనున్నామన్నారు. రానున్న 2028 ఒలింపిక్స్‌లో 5పతకాలు స్వేరోస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, గువ్వలబాల్‌రాజ్, జాయింట్‌కలెక్టర్ రాంకిషన్, తహసీల్దారు చందర్‌రావు, స్వేరోస్ కేంద్రకమిటి సభ్యులు స్వాములు, సుధాకర్, రాష్ట్రఅధ్యక్షులు రాజన్న, నాయకులు కృష్ణ, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement