
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్‌ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.
ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
