Mahabub nagar crime
-
పోలీసుల అత్యుత్సాహం.. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి..
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం అడ్వకేట్ ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపూరి సుభాష్ రెడ్డి(75)ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గూడూరులో ఉన్న ఎన్ఆర్ఐకు చెందిన 5 ఎకరాల భూమిని స్థానిక రియల్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాసి రామ్ కొనేందుకు కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఎన్ఆర్ఐని పలుమార్లు పీఎస్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆరోపించారు. మాట వినకపోవడంతో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రానా ప్రతాప్.. ఎన్ఆర్ఐని అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించాడని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసేందుకు ఇంటిపై దాడి చేశారని అడ్వకేట్ చెప్పారు. గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారని అన్నారు. ఈ ఘటనపై రేపు డీజీపీకి, హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ రాపోలు భాస్కర్ తెలిపారు. నిందితునికి ఆశ్రయం కల్పించడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసుల మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ రాణా ప్రతాప్ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ! -
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
క్యాన్సర్ సోకిందని కన్న తండ్రిని..
జడ్చర్ల: చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన తండ్రికి క్యాన్సర్ సోకితే వెన్నంటి ఉండి వైద్యం చేయించాల్సింది పోయి.. అవగాహన లేక ఇంటికి తమకూ ఆ వ్యాధి సోకుతుందంటూ ఇంటికి దూరంగా వదిలిపెట్టారు. ఓ వైపు జబ్బు.. మరో వైపు కుటుంబసభ్యులు ఎవరూ పక్కన లేరనే క్షోభతో చివరికి ఓ తండ్రి తనువు చాలించిన అమానవీయమైన సంఘటన మంగళవారం బాదేపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వెంకటయ్య(65) క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. ఇతని భార్య కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా కుమారుడు రాజు, కోడలు పద్మ ఉన్నారు. వీరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా వెంకటయ్య మెడపై గల క్యాన్సర్ గడ్డ ఇటీవల పగలడంతో 15 రోజుల క్రితం ఇంటికి దూరంగా అతనిని స్థానిక ప్రభుత్వ గోదాముల దగ్గర గల పాడుబడిన కార్యాలయ గదిలో అతని కుమారుడు విడిచి వెళ్లాడు. నిత్యం చుట్టుపక్కల వారు లేదా కుమారుడు అతనికి కావాల్సిన ఆహారం, బీడీలు ఇచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తండ్రి క్యాన్సర్‌కు గురికావడంతో ఆ వ్యాధి తమకు సోకుతుందని చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడంతో ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లానని కుమారుడు రాజు ఈసందర్భంగా పేర్కొనగా.. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు అతనే తన తండ్రిని దూరంగా పెట్టాడని కాలనీవాసులు తెలిపారు. ఏదిఏమైనా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, చివరి సమయంలో కన్న తండ్రిని దూరంగా పెట్టడం అమానవీయమని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందజేత మృతుడు వెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని యార్డు చైర్మెన్ మురళి, నాయకులు పరమటయ్య, శేఖర్, చైతన్య, హరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కారు బోల్తా.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. మగనురు మండలంలోని నల్లగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వస్తున్నట్టు సమాచారం. దీంతో అదుపుతప్పిన కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కచ్చితంగా కడుపుకోతే!
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న కా న్పులపై దృష్టిసారిస్తాం. ప్రైవేట్లలో అధికంగా సిజేరియన్లు జరిగితే సంబంధిత ఆస్పత్రులపై నిఘాఉంచి కట్టడిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. నూటిలో 80 శాతం సాధారణ కాన్పులు చేస్తే 20 శాతం మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్లు చేయాల్సి ఉంటుంది. - డీఎంహెచ్ఓ రుక్మిణమ్మ మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల క క్కుర్తి మహిళలకు కడుపుకోతను మిగుల్చుతోంది. గర్భి ణి ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిందంటే చాలు మరో ఆలోచన చేయకుండా అవసరం ఉన్నా.. లేకపోయినా సి జేరియన్ (ఆపరేషన్ ద్వారా కాన్పుచేసే ప్రక్రియ) చేసేస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఉమ్మినీరు తాగింది అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి..లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదం అని హడావుడి చేయగానే గర్భిణి వెంట సా యం కోసం వచ్చిన బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై అంగీకరించేస్తున్నారు. ఈ విషయం లో మహిళల ఆరోగ్యం ఎలా ఉన్నా తమకేమీ పట్టనట్లు గా కార్పొరేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ జరిగే ప్రసవాల్లో సగానికి పైగా సిజేరియన్లు జరుతున్నాయంటే వారి ధనదాహం ఎలా ఎందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగితే.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్లకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ప్రసవాలు నిర్వహించే ఆస్పత్రులు 300 వరకు ఉన్నాయి. వా టిలో ప్రైవేట్ ఆస్పత్రులు 180 ఉన్నాయి. వీటిలో నెలకు సరాసరిగా 850 సిజేరియన్లు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 8456 ప్రసవాలు జరగ్గా, వాటిలో 3876 సిజేరియన్లు అయ్యాయి. ప్రైవేట్ఆస్పత్రుల్లో 11,342 ప్రసవాలకు గాను వాటిలో 8819 సిజేరియన్లు జరగడం గమనార్హం. కేవలం జిల్లా ఆస్పత్రిలోనే 3611 ప్రసవాలు జరగ్గా, అందులో సాధారణ కాన్పులు 2574, వెయ్యికి పైగా సిజేరియన్లు జరిగినట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. ఒకప్పుడు నూటిలో 20 శాతం మాత్రమే సిజేరియన్లు కాగా, మిగతావి సాధారణ కాన్పులు జరిగేవి. ఇప్పుడు కొందరు ప్రైవేట్వైద్యుల పుణ్యమా! అంటూ 80 శాతం మందికి సిజేరియన్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే పెద్దమొత్తంలో సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిజేరియన్ వల్ల కలిగే నష్టాలు గర్భిణికి ఒకసారి సిజేరియన్ చేస్తే రెండోసారి కూడా సిజేరియన్ చేయాలి. దీనివల్ల మహిళలు నడుంనొప్పి, కాళ్లనొప్పుల బారినపడతారు. అదే విధంగా సాధారణ ప్రసవమైతే రక్తస్రావం తక్కువ జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే రక్తస్రావం అధికంగా జరగడం వల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది. సాధారణ ప్రసవమైతే కేవలం రూ.ఐదు నుంచి రూ.10వేలు మాత్రమే ఫీజుగా వస్తుంది. అదే సిజేరియన్ అయితే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు కార్పొరేట్ ఆస్పత్రులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. సిజేరియన్‌కు తోడు గర్భిణులు తీసుకుంటున్న ఆహారం, ఫాస్ట్‌ఫుడ్, ఎలక్ట్రికల్ పరికరాలతో చేసిన వంటలు తినడం వంటి పలు కారణాల చేత కాన్పు సమయాల్లో ఇబ్బందులు తలెత్తి ఆపరేషన్లకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొద్దునిద్రలో వైద్యారోగ్యశాఖ జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ ఎలాగు కరువైంది. కనీసం ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా కట్టడిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. దీనికితోడు గ్రామీణప్రాంత ప్రజలకు ప్రసవాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సిజేరియన్ల వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో తెలియజేయాలి. కానీ వైద్యాధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ప్రజలకు సేవలు అందించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కిందిస్థాయి సిబ్బందిపై ఆధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్‌లో ఇబ్బందులు సిజేరియన్ జరిగిన మహిళలకు భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పుల కోసమే వైద్యులు ప్రయత్నించాలి. అత్యవసర పరిస్థితులు ఉన్న సమయంలోనే సిజేరియన్లు చేయాలి. మొదటి కాన్పులో సిజేరియన్ జరిగితే రెండో కాన్పులోను సిజేరియన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జరిగితే భవిష్యత్‌లో మహిళలు ఎక్కువగా కడుపునొప్పితో బాధపడాల్సి వస్తుంది. - డాక్టర్ మీనాక్షి, సీనియర్ గైనకాలజిస్ట్, మహబూబ్‌నగర్