ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న కా న్పులపై దృష్టిసారిస్తాం. ప్రైవేట్‌లలో అధికంగా సిజేరియన్‌లు జరిగితే సంబంధిత ఆస్పత్రులపై నిఘాఉంచి కట్టడిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. నూటిలో 80 శాతం సాధారణ కాన్పులు చేస్తే 20 శాతం మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్‌లు చేయాల్సి ఉంటుంది.
- డీఎంహెచ్‌ఓ రుక్మిణమ్మ
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల క క్కుర్తి మహిళలకు కడుపుకోతను మిగుల్చుతోంది. గర్భి ణి ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిందంటే చాలు మరో ఆలోచన చేయకుండా అవసరం ఉన్నా.. లేకపోయినా సి జేరియన్ (ఆపరేషన్ ద్వారా కాన్పుచేసే ప్రక్రియ) చేసేస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఉమ్మినీరు తాగింది అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి..లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదం అని హడావుడి చేయగానే గర్భిణి వెంట సా యం కోసం వచ్చిన బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై అంగీకరించేస్తున్నారు.
ఈ విషయం లో మహిళల ఆరోగ్యం ఎలా ఉన్నా తమకేమీ పట్టనట్లు గా కార్పొరేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ జరిగే ప్రసవాల్లో సగానికి పైగా సిజేరియన్లు జరుతున్నాయంటే వారి ధనదాహం ఎలా ఎందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగితే.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్లకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ప్రసవాలు నిర్వహించే ఆస్పత్రులు 300 వరకు ఉన్నాయి. వా టిలో ప్రైవేట్ ఆస్పత్రులు 180 ఉన్నాయి.
వీటిలో నెలకు సరాసరిగా 850 సిజేరియన్లు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 8456 ప్రసవాలు జరగ్గా, వాటిలో 3876 సిజేరియన్లు అయ్యాయి. ప్రైవేట్‌ఆస్పత్రుల్లో 11,342 ప్రసవాలకు గాను వాటిలో 8819 సిజేరియన్లు జరగడం గమనార్హం. కేవలం జిల్లా ఆస్పత్రిలోనే 3611 ప్రసవాలు జరగ్గా, అందులో సాధారణ కాన్పులు 2574, వెయ్యికి పైగా సిజేరియన్లు జరిగినట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. ఒకప్పుడు నూటిలో 20 శాతం మాత్రమే సిజేరియన్‌లు కాగా, మిగతావి సాధారణ కాన్పులు జరిగేవి. ఇప్పుడు కొందరు ప్రైవేట్‌వైద్యుల పుణ్యమా! అంటూ 80 శాతం మందికి సిజేరియన్‌లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే పెద్దమొత్తంలో సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సిజేరియన్ వల్ల కలిగే నష్టాలు
గర్భిణికి ఒకసారి సిజేరియన్ చేస్తే రెండోసారి కూడా సిజేరియన్ చేయాలి. దీనివల్ల మహిళలు నడుంనొప్పి, కాళ్లనొప్పుల బారినపడతారు. అదే విధంగా సాధారణ ప్రసవమైతే రక్తస్రావం తక్కువ జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే రక్తస్రావం అధికంగా జరగడం వల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది.
సాధారణ ప్రసవమైతే కేవలం రూ.ఐదు నుంచి రూ.10వేలు మాత్రమే ఫీజుగా వస్తుంది. అదే సిజేరియన్ అయితే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు కార్పొరేట్ ఆస్పత్రులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. సిజేరియన్‌కు తోడు గర్భిణులు తీసుకుంటున్న ఆహారం, ఫాస్ట్‌ఫుడ్, ఎలక్ట్రికల్ పరికరాలతో చేసిన వంటలు తినడం వంటి పలు కారణాల చేత కాన్పు సమయాల్లో ఇబ్బందులు తలెత్తి ఆపరేషన్‌లకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మొద్దునిద్రలో వైద్యారోగ్యశాఖ
జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ ఎలాగు కరువైంది. కనీసం ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా కట్టడిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. దీనికితోడు గ్రామీణప్రాంత ప్రజలకు ప్రసవాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సిజేరియన్ల వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో తెలియజేయాలి. కానీ వైద్యాధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ప్రజలకు సేవలు అందించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కిందిస్థాయి సిబ్బందిపై ఆధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భవిష్యత్‌లో ఇబ్బందులు
సిజేరియన్ జరిగిన మహిళలకు భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పుల కోసమే వైద్యులు ప్రయత్నించాలి. అత్యవసర పరిస్థితులు ఉన్న సమయంలోనే సిజేరియన్‌లు చేయాలి. మొదటి కాన్పులో సిజేరియన్ జరిగితే రెండో కాన్పులోను సిజేరియన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జరిగితే భవిష్యత్‌లో మహిళలు ఎక్కువగా కడుపునొప్పితో బాధపడాల్సి వస్తుంది.
- డాక్టర్ మీనాక్షి,
సీనియర్ గైనకాలజిస్ట్, మహబూబ్‌నగర్
కచ్చితంగా కడుపుకోతే!
Published Thu, Nov 28 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement