కేసీఆర్‌ ఫొటోలపై సీఎస్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి | KTR appeal to Telangana CS for restore content in government websites | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫొటోలు తొలగించకండి.. సీఎస్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి

Published Mon, Jul 29 2024 8:21 AM | Last Updated on Mon, Jul 29 2024 9:03 AM

KTR appeal to Telangana CS for restore content in government websites

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్‌ల డిజిటల్ విధ్వంసానికి సంబంధించి జోక్యం చేసుకుని చర్యను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ‘ఎక్స్‌’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు.

 

‘‘సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన కంటెంట్ తొలగించబడింది. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement