జోక్యం చేసుకోవాలని సీఎస్‌ను కోరిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్య మైన కంటెంట్ తొలగిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి అని, తెలంగాణ చరిత్రలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాల కోసం భద్రపరచడానికి చర్యలు అవసరమని పేర్కొన్నారు. సీఎస్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా వెళ్లాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
కేటీఆర్‌ను కలిసిన సింగరేణి కార్మికులు
సింగరేణి వే బ్రిడ్జ్‌ల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించాలని ‘సింగ రేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్‌లోడింగ్ లెవలింగ్ వర్క ర్స్ యూనియన్’ విజ్ఞప్తి చేసింది. యూనియన్ నాయకులు సోమవారం అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావును కలిశారు. సింగరేణిలో 47 వేబ్రిడ్జ్‌ల వద్ద 1,755 మంది కార్మికులు పనిచేస్తు న్నారని, వీరిలో భూ నిర్వాసితులు ఎక్కువమంది ఉన్నారని, తమకు పీస్ రేట్ ప్రకారం కూలీ చెల్లిస్తున్నారని వివరించారు.
మరోవైపు ఐదేళ్లకోమారు మెడికల్ ఫిట్‌నెస్ సొంత ఖర్చులతో చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. తమను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు సందడి చేశారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామ సమయంలో బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తుండగా అక్కడే ఉన్న వేములవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయనతో సెలీ్ఫలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment