సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. తాజాగా హిమాన్షు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నాడు. అయితే, ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
వివరాల ప్రకారం.. హిమాన్షు ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చదివే సమయంలో.. ఆ పరిసర ప్రాంత గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో షిమాన్షు పలుమార్లు మాట్లాడాడు. ఈ క్రమంలో పేద విద్యార్థులు చదివే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, పాఠశాలను దత్తత తీసుకున్నాడు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఈ విషయాలను ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ రాములు యాదవ్ వెల్లడించారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ దీనికి సంబంధించిన వివరాలను హిమాన్షు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు. దీంతో, ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ హిమాన్షును ప్రశంసిస్తున్నారు.
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰
Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0
ఇది కూడా చదవండి: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
Comments
Please login to add a commentAdd a comment