KTR's Son Himanshu Kalvakuntla Says Story About Serilingampally Govt Schoo l- Sakshi
Sakshi News home page

బెంచ్ మార్క్ సెట్ చేయాల‌ని ఇలా చేశాను: స్కూల్‌ ఓపెనింగ్‌లో హిమాన్షు స్పీచ్‌

Published Wed, Jul 12 2023 5:31 PM | Last Updated on Wed, Jul 12 2023 7:58 PM

KTR Son Kalvakuntla Himanshu Rao First Public Speeh At School Opening - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, నేడు(బుధవారం) హిమాన్షు పుట్టినరోజు. కాగా, తన బర్త్‌ డే రోజున తాను దత్తత తీసుకున్న గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమాన్షు తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టాడు. అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. 

అయితే, పాఠశాల ప్రారంభ వేడుకలో హిమాన్షు మాట్లాడుతూ.. నాకు ప‌బ్లిక్‌లో మాట్లాడ‌టం ఇదే మొదటిసారి. కొంచెం న‌ర్వ‌స్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముందు మాట్లాడుతున్న‌ట్లుంది. ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను విజిట్ చేశాను. రాత్రి స‌మ‌యాల్లో వ‌చ్చి కూడా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయిన‌ప్పుడు ఈ స్కూల్‌ను మా క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచ‌న‌తో విజ‌ట్ చేశాను. అంద‌రిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మ‌ల్‌గా చేసే అల‌వాటు లేదు. 

ఫస్ట్‌ టైమ్‌ ఈ స్కూల్‌కు వచ్చినప్పుడు పాఠశాలలో 10వేల మొక్కలు నాటాం. అయినప్పటికీ నాకు ఇంకా ఏదో చేయాలి అనిపించింది. చెట్లు పెట్టే కార్య‌క్ర‌మం ఎవ‌రైనా చేస్తారు.. మ‌నం కొత్త‌గా చేయాల‌ని చెప్పాను. స్కూల్‌కే ఒక పేరు తేవాల‌నుకున్నాం. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. స్కూల్ కండీష‌న్ చూసిన త‌ర్వాత ఆ బాధ‌ను మాట‌ల్లో చెప్పుకోలేక‌పోయాం. క‌ళ్ల‌ల్లోకి నీళ్లు వ‌చ్చాయి. ఆడ‌పిల్ల‌ల‌కు స‌రైన బాత్రూమ్స్ లేకుండే. రాళ్ల మ‌ధ్య‌లో పిల్ల‌లు ఆడుకుంటున్నారు. హెడ్ మాస్ట‌ర్ రూమ్‌లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్‌ను చూసి షాక‌య్యాను. దీంతో, రూ.40 ల‌క్ష‌లు ఫండ్ వ‌సూలు చేశాం. సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారు.

కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రశంసలు..
పేద‌రికాన్ని అరిక‌ట్టే ఉపాయం చదువుకున్న స‌మాజానికి ఉంటుంద‌ని మా తాత ఎప్పుడూ చెప్పేవారు. నా చ‌దువులో గ్రేడ్ త‌గ్గినా.. వంద మందికి మంచి చేసే అవ‌కాశం ఉంటే చేయాల‌ని నాన్న కూడా చెప్పారు. మా తాత ఆశీస్సులు, మా నాన్న ప్రేరణతో ఈ స్కూల్‌లో చాలా కార్య‌క్ర‌మాలు చేశాం. ఈ స్కూల్లో చ‌దివే పిల్ల‌లంద‌రూ పేదవారు. కూలీ ప‌నులు చేసుకునే కుటుంబాల‌కు చెందిన‌వారే. మీరంతా చాలా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. మా విజ‌న్‌ను కంటిన్యూ చేయండి. భ‌విష్య‌త్‌లో కూడా త‌ప్ప‌కుండా అండ‌గా ఉంటాం అని హిమాన్షు స్ప‌ష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి సబితకు, ఎమ్మెల్యే గాంధీకి హిమాన్షు ధన్యవాదాలు తెలిపాడు. 

ఇదిలా ఉండగా.. తన పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్రా గ్రామంలోని వృద్ధాశ్రమంలో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హిమాన్షు వృద్ధులకు పండ్లు, బట్టలు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement