ఈ సారి వర్మ టార్గెట్ మహేష్ | ram gopal varma tweets about brahmostavam | Sakshi
Sakshi News home page

ఈ సారి వర్మ టార్గెట్ మహేష్

Published Sun, May 22 2016 9:14 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

ఈ సారి వర్మ టార్గెట్ మహేష్ - Sakshi

ఈ సారి వర్మ టార్గెట్ మహేష్

ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ సెలబ్రీటిలపై విమర్శనాస్త్రాలను సంధించే రామ్ గోపాల్ వర్మ, కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసే వర్మ ఈ సారి మహేష్ బాబు లేటెస్ట్ సినిమాపై స్పందించాడు. అయితే డైరెక్ట్గా మహేష్ బాబు, బ్రహ్మోత్సవం అనే పేర్లను వాడకుండా జాగ్రత్తగా చురకలంటించాడు. ముందుగా బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ డ్యాన్స్ వీడియోతో పాటు ' అంతర్జాతీయ నృత్యదర్శకులు సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వారు, ఈ  డ్యాన్స్ చూసి నేర్చుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఫ్యామిలీ సినిమాను ఒక కుటుంబంలోని సభ్యులు ఎలా చూస్తారో వివరించాడు వర్మ. ' కుటుంబ కథా చిత్రానికి వెళ్తే.. తండ్రి హీరోయిన్ అందం చూస్తాడు. తల్లి వాళ్ల దుస్తులను చూస్తుంది. కూతురు థియేటర్లో కూర్చొని బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తుంది. కొడుకు నిద్రపోతాడు. ఈ విషయాన్ని ఎమ్ తెలుసుకోవాలి. శోభన్ బాబు లాంటి స్టార్లు మాత్రమే ఫ్యామిలీ సినిమాలు చేస్తారు. కృష్ణ, ఎన్టీఆర్లు కాదు. నాకు శోభన్ బాబు చేసిన దేవత సినిమా గుర్తుంది కానీ హీరో గుర్తులేడు. కానీ కృష్ణ, ఎన్టీఆర్ల సినిమాల స్టోరి గుర్తు లేదు. వాళ్లే గుర్తున్నారు. మిస్టర్ ఎమ్ స్టార్ డమ్ గురించి తెలుసుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు. ఈ స్థాయిలో విమర్శలకు దిగిన వర్మ చివరలో మిస్టర్ ఎమ్ ఈ కామెంట్స్ పాజిటివ్ గా తీసుకోవాలని కోరాడం కోసమెరుపు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement