'మీరు కూడా నాతో చేరండి'.. మెన్స్‌ డేపై మహేశ్ బాబు పోస్ట్! | Tollywood Prince Mahesh Babu Post On Mens Day wishes To everyone | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు అవే'.. మహేశ్ బాబు పోస్ట్

Published Tue, Nov 19 2024 3:47 PM | Last Updated on Tue, Nov 19 2024 4:48 PM

Tollywood Prince Mahesh Babu Post On Mens Day wishes To everyone

 టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో మొదటిసారి వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్‌ డే సందర్భంగా మహేశ్ బాబు చేసిన ట్వీట్‌ చేశాడు. మహిళలపై అత్యాచారాలు, వివక్ష, లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన మార్డ్‌ అనే సామాజిక కార్యక్రమంలో ప్రిన్స్‌ కూడా భాగమయ్యారు. మార్డ్‌ ప్రచారం కోసం బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌తో మన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ చేతులు కలిపారు.

మహేశ్‌ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..'గౌరవం, సానుభూతి, బలమైన వ్యక్తిత్వం మగవారి నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడి, తన ప్రతి చర్యలో దయ చూపేవాడే అసలైన రియల్‌మార్డ్. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు మీరు కూడా నాతో చేరండి' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్‌ అక్తర్‌ తండ్రి, రచయిత జావేద్‌ అక్తర్‌ హిందీలో రాసిన కవిత తెలుగు వర్షన్‌ను మహేశ్‌ బాబు పాడారు. తాను మార్డ్‌లో భాగమైనట్లు మహేశ్ బాబు పోస్ట్‌ పెట్టారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఫర్హాన్‌ అక్తర్‌ లింగ అసమానతకు, నేరాలకు వ్యతిరేకంగా ఈ మార్డ్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. తన భావాలన్నింటినీ ఓ కవితగా మార్చి ప్రచారం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement