International mens Day
-
'మీరు కూడా నాతో చేరండి'.. మెన్స్ డేపై మహేశ్ బాబు పోస్ట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో మొదటిసారి వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మహేశ్ బాబు చేసిన ట్వీట్ చేశాడు. మహిళలపై అత్యాచారాలు, వివక్ష, లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన మార్డ్ అనే సామాజిక కార్యక్రమంలో ప్రిన్స్ కూడా భాగమయ్యారు. మార్డ్ ప్రచారం కోసం బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో మన టాలీవుడ్ సూపర్ స్టార్ చేతులు కలిపారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..'గౌరవం, సానుభూతి, బలమైన వ్యక్తిత్వం మగవారి నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడి, తన ప్రతి చర్యలో దయ చూపేవాడే అసలైన రియల్మార్డ్. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు మీరు కూడా నాతో చేరండి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్ అక్తర్ తండ్రి, రచయిత జావేద్ అక్తర్ హిందీలో రాసిన కవిత తెలుగు వర్షన్‌ను మహేశ్ బాబు పాడారు. తాను మార్డ్‌లో భాగమైనట్లు మహేశ్ బాబు పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ లింగ అసమానతకు, నేరాలకు వ్యతిరేకంగా ఈ మార్డ్ ప్రచారాన్ని ప్రారంభించారు. తన భావాలన్నింటినీ ఓ కవితగా మార్చి ప్రచారం చేస్తున్నారు. Respect, empathy, and strength of character are the real traits of a man. He who stands for equality, and brings kindness into his every action is a #RealMard. This #InternationalMensDay, join me in my commitment with @MardOfficial to redefine #ModernMasculinity…— Mahesh Babu (@urstrulyMahesh) November 19, 2024 -
బీ ది మెన్.. బీ ది బ్రేవ్!
మాతృదినోత్సవం.. బాలల దినోత్సవం.. మహిళా దినోత్సవం.. ఇలా ఎన్నో రోజులు.. పండుగలను ఎంతో ఘనంగా జరుపుకొంటుంటాం. పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అదే ఏటా నవంబర్ 19న అంతర్జాతీయంగా జరుపుకోవాలని అందరూ సంకల్పం చెప్పుకొన్నారు. కానీ మహిళా దినోత్సవం మాదిరిగా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత ఉండదు. వాస్తవానికి చాలాకాలం నుంచి పురుషులకూ అంకితమైన రోజు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.. పురుషుల దినోత్సవానికీ ఓ చరిత్ర ఉంది. 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనే కాన్సెప్ట్ మనుగడలో ఉంది. పైగా మిగతా దినోత్సవాలను గొప్పగా జరిపే మగవాళ్లు తమ కోసం ప్రత్యేకంగా ఉన్న రోజును మాత్రం పెద్దగా పట్టించుకోరని చెప్పుకోవచ్చు. ఎంతసేపూ మిగతా వారి గురించి ఆలోచిస్తారే తప్ప తమ గురించి ఆలోచించుకోరు. అందుకే వారి త్యాగాన్ని గుర్తిస్తూ.. పురుషులకు ఈ రోజును కేటాయించారు. ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుతారు. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ ఈ రోజును ప్రారంభించినా.. ట్రినిడాడ్, టొబాగో దేశస్తులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుంచి క్రమం తప్పకుండా జరుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో మొదట 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. ఈ రోజున ప్రపంచంలోని మగవారంతా.. మగవారిని మెచ్చుకుంటారు. వారి శ్రమ, కృషిని ప్రశంసిస్తారు. మగవారి ద్వారా ఈ ప్రపంచం ఎలా ముందుకు వెళ్తున్నదో చర్చిస్తారు. సమాజంలో మగవాళ్ల పాత్ర ఎలా ఉందో చెప్పుకుంటారు. అలాగే సమాజానికి మేలు చేసిన గొప్ప గొప్ప పురుషులను ఈ రోజున కీర్తిస్తారు. వారిని రోల్ మోడల్స్‌గా భావిస్తూ.. వారు సమాజానికి చేసిన సేవల్ని చెబుతారు. మన దగ్గర పుట్టి 18 ఏళ్లు.. భారత దేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిప్) నవంబర్ 19, 2007న దేశంలో మొదట ఈ వేడుకను నిర్వహించారు. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని ఏటా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిప్ ఆధ్వర్యంలో 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిప్ ఉద్యమిస్తోంది.పెరుగుతున్న డ్రాప్ అవుట్స్.. అన్ని విషయాల మాదిరిగానే చుదువులోనూ గత కొంత కాలంగా మగపిల్లల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నారు. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పోషణ భారం వంటి కారణాలు, మగపిల్లాడు ఎలాగైనా బతికేస్తాడు.. అనే నిర్లక్ష్యంతో చదువుకు దూరమవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు మగవారిపై జరిగే గృహహింసను ఎవరూ పట్టించుకోరు. నూటికి 80 శాతం ఘటనలు వెలుగు చూడవు అంటే అతిశయోక్తి లేదు.చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు..పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక భారాలు మగవారిని మానసిక బలహీనులుగా మారుస్తున్నాయి. ఎప్పుడు ఊడతాయో తెలియని ఉద్యోగాలు, మరోవైపు పెరుగుతున్న ఖర్చులు, అటూ ఇటూ కాని జీతాలు వంటి సమస్యలతో అనేక రోగాలపాలవుతున్నారు. దీంతో బీపీ, మధుమేహం, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలతో పురుషులు సతమతమవుతున్నారు. అయినా ముఖంపై చెదరని చిరునవ్వుతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని బాధ్యగా మెలిగే మగవారికి హ్యాపీ మెన్స్ డే.. అనేక ఒత్తిళ్లు అధిగమిస్తూ.. రకరకాల వేధింపుల సంగతి పక్కనపెడితే..ఉద్యోగాలు, వ్యాపారాలు, పని ప్రదేశాల్లో వీరు ఎదుర్కొనే ఒత్తిళ్లు తక్కువేమీ కాదు.. మహిళలు చెప్పుకున్నంత తేలికగా మగవారు బయటపడలేరు. దీంతో పాటు కుటుంబ భారం, ఆర్థిక పరిస్థితులు వంటి ఇతరత్రా ఒత్తిళ్ల కారణంగా మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆత్మహత్యల విషయంలో మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తుంది. వెలుగు చూడనివెన్నో... ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి, సంక్షేమం గురించే మాట్లాడుతుంటాం. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి చివరికి పురుషులే పట్టించుకోరు. ఎవరైనా ముందడుగేసి చెప్పుకున్నా..! చిన్నచూపు చూస్తారు. లేదా సమాజంలో గౌరవం పోతుందని బయటపెట్టని, వెలుగు చూడని ఘటనలు లేకపోలేదు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల సర్వేలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. చిన్న వయసులో బాలల పై జరిగే లైంగిక దాడుల్లో ఆడపిల్లలపై జరిగే దాడులు 45 శాతం కాగా, మగ పిల్లలపై జరిగేవి 55 శాతంగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై ఎవరూ మాట్లాడరు. -
International Mens Day: పురుషులూ మనుషులే.. వివక్ష దేనికి?
ఇటీవల పురుషుల హక్కుల గురించి గత పోరాటాలు వెలుగు చూస్తున్నాయి. కొంత కాలంగా కేవలం మహిళల అభివృద్ధి, మహిళల సాధికారత, మహిళల హక్కులు, మహిళల రక్షణ... చుట్టూనే తిరుగుతున్న ప్రభుత్వాలు, తయారు చేస్తున్న చట్టాలను పురుషుల హక్కుల సాధకులు తప్పు పడుతున్నారు. చట్టాలు అందరికీ సమానం అన్నప్పుడు పురుషుల పట్ల మాత్రం వివక్ష దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనకు, ఆలోచనలకు, కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. లక్ష్యం అదే... సమాజ అభివృద్ధి, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణ రంగాలలో. పురుషుల/ అబ్బాయిల/బాలుర జీవితాలు, విజయాలు సమస్యల్ని గుర్తించే కార్యక్రమం ఇది ఎవరూ పట్టించుకోని పురుషులకు ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన పెంచడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. పురుషులకు ఎదరయ్యే సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా పురుషుల మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి, రోల్ మోడల్స్ లాంటి పురుషులను గుర్తించడానికి..దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ నేపథ్యం... మహిళా దినోత్సవంలా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత లేదు.వాస్తవానికి, పురుషులకు అంకితమైన రోజు అంటూ ఒకటి చాలా కాలంగా ఉందని కూడా చాలా మందికి తెలియదు.అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.., 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది. ప్రారంభం తర్వాత చాలా కాలం దీనిని జరుపుకోలేదు. తిరిగి 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీని ఆయన దీని కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. మన దగ్గర పుట్టి 18ఏళ్లు.. భారతదేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) నవంబర్ 19, 2007న దేశంలో మొట్టమొదట ఈ వేడుకను నిర్వహించడానికి సారథ్యం వహించింది. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమాని ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని వార్షిక సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24/7 కాల్ సెంటర్ అందుబాటులో తేవడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిఫ్ ఉద్యమిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులతో సాక్షి ముచ్చటించినప్పుడు వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మైనార్టీలుగా మగవారు... ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం గానీ, ఓటర్ల గణాంకాల ప్రకారం గానీ చూస్తే పురుషులు రానురాను మైనార్టీలుగా మారుతున్నారు.రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది.ప్రభుత్వాలు చేస్తున్న,చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పురుషుల రక్షణకు ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లూ లేవు. అంతేకాదు పురుషులకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై చర్చలేదు. ఆ చట్టం దుర్వినియోగం..ఏదీ సవరణ? గత కొంత కాలంగా పురుషులను వేధించడానికి 498 లాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూన్నారు. ఇటీవలి ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం చూస్తే 98శాతం 498 కేసులు అన్యాయంగా మోపినవే. ఆ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి అంటే .. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఉండాలి కదా. భారత్ జత చేసి ఐపీసీ పేరు మారుస్తున్నారు. అంతకన్నా ముందు 498లో సవరణలు ముఖ్యం. సరే మా పోరాటా ల ఫలితంగా 498 కేసుల్ని డీల్ చేసే విషయంలో కొంత మార్పు వచ్చింది అనుకునేలోగానే గృహహింస చట్టం తెచ్చారు. ఇప్పుడు దీని దుర్వినియోగం పెరుగుతోంది. అలాగే లైంగిక దాడి, లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలు పురుషుల్ని వేధించేందుకు అస్త్రాలుగా మారుతున్నట్టు మా ఆన్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఏళ్ల తరబడి సహజీవనంలో ఉండీ, ఇతరత్రా విబేధాలు వస్తే పురుషులపై రేప్ కేసులు పెడుతున్నారు. పురుషులకు రక్షణ ఏదీ? ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరు ప్రాయంలో జరిగేౖ లైంగిక దాడులు కూడా బాలుర మీదే ఎక్కువ. కానీ బేటా బచావో అంటూ ఎవరూ మాట్లాడరు. అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్‌లో కూడా అబ్బాయిలే ఎక్కువ. మరి బేటీ పఢావో అన్నట్టు బేటా పడావో లాంటి స్కీమ్ ఎందుకు తీసుకురారు? మగవాళ్లపై కూడా గృహహింస ఉంది అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వరకట్నం తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా నేరమే కానీ ఇచ్చేవారిని శిక్షించిన దాఖలాల్లేవు. పురుషుల ఆరోగ్యం...కాదా మన భాగ్యం? రకరకాల వేధింపులు, ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారు. అందుకే ఆత్మహత్యలు సైతం మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మానసిక బలహీనతలతో పాటు బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలకు పురుషుల ఆరోగ్యాల మీద శ్రద్ధ లేదు. మహిళల కోసం ఎన్నో కమిషన్స్, శాఖలు... పురుషులకు ఎందుకు లేవు? పశువులు, చెట్లకు, పిల్లలకు ఆడవాళ్లకు ఉన్నాయి. చట్టాల్లో మార్పుల కోసమే మా పోరాటం... సిఫ్ ను హైదరాబాద్‌లో 2008లో ప్రారంభించాం 2014 నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 498 కేసు ఎదుర్కున్న అర్నేష్‌కుమార్ అనే వ్యక్తి విషయంలో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా సంస్థ సాధించిన విజయమే. అలాగే పార్లమెంట్లో ఓ పురుష వ్యతిరేక చట్టాన్ని అడ్డుకోవడంలో కూడా లక్ష్యాన్ని సాధించాం. అయినా ఇప్పటికీ 52 దాకా చట్టాలు మగవాళ్లను వేధించడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వర్క్‌ప్లేస్‌లో సెక్సువల్ హెరాస్మెంట్ వచ్చింది. ఒక మహిళ తన సహోద్యోగి మీద ఈ కేసు పెడితే తాను వేధించలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కుంటున్న పురుషుడిదే అంటోందీ చట్టం. పురుషుల హక్కుల పట్ల బలంగా గొంతు ఎత్తితేనే ఇది మారుతుంది. –పార్ధసారథి, సిఫ్ బాధితులకు అండగా ఉంటున్నాం.. నేను కూడా ఒకప్పుడు 498 బాధితుడ్నే. నా లాంటి మరికొందరు కలిసి 2006లో తొలుత బాధితుల కోసం కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం. అనంతరం సిఫ్లో భాగమయ్యాం. ప్రతీ ఆదివారం ఓపెన్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. న్యాయ సహాయంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తూ బాధితులకు ఆసరాగా ఉంటున్నాం. ఈ చట్టం ప్రకారం అరెస్ట్‌లు కాకుండా చాలా వరకూ అడ్డుకోగలిగాం. వేల సంఖ్యలోనే ఇప్పటి దాకా బాధితులకు సహాయ సహకారాలు అందించాం. జాతీయస్థాయిలో 8882498498 హెల్ప్‌లైన్ ఉంది. ఈ హెల్ప్‌లైన్‌కు ఏ సమయంలో కాల్ చేసినా తప్పకుండా స్పందిస్తాం. పురుషుల సమస్యల విషయంలో రాజకీయ నేతలకు తరచుగా రిప్రజెంటేషన్స్ ఇస్తుంటాం. ఎందుకంటే చట్టాలు తయారయేటప్పుడే పురుషుల వినతులు కూడా పట్టించుకోవాలి. లేకపోతే అవి పక్షపాతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. –శైలేష్, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) – సత్యబాబు -
మెన్స్ డే.. ఇది జోక్ కాదు బ్రదర్!
మహిళల దినోత్సవం నాడు కనిపించే ఆర్భాటాలు, ప్రసంగోపన్యాసాల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పురుషుల విషయంలో అలాంటివేం ఎందుకు కనిపించవు. ఎందుకంటే.. వాళ్ల త్యాగాలను, సాధిస్తున్న విజయాలను గప్‌చుప్‌గా స్మరించుకోవడం కోసమే ఒకరోజు ఉంది కాబట్టి. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే(అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..). అలాగని ఆమె కష్టానికి ప్రతీకగా మార్చి 8వ తేదీన జరిపే ఇంటర్నేషనల్ ఉమెన్స్డేకి పోటీగా మెన్స్డేను తెరపైకి తేలేదు. ‘మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటి?’.. అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇది. ఇంటర్నేషనల్ మెన్స్‌డే.. ఇవాళ ‘‘మగవాళ్లే గొప్ప.. వాళ్ల వల్లే ఈ సమాజం నడుస్తోంది అనే ప్రచారాలు ఎక్కడా వినపడదు. కేవలం మగవాళ్ల ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అన్నింటికీ మించి ‘ఈ సమాజంలో మగాళ్లంతా దుర్మార్గులు..’ అని కొందరిలో పేరుకుపోయిన భావనను తుడిచిపెట్టే ఓ చిరు ప్రయత్నం ఇది. మెన్స్‌డే.. ఇవాళ మగవాళ్ల కోసం కొన్ని లక్ష్యాలంటూ నిర్దేశించుకుంటారు. సామాజిక ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తారు. లక్ష్య సాధన కోసం ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటారు. సొసైటీలో ఉన్న పాజిటివ్ రోల్ మోడల్స్‌ని ప్రచారం చేయడం, వాళ్ల సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుకున్న మరో ప్రత్యేకత కూడా. మరి మెన్స్ డేకి గుర్తింపు ఎలా దక్కింది?.. ‘‘మగాళ్లు కూడా మనుషులే. అలాంటప్పుడు వాళ్లకు ఒక గౌరవప్రదమైన రోజు అవసరం. కానీ, ఈ ఆధునిక యుగంలో అది ఇంకా అట్టడుగునే ఉండిపోవడం బాధాకరం’’:: ప్రొఫెసర్ థామస్ ► ప్రపంచ దేశాల ఐక్య వేదిక ఐక్యరాజ్య సమితి ఆమోద్ర ముద్ర ఉంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్ని దేశాల్లో ఏకంగా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. ► మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉండటం మూలానా ‘మనుషులంతా సమానమే’ అనే సిద్ధాంతాన్ని దెబ్బ తీసింది. దీంతో మగవాళ్లకూ ఒక రోజు నిర్వహించడం ద్వారా సమతుల్యత తేవాలని భావించారు కొందరు మేధావులు. ► అమెరికా కన్సాస్‌లోని మిస్సోరి యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవల్ని అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించారు. చివరికి ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరిగింది. దక్షిణ యూరప్‌కి చెందిన మాల్టా దీవి మాత్రం ఈ ఉత్సవాల్ని 1994 నుంచి ప్రతీ ఏటా నిర్వహిస్తూ వచ్చింది. తిలక్‌సింగ్ వల్లే.. నవంబర్ 19కి మెన్స్ డే ఎలా మారింది అనే అనుమానం తలెత్తవచ్చు. ఇందుకు కారణం.. కరేబియన్ ద్వీప దేశం ట్రినిడాడ్–టొబాగోకు చెందిన డాక్టర్ జెరోమో తిలక్‌సింగ్. అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల కోసం ఆయన అక్కడ ఉద్యమించాడు. ► మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి కూడా అవగాహన ర్యాలీలు నిర్వహించాడు. తిలక్‌సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదేరోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా నిర్వహించారు. ► 1999లో ఐక్య రాజ్య సమితి అదే రోజున ‘మెన్స్ డే’ నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. దాదాపు 80కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. కానీ, మన దేశంలో ఈ దినోత్సవానికి ప్రచారం మొదలుపెట్టింది ఒక మహిళ కావడం గమనార్హం. ► ఉద్యమవేత్త, పురుషుల తరపు వాదించే న్యాయవాది ఉమా చల్లా.. మన దేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించే యత్నం మొదలుపెట్టారు. 2007 నుంచి ఆమె ఈ ప్రయత్నంలో ఉన్నారు. ► మహిళా పక్షపాత ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులు, హింసను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఆమె. పురుష వ్యతిరేక న్యాయ వ్యవస్థ అనే చట్రంలో చిక్కుకున్న మగవాళ్లకు.. న్యాయం చేసే అనితర బాధ్యతను మోస్తున్నారు ఆమె. Happy Men's Day to all the men out there!❤️#SunPictures pic.twitter.com/kY0vOqeqAA — Sun Pictures (@sunpictures) November 19, 2022 ఆడామగా.. తల్లీతండ్రి, అన్నాచెల్లి, అక్కాతమ్ముడు, భార్యాభర్త.. ఇలా ఏ పాత్రలో ఉన్నా వారివారి జీవితాల్లో ప్రధాన పాత్రే పోషిస్తుంటారు. ఉమెన్స్డేలో లేనిది.. మెన్స్డేలో ప్రముఖంగా ఉన్నది లింగ బేధాల్లేకుండా సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే థీమ్. మెన్స్ డే అంటే.. కొందరి విషయంలో ఎందుకనో ఓ చిన్నవిషయం. కొందరు జెంటిల్మెన్సే దీన్నొక జోక్‌గా ఫీలవుతుంటారు. మహిళలు తమ రోజుని ఎంత ప్రత్యేకంగా నిర్వహించుకుంటారో.. సమస్యల గురించి ఎంత బాగా చర్చించుకుంటారో.. అలాగే మగవాళ్లు కూడా అదే స్థాయిలో చర్చించకపోవడమే.. మెన్స్డేకు ఉన్న ప్రధాన లోపం!! 2001 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఒక్కో ఏడాదికి.. ఒక్కో నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్.. థీమ్‌ను ఈ ఏడాదికి ప్రకటించారు. సంఘాలకు, కుటుంబాలకు, యావత్ ప్రపంచానికి.. మగవాళ్లు అందిస్తున్న సానుకూల సహకారానికి వేడుక చేయడం, మగవాళ్ల శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ ఏడాది థీమ్ లక్ష్యం. ::: ఆరాధ్య -
విమెన్స్ డేలు, ఉత్సవాలు మహిళలకేనా, మరి పురుషులకు?
సాక్షి, హైదరాబాద్: ఎపుడూ విమెన్స్ డేలు, విమెన్స్ ఎంపవర్మెంటేనా. మరి పురుషులకు? వారికి స్పెషల్ డేలు, ఉత్సవాలు గట్రా ఏవీ లేవా. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికీ, కనిపించీ, కనిపించని వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఓ రోజుంది, అదే నవంబర్ 19. సమాజంలో ఆడా మగా ఇద్దరూ సమానమే. ఈ స్ఫూర్తిని, అవగాహనను కల్పించేందుకే ఈ డే. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకుండా అందరూ మహానుభావులుగా మారాలనేదే దీని లక్ష్యం. వెల్.... ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా పురుషులందరికీ హ్యాపీ మెన్స్ డే. -
Men's Day 2021: మా కష్టాలు మీకేం తెలుసు?
International Mens Day: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. ఏమని చెప్పాలి.. ‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. త్యాగాలు గుర్తించండి! ‘సంపాదించాలి. కుటుంబ ఉన్నతికి పాటుపడాలి. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కుమారుడిగా ఉండాలి’.. పురుషులపై సమాజం పెట్టిన బాధ్యత ఇది. ఇందులో ఎక్కడ విఫలమైనా ఛీత్కారం తప్పదు. ఇంత చేసినా కీలక సమయంలో న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదని పురుష బాధితులు వాపోతున్నారు. ‘భార్య విడాకులు కోరినప్పటికీ.. పిల్లలకు తండ్రే దూరం కావాలి. 90 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది. గృహ హింస కేసుల్లో అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారు. ఇదంతా పురుషులపై వివక్షే’అని చెబుతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుల్లో అత్యధికులకు సొంత ఆకాంక్షలేవీ ఉండవు. ఉన్నా వదిలేసుకుంటారు. కష్టమైనా, నష్టమైనా, ఏం చేసినా, ఎంత సంపాదించినా కుటుంబం కోసమే! అలాంటప్పుడు పురుషుల త్యాగాలకు కనీస గుర్తింపు ఇవ్వడంలో తప్పేముంది? ‘పురుషుల దినోత్సవమంటే జోక్ కాదు. కుటుంబం, సమాజం కోసం పురుషులు చేస్తున్న త్యాగాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకోవడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశం..’ పురుషులకు హెల్ప్‌లైన్.. భారత్‌లో సందర్భం, అవసరాన్ని బట్టి సాయం చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు అనేకం ఉన్నాయి. ఇటీవల మహిళల కోసం, చిన్న పిల్లల కోసం కూడా ఇలాంటి హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. కష్టాల్లో చిక్కుకున్న పురుషుల కోసం కూడా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వారే స్వయంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్ (8882 498 498) ఏర్పాటు చేసుకున్నారు. మా కష్టాలు మీకేం తెలుసు? మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. -
సానుభూతికీ నోచుకోడు..
సాక్షి, హైదరాబాద్: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. ఏమని చెప్పాలి.. ‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. మా కష్టాలు మీకేం తెలుసు? మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. -
నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..
ప్రేమికుల కోసం, స్నేహితుల కోసం, అమ్మ కోసం, మహిళల కోసం, బాలికల కోసం, తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజు అంటూ ఉంది. ఆయా సందర్భాల ప్రత్యేకతను పురస్కరించుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇవన్ని చూసి చాలా మంది మగవారు మా కోసం ఓ ప్రత్యేకమైన రోజు ఉంటే బాగుండు అనుకుంటారు. ఉంది.. మగ వారి కోసం ఓ ప్రత్యేక రోజు ఉంది. నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సం. 1969లో పురుషుల దినోత్సవం డిమాండ్ తొలిసారి తెర మీదకు వచ్చింది. చివరికి డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ చేత 1999 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం మొదలైంది. జీరోమ్ టీలక్సింగ్ తన తండ్రి పుట్టినరోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలెట్టాడు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. (చదవండి: ‘సానుభూతి చాలు.. ఇంతకీ మీరేం చేశారు?!’) ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపే ఉద్దేశ్యంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక 45సంవత్సరాల లోపు గల వయస్సులో చాలామంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇక ఈ సంవత్సరం పురుషుల దినోత్సవం థీమ్ ఏంటంటే పురుషులు, బాలురకు ఉత్తమ ఆరోగ్యం(ది బెటర్ హెల్త్ ఫర్ మెన్ అండ్ బాయ్స్). దీని ప్రకారం పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన. దీని ప్రకారం వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. పురుషులు ఏడవకూడదు అనే భావనని విడిచిపెట్టి, వారు అనుభవిస్తున్న మానసిక వేదనని ప్రశాంతంగా వెలిబుచ్చేందుకు స్పేస్ ఇవ్వాలి. వారి మనుసులోని భావాలని పురుషులు అన్న కారణంగా వారిలోనే అణచివేసుకోకుండా చెప్పుకునేందుకు కావాల్సిన సాయం అందించాలి. (చదవండి: ప్రధాని సోషల్ ఖాతాలు ఆ ఏడుగురికి) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు: 1. ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకంగా తెలుపటం. 2. కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి చెప్పటం. 3. సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం. 4. పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం. 5. సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం. 6. స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం. 7. లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం.. 8. హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం. ఇవే కాక.. సంఘంలో పురుషులు/బాలురు ఎదుర్కొనే వివక్షను తెలపడమే కాక పురుషజాతికి సంఘం పట్ల, కుటుంబం పట్ల, వివాహం పట్ల శిశు సంరక్షణ పట్ల గల సత్సంకల్పము, ఆయా దిశలలో పురుషజాతి సల్పే కృషి, వీటి వలన పురుషజాతికి కలిగే సాధకబాధకాలను విశదీకరించే సందర్భమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. స్థూలంగా ఈ దినోత్సవం యొక్క విశాల, అంతిమ ధ్యేయం ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించటం. -
భార్యామణి... బీర్ ప్లీజ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు సోషల్ వెబ్సైట్లలో స్త్రీ, పురుషులు తమదైన శైలిలో స్పందించారు. వ్యాఖ్యలు చేశారు. వాటిలో కొన్ని హస్యోక్తులు ఉండగా, మరికొన్ని వ్యంగోక్తులు ఉన్నాయి. విమర్శలూ, ప్రతివిమర్శలూ ఉన్నాయి. ‘మరో బీర్ ప్లీజ్, భార్యామణి!....పెగ్గు ప్లీజ్, మైడియర్ వైఫ్...ఛీ, బతుకు జిమ్మడ ! అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8)నాడు కూడా బిడ్డను చూసుకోవడానికే సరిపోతోంది. ఈ రోజు అంతే! బేబీ సిట్టింగ్ డ్యూటీ వదిలేది ఎప్పుడు?...ఈ రోజు మెన్స్ డేనే కాదు, అంతర్జాతీయ టాయిలెట్స్ డే కూడా....’ అంటూ వ్యాఖ్యలు. నలభీమ పాకశాస్త్రులైన గ్రేట్ చెఫ్స్‌కు శుభాభినందనలు అంటూ కొంత మంది మహిళలు వ్యాఖ్యలు చేయగా, తమ ఆయనల పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వారికిష్టమైన రంగుల దుస్తులు ధరిస్తున్నానని మరికొందరు వ్యాఖ్యానించారు. కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ఎక్కువ మంది యువకులు 45 ఏళ్ల ప్రాయంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మగవాళ్ల ఆత్మహత్యలను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోవాలనిప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కొంతమంది మగవాళ్లు ట్వీట్లు చేయగా, రేప్ కేసుల్లో కఠిన శిక్షలను తగ్గించాలంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షతను దూరం చేయడానికి, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మెన్స్ డే సందర్భంగా ప్రతిన బూనాలంటూ ఫెమినిస్టులు స్పందించారు. భార్యా బాధితులంతా ఏకం కావాలంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. 1920 దశకం నుంచే కొన్ని దేశాల్లోని సామాజిక గ్రూపులు, సంస్థలు అనధికారికంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతూ వచ్చాయి. 1992, నవంబర్ 19వ తేదీని మెన్స్ డేగా కొన్ని దేశాలు అధికారికంగా జరుపుతూ వస్తున్నాయి. 1999 నుంచి ఐక్యరాజ్య సమతిలో సభ్యత్వం కలిగిన మెజారిటీ దేశాలు మెన్స్ డేను అధికారికంగా జరుపుతున్నాయి. కొన్ని దేశాలు స్త్రీ, పురుషుల సమానత్వం నినాదంతో ఈరోజును జరుపుకొంటుండగా, మెన్స్ అండ్ బాయ్స్ సంక్షేమ దినోత్సవంగా మరికొన్ని దేశాలు జరుపుతున్నాయి. -
ఎఫెక్షన్.. పర్ఫెక్షన్
పెళ్లి, కుటుంబం, పిల్లల పరిరక్షణ, సమాజంలో పురుషుల భాగస్వామ్యం, ఘనతలు, విజయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగే ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’. అదే సమయంలో వారిపై జరుగుతున్న దురాగతాలు, వివక్షనూ ప్రశ్నిస్తోంది ఈ దినోత్సవం. ప్రపంచంలో అరవైకి పైగా దేశాల్లోని మగవారు ఏటా నవంబర్ 19న దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దారులు వేరైనా... సమాజంలో కనీస మానవ విలువలు పాటించే దిశగా ప్రోత్సహించడమే ఈ డే అసలు ఉద్దేశం. ఈవారం ‘క్యాంపస్ కబుర్లు’లో టాపిక్ కూడా ఇదే. నాడు- నేడు... కుటుంబంలో మగవారి పాత్ర, అనుబంధం, అవగాహనలో వచ్చిన మార్పులు, తీరుతెన్నులపై రాంకోఠి ‘జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ’ విద్యార్థులు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. మై ఇన్స్పిరేషన్... అమ్మ కంటే నాన్నతోనే ఎక్కువ అటాచ్మెంట్. అమ్మ ఎంత గారాం చేసినా నాన్న పిలుపులో ఏదో కమ్మదనం. హ్యాపీ, అన్‌హ్యాపీ... ఏదైనా మొదట నాన్నతోనే షేర్ చేసుకుంటా. ఇంట్లో ఉంటే... చటుక్కున వెళ్లి నాన్న ఒడిలో కూర్చొని మాట్లాడతా. బయట ఉంటే ఫోన్ చేస్తా. మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ బడ్డీ... ఇన్స్పిరేషన్. అమ్మ కంటే నాన్నకు ఓర్పు కూడా ఎక్కువే. ఎవర్నైనా ప్రేమించినా... అతడి కంటే మా నాన్నకే ముందు చెబుతా. - పూర్ణిమ అన్నింటికీ నాన్నే .. మా నాన్నంటే నాకో క్లోజ్ ఫ్రెండ్‌లా అనిపిస్తారు. సినిమాలకు వెళ్లాలన్నా, షాపింగ్‌కు వెళ్లాలన్నా.. అన్నింటికీ డాడీతోనే. కానీ... మా నాన్నకు వాళ్ల నాన్నను చూస్తే షివరింగట. ఏం కావాలన్నా అమ్మమ్మని కిచెన్‌లోకి తీసుకెళ్లి... సీక్రెట్‌గా అడిగేవారట. నాకా ఇబ్బందులు లేవులేండి. నాన్న నాతో ఎంతో కూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. కాలేజీ విషయాలు కూడా ఆయనతో డిస్కస్ చేస్తా. ఐయామ్ డ్యాడ్స్ క్యూటీ పెట్! - మానస ఇప్పుడంతా షేరింగ్... జనరేషన్ బట్టి జనాల్లో చాలా మార్పులొచ్చాయి. తాతల కాలంలో అమ్మమ్మ ఇంట్లో వంటావార్పూ చూసుకొనేది. తాతయ్య ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికొచ్చేవాడు. ఆడవారు వంటింటికే పరిమితమవడం వల్ల నాడు వారికి లోకజ్ఞానం తక్కువగా ఉండేది. ఇప్పుడు... ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కష్టాన్ని ఇద్దరూ షేర్ చేసుకొంటున్నారు. పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. - మహ్మద్ అబ్దుల్ సిరాజ్ నో ఆర్గ్యుమెంట్స్... నేటితరంలో అంతా చదువుకున్నవారే. సో... అందరిలో పద్ధతి, కూల్ గోయింగ్, సింపుల్నెస్తో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా రెస్పాండ్ అయ్యే ముందు ‘ఎందుకు’ అని ఓసారి ఆలోచిస్తే అంతా కూల్‌గా సాగిపోతుంది. చాలా గొడవలు తగ్గిపోతాయి. సంబంధాలు గట్టిపడతాయి. అలాకాక ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ పోతే మనసులు వికలమై... సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఆ సెన్స్‌తోనే నేటి యువకులు మసులుకుంటున్నారనేది నా అభిప్రాయం. - మహ్మద్ అష్రాఫ్ఖాన్ మాటల్లో చెప్పలేను... కామన్‌గా ఫాదర్స్ పిల్లల్ని చదివిస్తారేమో! కానీ మా నాన్న అలా కాదు... నా రికార్డ్స్, ప్రాజెక్ట్స్... అన్నింట్లో సాయం చేస్తారు. అమ్మ జాగ్రత్తలు చెబుతుంది. కానీ నాన్న... ఏం జరిగినా నేనున్నానంటూ ధైర్యాన్నిస్తారు. కుటుంబ బాధ్యతల్లో మగవాళ్లకి అంత పేషెన్స్, డెడికేషన్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పాపా నన్ను ఓ గాజు బొమ్మలా అపురూపంగా చూసుకుంటారు. నేటితరం మగవాళ్లలో ఆడవారిపై గౌరవం, మర్యాద, అవగాహన చాలా పెరిగాయి. - పాయల్ -
భాషణం: బుద్ధిగా ఉండకపోతే బూచాడు ఎత్తుకెళతాడు!
ఐదు రోజుల క్రితం నవంబర్ 19 న ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ జరిగింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం! మార్చి 8న ఉమెన్స్ డే ఉంది కాబట్టి మాకూ ఒక రోజు కావాలని కొంతమంది మగవాళ్లు పట్టుబట్టి మరీ ‘మెన్స్ డే’ని సాధించుకున్నారు. బాగుంది. ‘వాళ్లకు ఉంది కాబట్టి మాకూ ఉంటే బాగుంటుంది’ అనేది మానవ స్వభావం కనుక దీని గురించి వాదన అవసరం లేదు కానీ, ఆ సందర్భాన్ని ప్రస్తావించుకుంటూ ఇప్పుడు మనం man కు సంబంధించి మరీ ఆసక్తిగా అనిపించే కొన్ని పదబంధాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన మాట angry young man. అయితే కోపం తెచ్చుకునే ప్రతి యువకుడూ యాంగ్రీ యంగ్‌మేన్ కాదు. వ్యవస్థలో ఉన్న ప్రజావ్యతిరేక విధానాలను, అధికారంలో వ్యక్తుల పనితీరును ధర్మాగ్రహంతో ప్రశ్నించే యువకుడు యాంగ్రీ యంగ్‌మేన్. best man అంటే మాత్రం తోడి పెళ్లికొడుకని. సాధారణంగా అతడు వరుడి స్నేహితుడై ఉంటాడు. లేదా బాగా దగ్గరి బంధువై ఉంటాడు. వివాహ వేడుకలో వరుడి పక్కనే ఉండి అతడి అవసరాలను చూస్తుండడం best man పని. bogey man అని ఇంకొకడు ఉన్నాడు. వీడిని బోగీ మేన్ అని పలకాలి. బూచాడని అర్థం. Be good, or the bogey man will come and get you! బుద్ధిగా ఉండు, లేకుంటే బూచాడు ఎత్తుకెళతాడని పిల్లల్ని భయపెట్టడం. bogey man¯ól boogeyman అని కూడా అంటారు. company man అంటే ఆఫీసుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. కంపెనీ మేన్‌కి ఆఫీస్ తర్వాతే ఇల్లు, కుటుంబం. ఇలాంటి వాళ్లని పై అధికారులు మెచ్చుకుంటారేమో కానీ, సహోద్యోగులు భరించలేరు. ఆ సహోద్యోగుల తిరస్కారభావం నుంచి వచ్చిందే company man అనే మాట. ఇక con man అంటే కంత్రీ. జనాన్ని మాయ చేసి, డబ్బుతో ఉడాయించేవాడు. con man movies హాలీవుడ్లో, బాలీవుడ్లో చాలా వచ్చాయి. ఆ మధ్య నాగార్జున హీరోగా వచ్చిన ‘కేడీ’ చిత్రం కూడా కాన్ మేన్ మూవీ లాంటిదే. అలాగే fancy man, fellow man, front man అనేవాళ్లున్నారు. ‘ఫ్యాన్సీ మేన్’ అంటే లవర్. ఓల్డ్ ఇంగ్లిష్‌లో ఇలా అనేవారు. ‘ఫెలో మేన్’ అంటే సాటి మనిషి. ‘ఫ్రంట్ మేన్’ అంటే కంపెనీ తరఫున ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే వ్యక్తి. ప్రతినిధి అన్నమాట. చట్టబద్ధత లేని కంపెనీ తరఫున ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసే ప్రతినిధిని కూడా ‘ఫ్రంట్ మేన్’ అనే అంటారు. gingerbread man అనేది ఒక చిత్రమైన మాట. ఇందులో man అనే పదం ఉంది కదా అని అనుకుంటాం కానీ. జింజర్‌బ్రెడ్ మేన్ మనిషి కాదు, మనిషి ఆకారంలో ఉండే అల్లం బిస్కెట్. లేదా అల్లం కుకీ. G-man అంటే యు.ఎస్.లో ప్రభుత్వ అధికారి. ప్రధానంగా ఊఆఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో పని చేసే అధికారి. Hit man అంటే కిరాయి హంతకుడు. ladies man అంటే ఎప్పుడూ ఆడవాళ్ల గురించే ఆలోచిస్తుండే వ్యక్తి. ‘లేడీస్ మేన్’ ధ్యాసంతా ఆడవాళ్ల మీదే ఉంటుంది. అంతేకాదు, అతడెప్పుడూ ఆడవాళ్ల మధ్య ఉండడానికే ఇష్టపడతాడు. lollipop man అంటే స్కూలు పిల్లల్ని భద్రంగా రోడ్డు దాటించే వ్యక్తి. అతడు రోడ్డు మధ్యలో నిలబడి ఉంటాడు. అతడి చేతిలో ఒక స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ మీద ‘స్టాప్’ అని సింబల్ ఉంటుంది. ఆ సింబల్‌తో అతడు ట్రాఫిక్ని నియంత్రిస్తూ, పిల్లల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంటాడు. man of God అంటే మత బోధకుడు. man of letters అంటే రచయిత, సాహితీవేత్త. man of straw అంటే మానసికంగా బలహీనుడు. medallion man (మెడాలియన్ మేన్) అంటే వయసుని తగ్గించుకుని కనిపించడానికి ఆభరణాలు, బిగుతైన దుస్తులు ధరించే వ్యక్తి. మెడాలియన్ మేన్లో ఇంకో గుణం కూడా ఉంటుంది. షర్ట్ పై బటన్లు తీసి ఛాతీని ప్రదర్శిస్తూ ఉంటాడు. man Friday ఇక్కడ ఊ క్యాపిటల్ లెటర్. ‘మేన్ ఫ్రైడే’ అంటే విధేయుడైన, నమ్మకస్తుడైన సహాయకుడని. అయితే విధేయతకు, నమ్మకానికీ, D Friday అనే మాటకు సంబంధం ఏమిటి? ఉంది. ఇంగ్లండ్ రచయిత డేనియల్ డెఫో 1719లో రాసిన ‘రాబిన్సన్ క్రూసో’ నవలలో Friday అనేది మగ సహాయకుని పాత్ర. ఆ పాత్ర తన యజమాని రాబిన్సన్ క్రూసోకు ఎంతో విధేయంగా, నమ్మకంగా ఉంటుంది. అలా వచ్చిందే man Friday అనే మాట. రాబిన్సన్కు మొదట ఆ సహాయకుడి పేరు తెలియకపోవడంతో అతడు తారసపడిన రోజు (ఫ్రైడే)తో అతడిని పిలుస్తుంటాడు.అలా మేన్ ఫ్రైడే వాడుకలోకి వచ్చింది.