ప్రేమికుల కోసం, స్నేహితుల కోసం, అమ్మ కోసం, మహిళల కోసం, బాలికల కోసం, తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజు అంటూ ఉంది. ఆయా సందర్భాల ప్రత్యేకతను పురస్కరించుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇవన్ని చూసి చాలా మంది మగవారు మా కోసం ఓ ప్రత్యేకమైన రోజు ఉంటే బాగుండు అనుకుంటారు. ఉంది.. మగ వారి కోసం ఓ ప్రత్యేక రోజు ఉంది. నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సం. 1969లో పురుషుల దినోత్సవం డిమాండ్ తొలిసారి తెర మీదకు వచ్చింది. చివరికి డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ చేత 1999 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం మొదలైంది. జీరోమ్ టీలక్సింగ్ తన తండ్రి పుట్టినరోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలెట్టాడు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. (చదవండి: ‘సానుభూతి చాలు.. ఇంతకీ మీరేం చేశారు?!’)
ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపే ఉద్దేశ్యంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక 45సంవత్సరాల లోపు గల వయస్సులో చాలామంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇక ఈ సంవత్సరం పురుషుల దినోత్సవం థీమ్ ఏంటంటే పురుషులు, బాలురకు ఉత్తమ ఆరోగ్యం(ది బెటర్ హెల్త్ ఫర్ మెన్ అండ్ బాయ్స్). దీని ప్రకారం పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన. దీని ప్రకారం వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. పురుషులు ఏడవకూడదు అనే భావనని విడిచిపెట్టి, వారు అనుభవిస్తున్న మానసిక వేదనని ప్రశాంతంగా వెలిబుచ్చేందుకు స్పేస్ ఇవ్వాలి. వారి మనుసులోని భావాలని పురుషులు అన్న కారణంగా వారిలోనే అణచివేసుకోకుండా చెప్పుకునేందుకు కావాల్సిన సాయం అందించాలి. (చదవండి: ప్రధాని సోషల్ ఖాతాలు ఆ ఏడుగురికి)
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:
1. ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకంగా తెలుపటం.
2. కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి చెప్పటం.
3. సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం.
4. పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం.
5. సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం.
6. స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం.
7. లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం..
8. హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం.
ఇవే కాక.. సంఘంలో పురుషులు/బాలురు ఎదుర్కొనే వివక్షను తెలపడమే కాక పురుషజాతికి సంఘం పట్ల, కుటుంబం పట్ల, వివాహం పట్ల శిశు సంరక్షణ పట్ల గల సత్సంకల్పము, ఆయా దిశలలో పురుషజాతి సల్పే కృషి, వీటి వలన పురుషజాతికి కలిగే సాధకబాధకాలను విశదీకరించే సందర్భమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. స్థూలంగా ఈ దినోత్సవం యొక్క విశాల, అంతిమ ధ్యేయం ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించటం.
Comments
Please login to add a commentAdd a comment