ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్‌ ఎప్పుడంటే? | Music Shop Murthy Movie Release Date Out | Sakshi
Sakshi News home page

ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Sat, May 25 2024 5:09 PM | Last Updated on Sat, May 25 2024 6:41 PM

Music Shop Murthy Movie Release Date Out

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.  శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన  ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.

ఈ చిత్రంలో అజయ్ ఘోష్  డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement