Music Shop Murthy Movie
-
నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. కొద్దిరోజు క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది.'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నాడు. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా అని ఆయన పేర్కొన్నాడు. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్ చేసి బూతులు తట్టొచ్చని చెబుతూనే తన నంబర్ కూడా ఇచ్చేశాడు. దీంతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాపై ఆయన ఎంతటి అంచనాలు పెట్టుకున్నాడో తెలుస్తోందని నెటజన్లు అంటున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అజయ్ ఘోష్‌దే కావడం విషేశం. ప్రస్తుతం టాలీవుడ్లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది..? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నానని దర్శకుడు శివ పాలడుగు తెలిపాడు. -
మ్యూజిక్ మీద చాలా రీసెర్చ్ చేశా: డైరెక్టర్ శివ పాలడుగు
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’సినిమాను తీశాం. మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’అన్నారు డైరెక్టర్ శివ పాలడుగు. ఆయన దర్శకత్వం వహించిఆన తొలి సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. కొన్నాళ్ల తర్వాత అక్కడే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.⇒ కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి పాత్ర కోసం అజయ్ ఘోష్‌ని తీసుకున్నాం. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.⇒ చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.⇒ ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.⇒ ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.⇒ ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను. -
మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?)ఈ ట్రైలర్ చూస్తే నవ్వించేలా, ఏడిపించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలను, కల కనడానికి, ఆ కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనే కాన్సెప్ట్ చూపించబోతున్నారు. ‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?) -
ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్ ఎప్పుడంటే?
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. -
ఆసక్తికరంగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. ఇక చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది.