Ajay Gosh
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. చాలా మూవీస్‌తో పోలిస్తే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, కామెడీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పేరున్న యాక్టర్స్ చేసినప్పటికీ ఎందుకో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అందరూ ఎంచక్కా చూసేయొచ్చు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)'రంగస్థలం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ లీడ్ రోల్ చేసిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఇతడితో పాటు చాందినీ చౌదరి మరో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్లుంటే ఓ లుక్కేసేయండి.క్యాసెట్ షాప్ నడుపుకొనే 50 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి.. డీజే కావాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఈయనకు డీజేగా పనిచేసే అమ్మాయి పరిచయమవుతుంది. ఈమె దగ్గర మూర్తి డీజే నేర్చుకోవడం, మరి చివరకు ఏమైంది అనేదే 'మ్యూజిక్ షాప్ మూర్తి'.(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యూజిక్ షాప్ మూర్తినటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులునిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటిరచన & దర్శకత్వం: శివ పాలడుగు సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగంఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డివిడుదల తేది: జూన్ 14, 2024‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథేంటంటే.. పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన మూర్తి(అజయ్ ఘోష్)..అదే గ్రామంలో మ్యూజిక్ షాప్ రన్ చేస్తుంటాడు. వయసు 52 యేళ్లు. మొదటి నుంచి మ్యూజిక్ షాప్ లోనే పని చేయడంతో...లాభాలు లేకున్నా...అదే పని చేస్తుంటాడు. భార్య జయ(ఆమని) ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతూ..ఇద్దరి కూతుళ్ళని చదివిస్తుంది. మ్యూజిక్ షాప్ అమ్మి..మొబైల్ షాప్ పెట్టాలని జయ కోరిక.ఈ వయసులో కొత్త పని నేర్చుకునే కంటే...30 ఏళ్లుగా పని చేస్తున్న మ్యూజిక్ లోనే కొత్తగా ట్రై చేయాలని మూర్తి కోరిక. ఓ బర్త్‌డే పార్టీలో ఆయన పాటలు మిక్స్ చేసి ప్లే చేసిన విధానం అందరికి నచ్చి..డీజే అవ్వొచ్చు కదా అని సలహా ఇస్తారు. డీజే అయితే తనకు నచ్చిన పని చేస్తూనే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చని..ఆన్లైన్లో డీజే కోర్స్ గురించి తెలుసుకుంటుంటాడు.మరో వైపు అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చిన అంజన( చాందినీ చౌదరి) కి డీజే నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటుంది. అది ఆమె తండ్రి(భానుచందర్) కి నచ్చదు. తండ్రి అనుమతి తో డీజే అవ్వాలనుకుంటుంది. ఓ సందర్భంలో మూర్తిని కలిసిన అంజనా....మ్యూజిక్ పై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి డీజే నేర్పించాలనుకుంటుంది. అంజనాని గురువుగా భావించిన మూర్తి..ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని డీజే వాయించడం పూర్తిగా నేర్చుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మూర్తి డీజే అవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకు? అంజన, మూర్తి మధ్య ఉన్న సంబంధాన్ని సమాజంతో పాటు కుటుంబ సభ్యులు ఎలా తప్పుపట్టారు? అంజనా తండ్రి ముర్తిపై ఎందుకు కేస్ పెట్టాడు? డీజే అవ్వడం కోసం హైదరాబాద్ కి వచ్చిన మూర్తికి ఎదురైన కష్టాలు ఏంటి? ఫేమస్ డీజే డెవిల్(అమిత్ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? చివరకు 52 ఏళ్ల మ్యూజిక్ షాప్ మూర్తి.. ఫేమస్ డీజే మూర్తిగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథల్లో పెద్దగా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా..తెరపై చూడాలనిపిస్తుంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ కూడా అంతే. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కాస్త ఆలోచిస్తే..ఇంటర్వెల్ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఈజీగా అంచనా వేయ్యొచ్చు. అయినా కూడా తెరపై చూడాలనిపిస్తుంది. అలా అని ఈ కథ కొత్తదేమి కాదు. చాలా రోటీన్, సింపుల్ కథే. హీరో ఒకటి సాధించాలనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలు..వాటిని అధిగమించి చివరకు విజయం సాధించడం.. ఇదే మ్యూజిక్ షాప్ మూర్తి కథ.అయితే ఈ సినిమాలో హీరోకి 52 ఏళ్లు. ఆ వయసులో తన గోల్‌ని నెరవేర్చుకోవడమే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అనేది చాలా ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శివ పాలడుగు. కథనం రొటీన్‌గా సాగించినా.. ఎమోషన్ బాగా పండించి.. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ కథకి హీరోగా అజయ్ ఘోష్‌ని ఎంచుకోవడమే దర్శకుడి మొదటి విజయం. ఓ యంగ్ హీరోని పెట్టి ఈ కథ చెబితే.. రొటీన్‌గా అనిపించేంది. కానీ వయసు మీద పడిన వ్యక్తి కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఓ పది నిమిషాల తర్వాత కథనం ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే నేర్చుకోవడం కోసం చేసే అతను సాధన చూపించారు. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్ మరింత ఎమోషనల్‌గా సాగుతూనే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. డీజే అవ్వడానికి మూర్తి పడే కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీక్లైమాక్స్ కన్నిళ్లను తెప్పిస్తాయి. క్లైమాక్స్ బాగున్నా..ఎందుకో కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మ్యూజిక్ షాప్ మూర్తి జర్నీ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తుంది. ‘మొదటి ప్రయత్నానికే విజయం సాధించాలి..అది అవ్వకపోతే వదిలేసి..వేరే పని చేసుకోవాలి’అని ఆలోచించే నేటితరం యువతకి మూర్తి కథ ఆదర్శం అవుతుంది.ఎవరెలా చేశారంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరిని మెప్పిస్తున్న అజయ్ ఘోష్ ఇందులో లీడ్ రోల్ చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాభై ఏళ్లు పైబడిన మధ్యతరగతి వ్యక్తి మూర్తి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక్క పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించాడు. టైటిల్ సాంగ్‌కి స్టైప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇక అంజనా పాత్రకి చాందిని చౌదరి న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించిన గురువు పాత్ర తనది. ఆమె పాత్ర చెప్పే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్య జయగా ఆమని చక్కగా నటించింది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నానితో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పవన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
మ్యూజిక్ మీద చాలా రీసెర్చ్ చేశా: డైరెక్టర్ శివ పాలడుగు
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’సినిమాను తీశాం. మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’అన్నారు డైరెక్టర్ శివ పాలడుగు. ఆయన దర్శకత్వం వహించిఆన తొలి సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. కొన్నాళ్ల తర్వాత అక్కడే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.⇒ కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి పాత్ర కోసం అజయ్ ఘోష్‌ని తీసుకున్నాం. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.⇒ చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.⇒ ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.⇒ ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.⇒ ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను. -
ఆయన వల్లే ఇక్కడున్నా.. పుష్ప-2 విషయంలో బాధలేదు: అజయ్ ఘోష్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ విపరీతమైన స్పందన వస్తోంది.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించారు. కొండారెడ్డి పాత్రలో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్ప-2లో తాను లేకపోవడంపై స్పందించారు. సుకుమార్ తన జీవితాన్ని మార్చారని అన్నారు. తన కెరీర్ అయిపోయిందనుకున్న దశలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.అజయ్ ఘోష్ మాట్లాడుతూ..' నా దృష్టిలో సుకుమార్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు. నేనేంటో తెలిసేలా చేసిన గురువు. కరోనా బారిన పడినప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా. పుష్పలో నటించేందుకు సుకుమార్ అడిగితే నా వల్ల కాదని చెప్పా. అయినా ఆయన వదల్లేదు. చాలాసేపు మాట్లాడి ఒప్పించారు. ఆయన మోటివేషన్‌తోనే నటనకు సిద్ధమయ్యా. పుష్ప-2లో నటించకపోవడంపై నాకే లాంటి బాధలేదు. నా కోసం మరో అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తారు సుకుమార్.' అని అన్నారు. కాగా..శివ పాలడుగు దర్శకత్వంలో మ్యూజిక్ షాప్ మూర్తి ఈ నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది. -
ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్ ఎప్పుడంటే?
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. -
పచ్చడి మెతుకులు.. నాకు అన్నం ఉంటే చాలు.. నటుడి కంటతడి
అజయ్ ఘోష్.. తన వాయిస్‌తోనే డైలాగ్స్‌కు మరింత శక్తి తీసుకురాగలడు. సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు చాలా సింపుల్‌గా ఉంటాడు అజయ్. సామాన్యులలాగే రోడ్డు పక్కన షాపులో కూడా భోజనం చేస్తుంటాడు. సాధారణ పంచెకట్టుతో కనిపిస్తాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కారం మెతుకులు తిన్నా.. 'ఒకప్పుడు నా కుటుంబం కడుపేదరికం అనుభవించింది. ఎవరిదగ్గరైనా బట్టలు అడిగి వేసుకునేవాడిని. పచ్చడి, కారం మెతుకులు తిన్న రోజులున్నాయి. ఆ కష్టాల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్తే మా నాన్న ఒక్కడే కష్టపడేవాడు. మొదటినుంచీ నేను తిండిపోతును. నాకింత అన్నం ఉంటే చాలు.. అయితే వండిన అన్నం నేను తిన్న తర్వాత మిగిలింది అమ్మానాన్న తినేవారు. ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇంకా ఎంతో ఎత్తుకు చేరుకోవాలి..' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'పుష్ప'కు అందుకే నో చెప్పా పుష్ప ఆఫర్ తిరస్కరించడంపై స్పందిస్తూ.. 'అప్పుడు నాకు కరోనా వచ్చింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. ఆ సమయంలో నేను ఊరిలో ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రావాలంటేనే భయమేసింది. పుష్ప కోసం అడిగినప్పుడు కరోనా భయంతోనే ఒప్పుకోలేదు. అందరూ ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ నిరాకరించాను. చివరకు డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. ఆయన మాటలు విన్నాక ఏదైతే అదైందని ఒప్పుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడేవరకు ఆగారు. తర్వాత షూటింగ్ చేశాం.. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అజయ్ ఘోష్. చదవండి: అదే రాళ్లపల్లి వీక్నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే! -
ఆసక్తికరంగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. ఇక చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది. -
పోరాటాల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’
పాన్ ఇండియా నటుడు రవికాలె, అజయ్‌ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్ నేతృత్వంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సందేశాత్మక చిత్రమిది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేస్తాం’ అన్నారు. చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ.. భారత సైన్యం లో పనిచేసి వచ్చిన నాకు యుద్ధరంగం లో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించింది. టైం మేయింటేనేన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణం. ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్ లో కూడా సినిమా నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు. -
Janam Movie Trailer Launch: పొలిటికల్ సెటైరికల్ చిత్రం "జనం" ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
నా నీ ప్రేమకథ సినిమా రివ్యూ
రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’ తారాగణం : అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్ ఘోష్, షఫీ, ఫిష్ వెంకట్, అన్నపూర్ణమ్మ తదితరులు రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్ కెమెరా : ఎంఎస్ కిరణ్ కుమార్ సంగీతం : ఎమ్ ఎల్ పి రాజా ఎడిటర్ : నందమూరి హరి నిర్మాణం: పిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్ కథ నాని (అముద శ్రీనివాస్) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్ ఘోష్ గ్రామ పెద్ద. ఆయన కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని ప్రేమిస్తాడు. గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్ ఘోష్) నానిని చంపాలనుకుంటాడు. అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని రక్షించడం.. తనలో వచ్చిన మార్పా? లేక నమ్మించి గొంతు కోసేందుకు ప్లాన్ చేశాడా? తర్వాత ఏం జరిగింది? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఇది ముగ్గురి మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నానిని రక్షించిన సమయంలో గుణలో వచ్చిన మార్పు, దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అయితే ఇక్కడ దర్శకుడే హీరో కావడం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. అటు హీరో పని, ఇటు దర్శకుడి బాధ్యత రెండూ తన భుజాన వేసుకోవడంతో అక్కడక్కడా పట్టు తప్పిపోయాడు. రెండింటిని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో అక్కడక్కడా డైరెక్షన్ మీద పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. హీరో పాత్రలో బాగానే నటించాడు, కానీ హీరో స్థానంలో మరొకరిని తీసుకుని ఉండుంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్ ఇంకాస్త మెరుగ్గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి పర్వాలేదనిపించారు. సిటీలో డాక్టర్ చదివి వచ్చినప్పటికీ గ్రామీణ మూలాలు మరచిపోకుండా సాంప్రాదాయంగా కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్ అయింది. షఫీ గుణ పాత్రలో చక్కగా సెట్టయ్యాడు. అజయ్‌ఘోష్ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను అద్భుతంగా మలచాలని ప్రయత్నించాడు, కానీ కొంతమేరకే సఫలీకృతమయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కెమెరా పనితీరు బానే ఉంది. కానీ, సినిమాలో అక్కడక్కడా దృశ్యాలు డల్‌గా అనిపించాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు. రొటీన్ ప్రేమకథే కావడంతో చాలా సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు. చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ -
‘రుద్రమాంబపురం’ థియేటర్ మూవీ అంటున్నారు: నిర్మాత
‘రుద్రమాంబపురం’ సినిమా చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది థియేటర్లో రావాల్సిన మూవీ అని చెప్పడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత నండూరి రాము అన్నారు. ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం 'రుద్రమాంబపురం'. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహించారు. జులై 6 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నండూరి రాము మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు.యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి విజయం అందించిన ఓటీటీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై మరో సినిమాను అనౌన్స్ చేస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో నటించారు. -
‘రుద్రమాంబపురం’ విజయం సాధించాలి: శ్రీకాంత్
అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రమాంబపురం’. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసారు. ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లి గంజ్ పాడగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...ఎన్. వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. -
‘రాజయోగం’ మూవీ రివ్యూ
టైటిల్: రాజయోగం నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ దర్శకత్వం: రామ్ గణపతి సంగీతం: అరుణ్ మురళీధరన్ డైలాగ్స్: చింతపల్లి రమణ సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. రిషి(సాయి రోనక్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని కలలు కంటాడు. దాని కోసం సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ సారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కి ఇచ్చేందుకై స్టార్ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే.. డేనియల్ (సిజ్జు) వద్ద ఉన్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్)గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. దీంతో రిషి.. ఎలాగైన శ్రీ అసలు రంగును బయటపెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి ఎదురైన సవాళ్లు ఏంటి? రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను కొట్టేశాడా? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? రిషి, శ్రీల మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్) ఎవరు? వజ్రాల గొడవకు, ఐశ్యర్యకు ఎలాంటి సంబంధం ఉంది? తదితర విషయాలు తెలియాలంటే ‘రాజయోగం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ కామెడీ చిత్రాలను టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అందుకే జోనర్లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. రాజయోగం కూడా క్రైమ్ కామెడీ సినిమానే. యూత్‌ని ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సన్నివేశాలు యాడ్ చేశారు. వజ్రం కోసం జరిగే వేటలో ఇద్దరు ప్రేమికులు ఎలా ఇరుక్కున్నారు? ఆ వజ్రం ఎవరికి దొరికింది? చివరకు రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ. యూత్‌ని టార్గెట్‌గా పెట్టుకొని దర్శకుడు రామ్ గణపతి ఈ కథను అల్లుకున్నాడు. అడల్ట్ కామెడీ, మితిమీరిన శృంగారం.. యువతను ఆకట్టుకున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. ఫస్టాఫ్‌లో ఈతరం యువతి, యువకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. అజయ్ ఘోష్, చిత్రం శ్రీనుల కామెడీతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం ఫస్టాఫ్‌లో ఉన్నంత జోష్ ఉండదు. సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. హోటల్ సీన్‌తో పాటు ఒకటి రెండు సన్నివేశాలు నవ్వించినప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ..అన్ని రకాల ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ముఖ్యంగా హీరోయిన్ అంకితతో కలిసి పండించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. అంకిత కూడా ఓ మంచి వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. శ్రీ పాత్రలో ఆమె చేసిన రొమాన్స్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. కేవలం అందాల ఆరబోతకే కాకుండా.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది. విలన్ పాత్రలో డేనియల్ గా సిజ్జు బాగా నటించారు. అలాగే మరో విలన్ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా తన స్టైల్ లో బాగా నటించారు. అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. అరుణ్ మురళీధరన్ నేపథ్య సంగీతం బాగుంది. సిధ్ శ్రీరామ్ ఆలపించిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. -
‘రెచ్చిపోదాం బ్రదర్’మూవీ రివ్యూ
టైటిల్ : రెచ్చిపోదాం బ్రదర్ నటీనటులు :అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థలు :ప్రచోదయ ఫిలిమ్స్ నిర్మాత: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ దర్శకత్వం: ఏ. కె. జంపన్న సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: శ్యాం.కె. నాయుడు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: జులై 29, 2022 కథేంటంటే.. చంద్రమౌళి(బాను చందర్) ఓ జవాన్. బార్డర్లో ఉగ్రవాదుల చేసిన దాడిలో వీరమరణం పొందుతాడు. అతని కొడుకు అభి(రవికిరణ్) చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ కావాలని కోరిక ఉంటుంది. జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడనేది అతని ఉద్దేశం. అనుకున్నట్లే జర్నలిస్ట్ అవుతాడు. అభికి కెమెరామెన్‌గా భానుశ్రీ ఉంటుంది. టీవీ చానల్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అభి పనితనం మెచ్చిన ఆ చానల్ సీఈఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ), ఎండీ బాబురావ్ (బెనర్జీ) అతన్ని రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలతకు పంపుతారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి చేసే మోసాలను కవరేజ్ చేసి చానల్ ఇస్తే.. సీఈఓ, ఎండీ వాటిని ప్రసారం చేయకుండా.. మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇది నచ్చక అభి చానల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ చానల్ పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే వారిని ఇంటర్యూలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి తన తోటి జర్నలిస్ట్‌కు చిన్న దెబ్బతగిలితే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అయితే ఆయన అనూహ్యంగా చనిపోయాడని వైద్యులు చెప్తారు. చిన్న దెబ్బకే ఎలా చనిపోతాడని అభి ఎంక్వయిరీ చేయగా.. షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ నమ్మలేని నిజాలు ఏంటి? ఆ మోసం వేనుక ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరు? వ్యవసాయ మంత్రి చేసిన మోసాలు ఏంటి? నిజాయితీ గల జర్నలిస్ట్‌గా అభి వాటిని ఎలా బయటపెట్టాడు? అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే ‘రెచ్చిపోదాం బ్రదర్’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నిజాయితీగల జర్నలిస్ట్ అభి పాత్రలో(రవికిరణ్) మంచి నటనను కనబరిచాడు. అతనికి ఇది తొలి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. విలన్ భరణిగా అతుల్ కులకర్ణి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. మంచి ముసుగులో మోసాలకు పాల్పడే పాత్ర తనది. నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే వ్యవసాయమంత్రి పాత్రలో అజయ్‌గోష్ మరోసారి తన అనుభవాన్ని తెరపైచూపించాడు.కెమెరామెన్‌గా దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు . పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, టీవీ చానల్ సీఈఓ, ఎండీగా కోటేశ్వరరావు, బెనర్జీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఒక దేశానికి ఆర్మీ ఎంత పవర్ఫుల్లో.. మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఒక నిజాయితీ గల పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న.దీంతో పాటు దేశానికి రైతు ఎంత ముఖ్యమో.. వారు పడే కష్టాలు ఏంటో తెలియజేస్తూ.. సమాజం పట్ల మనకు ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు. నేటి యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నప్పటికీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అందరిని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా రైతులు పడే కష్టాలు, ప్రస్తుతం వారి పరిస్థితులను తెరపై చక్కగా చూపించాడు. ఇక సాంగేకిత విషయానికొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం సాయి కార్తీక్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ..కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. -
ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీగా ‘సురాపానం’
ప్రగ్యా నయన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సురాపానం’ (కిక్–ఫన్). సంపత్ కుమార్ దర్శకత్వం వహించి, లీడ్ రోల్ చేశారు. మట్ట మధు యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశాన్ని థ్రిల్లింగ్‌గా చూపిస్తూ హాస్యాన్ని జోడించి ఈ చిత్రం తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో, కెమెరా: విజయ్ ఠాగూర్. -
వందల కోట్లు పొగొట్టుకొని.. రోడ్డుమీద పడ్డాడు
-
'ఆ డైరెక్టర్ వందల కోట్లు పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు, అయినా'
Ajay Ghosh About Puri jagannadh: ఇడియట్, పోకిరి, దేశముదురు, నేనింతే, ఏక్ నిరంజన్, టెంపర్, లోఫర్, రోగ్.. ఇవన్నీ తిట్లు కాదు.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు. ఆయన తీసిన సినిమాలే కాదు దాని టైటిల్స్ కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు తీసిన ఆయన కెరీర్లో ఎన్ని హిట్లు ఉన్నాయో అంతే ఫ్లాపులున్నాయి. ప్రస్తుతం ఆయన లైగర్ సినిమా తీస్తున్నాడు. ఇదిలా ఉంటే నటుడు అజయ్ ఘోష్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పూరీ చేతిపై జీవితంలో నాట్ పర్మినెంట్ (ఏది శాశ్వతం కాదు) అని ఒక పచ్చబొట్టు ఉంటుంది. నేను ఆయనతో సినిమా చేస్తున్నానంటే నా కొడుకే నమ్మలేదు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంపించాక అది చూసి వాడు ఓ మాటన్నాడు. నువ్వు గొప్ప తాత్వికుడితో పని చేస్తున్నావు. ఇండస్ట్రీలో కొన్ని వందల కోట్లు పోగొట్టుకుని నాలుగు రోడ్ల కూడలి మధ్య నిలబడి తిరిగి లేచిన తరంగంతో పని చేస్తున్నావ్ అన్నాడు. ఇంత డబ్బు పోగొట్టుకున్నాడని నాకు అప్పటిదాకా తెలీదు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు 5 నిమిషాలు పూరీతో మాట్లాడితే జీవితంపై ఎక్కడలేని ప్రేమ వస్తుంది. ఆయన గురించి అంతా తెలిశాక పూరీగారినే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా' అని చెప్పుకొచ్చాడు. -
అజయ్ ఘోష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
‘పుష్ప’లో చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Ajay Ghosh Said He Not Interested To Act In Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ నిన్న విడుదలై థియేటర్లో దూసుకుపోతోంది. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీలో పుష్ప రాజ్‌గా బన్నీ మాస్ లుక్ అదరగొడుతుండగా మిగతా పాత్రలను కూడా సుక్కు డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా చూసిన వారికి ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది.ఈ పాత్ర చేసిన అజయ్ ఘోష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇలా పుష్ప సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ ఈ క్రమంలో మూవీ యూనిట్‌తో పాటు నటీనటులు ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పుష్పలో కొండారెడ్డి పాత్ర చేసిన అజయ్ హోష్ ఓ ఛానల్‌కు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత్రకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘పుష్ప మూవీ ఆఫర్ సమయంలో నేను కరోనా బారిన పడ్డాను. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న క్రమంలో నాకు దర్శకుడి నుంచి పిలుపు వచ్చింది. అయితే అప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న. ఆ సమయంలో మనుషులను చూస్తే భయం.. వాళ్లతో మాట్లాడాలంటే భయం.. అసలు ఇల్లుదాటి బయటికి రావాలన్న భయంతో వణికిపోయాను. చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు అలా ఒంటరిగా ఓ గదిలో ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నాకున్న భయం కారణంగా నేను ఈ సినిమా చేయలేనని చెప్పేశాను. అయినా నన్ను ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. అసలు మూవీ చేయను నాకు ఆసక్తి లేదని చెప్పాను. దీంతో నేరుగా సుకుమార్ ఫోన్ చేసి మాట్లాడారు. నాకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నేను మళ్లీ మామూలు మనిషిని కావడానికి ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి ఆయనను నేను ఒక డైరెక్టర్‌గా కాదు.. దేవదూతగా చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. -
పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...
నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్ గోష్, హర్షవర్ధన్ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు.