‘పుష్ప’లో చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు | Ajay Ghosh Said He Not Interested To Act In Pushpa Movie When He Got Offer | Sakshi
Sakshi News home page

Actor Ajay Gosh: ‘పుష్ప’ ఆఫర్‌ వచ్చినప్పుడు చేయనని చెప్పాను: నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sat, Dec 18 2021 5:07 PM | Last Updated on Sat, Dec 18 2021 6:31 PM

Ajay Ghosh Said He Not Interested To Act In Pushpa Movie When He Got Offer - Sakshi

Ajay Ghosh Said He Not Interested To Act In Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ నిన్న విడుదలై థియేటర్లో దూసుకుపోతోంది. ఎర్ర చందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీలో పుష్ప రాజ్‌గా బన్నీ మాస్‌ లుక్‌ అదరగొడుతుండగా మిగతా పాత్రలను కూడా సుక్కు డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా చూసిన వారికి ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది.ఈ పాత్ర చేసిన అజయ్ ఘోష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇలా పుష్ప సక్సెస్‌ దిశగా దూసుకుపోతోంది.

చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ

ఈ క్రమంలో మూవీ యూనిట్‌తో పాటు నటీనటులు ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పుష్పలో కొండారెడ్డి పాత్ర చేసిన అజయ్‌ హోష్‌ ఓ ఛానల్‌కు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత్రకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘పుష్ప మూవీ ఆఫర్‌ సమయంలో నేను కరోనా బారిన పడ్డాను. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న క్రమంలో నాకు దర్శకుడి నుంచి పిలుపు వచ్చింది. అయితే అప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న. ఆ సమయంలో మనుషులను చూస్తే భయం.. వాళ్లతో మాట్లాడాలంటే భయం.. అసలు ఇల్లుదాటి బయటికి రావాలన్న భయంతో వణికిపోయాను.

చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్‌, ఆందోళనలో దర్శక-నిర్మాతలు

అలా ఒంటరిగా ఓ గదిలో ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నాకున్న భయం కారణంగా నేను ఈ సినిమా చేయలేనని చెప్పేశాను. అయినా నన్ను ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. అసలు మూవీ చేయను నాకు ఆసక్తి లేదని చెప్పాను. దీంతో నేరుగా సుకుమార్ ఫోన్‌ చేసి మాట్లాడారు. నాకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నేను మళ్లీ మామూలు మనిషిని కావడానికి ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి ఆయనను నేను ఒక డైరెక్టర్‌గా కాదు.. దేవదూతగా చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement