ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె తండ్రి గురించి టాలీవుడ్‌లో ఎవరినీ అడిగినా సరే చెప్పేస్తారు. ఎందుకంటే స్వతహాగా టీచర్ అయిన ఇతడు.. ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన మార్క్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ రెండు మూడేళ్ల క్రితం మాత్రం తన లేటెస్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ దర్శకుడి కూతురి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ అమ్మాయి పేరు సుకృతి వేణి. తండ్రి పేరు సుకుమార్. యస్.. మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి డైరెక్టర్ సుకుమార్ కూతురే. తాజాగా ఈమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య తబిత కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో సుకృతిని చూస్తే సడన్‌గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే గతంలో ఒకటి రెండు సార్లు కనిపించిన కాస్త చిన్నపిల్లలా అనిపించింది. కానీ ఇప్పుడు టీనేజీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
అయితే సడన్‌గా సుకుమార్ కూతురు ఫొటో చూసి.. అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఈ అమ్మాయి.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అంటున్నారు. అయితే సుకృతికి యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా? అనేది పక్కనబెడితే పాడే ప్రతిభ ఉంది. ఎందుకంటే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఈమెకి ఉంది. అలానే అమెరికాలోని మసాచుసెట్స్ బెర్కెలే మ్యూజిక్ కాలేజీలో కోర్స్ చేస్తున్నట్లు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సింగర్ అయ్యేలా కనిపిస్తుంది.
ఒకవేళ సింగర్ అయితే అప్పుడు తెలుగు సినిమాల్లో పాడుతుందా? లేదంటే పాప్ సింగర్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని 'బన్నీ మామ' అని పిలుస్తూ క్యూట్‌గా మాట్లాడింది ఈమెనే. కావాలంటే యూట్యూబ్‌లో వీడియో చూడండి. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!)
Comments
Please login to add a commentAdd a comment