పోరాటాల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’ | 'Police Vari Hecharika' Movie Shoot Latest Updates | Sakshi
Sakshi News home page

పోరాటాల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’

Published Tue, Jan 9 2024 11:03 AM | Last Updated on Tue, Jan 9 2024 11:16 AM

Police Vari Hecharika Movie Latest Updates - Sakshi

పాన్‌ ఇండియా నటుడు రవికాలె, అజయ్‌ఘోష్‌, సంజయ్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్‌ వారి హెచ్చరిక’. బాజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్‌ మాస్టర్‌ సింధూరం సతీష్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. 

 దర్శకుడు మాట్లాడుతూ ‘సందేశాత్మక చిత్రమిది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్‌ పూర్తిచేస్తాం’ అన్నారు.  చిత్ర నిర్మాత  బెల్లి జనార్థన్ మాట్లాడుతూ.. భారత సైన్యం లో పనిచేసి వచ్చిన నాకు యుద్ధరంగం లో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించింది. టైం మేయింటేనేన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణం. ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్ లో కూడా సినిమా నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement