Police Vaari Hecharika Movie
-
విలన్లతో ప్రేమ గీతం
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దెష్, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ, జయవాహిని, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించారు. గజ్వేల్ వేణు సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఓ పాటని నటుడు రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సాధారణంగా సినిమాల్లో హీరో–హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటారు.కానీ, ఈ సినిమాలో విలన్లు ప్రేమ గీతం పాడుకోవడం వైవిధ్యమైన ఆలోచన. ఈ చిత్రం విడుదలైన తర్వాత విలన్లకూ డ్యూయెట్లు పెట్టే ట్రెండ్ మొదలవుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్నిస్తుంది’’ అని బెల్లి జనార్థన్ చెప్పారు. ‘‘మా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని బాబ్జీ అన్నారు. -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాల చిత్రీకరణలో ‘పోలీస్ వారి హెచ్చరిక’
పాన్ ఇండియా నటుడు రవికాలె, అజయ్ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్ నేతృత్వంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సందేశాత్మక చిత్రమిది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేస్తాం’ అన్నారు. చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ.. భారత సైన్యం లో పనిచేసి వచ్చిన నాకు యుద్ధరంగం లో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించింది. టైం మేయింటేనేన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణం. ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్ లో కూడా సినిమా నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు.