
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్‌లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.
మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment