రోహిత్ ‘క‌ళాకార్’కు హీరో శ్రీకాంత్‌ సాయం | Rohith Kalakar First Look Poster Released By Srikanth | Sakshi
Sakshi News home page

రోహిత్ ‘క‌ళాకార్’కు హీరో శ్రీకాంత్‌ సాయం

Published Sat, Jul 17 2021 6:28 PM | Last Updated on Sat, Jul 17 2021 7:00 PM

Rohith Kalakar First Look Poster Released By Srikanth - Sakshi

`6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, నేను సీతామాలక్ష్మి, శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, నవ వసంతం`వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `కళాకార్‌`. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ ‘ఫ‌స్ట్ క‌ళాకార్ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫ‌స్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వెంక‌ట‌రెడ్డిగారు నిర్మాత‌గా శ్రీ‌ను బందెల డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. రోహిత్ నేను క‌లిసి ఎప్ప‌టినుండో ఇండ‌స్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము.  ఆయ‌న మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్  టు రోహిత్ అండ్ టీమ్‌`` అన్నారు. 

హీరో రోహిత్ మాట్లాడుతూ..‘క‌ళాకార్ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ హీరో శ్రీ‌కాంత్ గారు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎప్ప‌టినుంచో నాకు మంచి అనుభందం ఉంది. నేను ఫస్ట్‌ టైమ్‌ యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ స‌బ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్ర‌మిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి న‌చ్చుతుంది’అన్నారు. 

చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ..‘మా 'కళాకార్‌`ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసిన హీరో శ్రీ‌కాంత్‌గారికి ధ‌న్య‌వాదాలు. హీరో రోహిత్‌కు ప‌ర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ స‌బ్జెక్ట్ ఇది. మంచి క‌థ-క‌థ‌నం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తాం’అన్నారు. 

దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ..‘ఈ మూవీతో రోహిత్ ఒక డిఫ‌రెంట్ లుక్‌లో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వ‌చ్చింది’అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement