పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా... | Good Bad Ugly Movie First Look is released in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...

Published Mon, Aug 14 2017 12:54 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...

పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...

నటుడు, రచయిత హర్షవర్ధన్‌ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్‌ గోష్, హర్షవర్ధన్‌ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్‌.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్‌ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి.

షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్‌ గుడ్‌ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్‌ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్‌ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్‌ఆర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement