పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్ | Harshavardhan Good Bad ugly Movie First Look | Sakshi
Sakshi News home page

పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్

Published Sun, Aug 13 2017 3:37 PM | Last Updated on Thu, Jul 25 2019 6:37 PM

పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్ - Sakshi

పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్

బుల్లితెరపై స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది తారలు ఇప్పుడు వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, లాస్య లాంటి వారు వెండితెర మీద కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అలరించిన యాంకర్ శ్రీముఖి.. ఇప్పుడు లీడ్ రోల్ ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమా 80ల నాటి కథతో పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతోంది.

ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్దన్ తొలి సారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో శ్రీముఖి లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. అంజి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీముఖితో పాటు కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement