రుతురాగాలతో నటజీవితం ప్రారంభం | Directed harshvardhan special interview | Sakshi
Sakshi News home page

రుతురాగాలతో నటజీవితం ప్రారంభం

Published Mon, Dec 25 2017 11:19 AM | Last Updated on Mon, Dec 25 2017 11:19 AM

Directed harshvardhan special interview - Sakshi

విజయనగరం టౌన్‌: రుతురాగాలు సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అంచలంచెలుగా ఎదిగి అమృతం సీరియల్‌తో అందరి మన్ననలు పొంది, లీడర్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి హిట్‌ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన మన జిల్లావాసి ఎమ్‌.హర్షవర్దన్‌ ఆదివారం గోల్డెన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ విజయనగరం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆత్మీయకలయిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో  తన అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...

అప్పుడు మొదలైంది..
దూరదర్శన్‌లో ప్రసారమైన రుతురాగాలతో నట జీవితాన్ని ప్రారంభించాను. పుట్టింది రాజాంలోనైనా విద్యాభ్యాసం, పెరిగిందంతా విజయనగరంలోనే కావడం నా అదృష్టం. రుతురాగాలు తర్వాత కస్తూరీ, శాంతినివాసం సీరియల్స్‌లో నటించాను. అమృతం సీరియల్‌ ఎక్కువ పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చింది. సినీరంగ ప్రవేశంలో లీడర్, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాలు బాగా పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే దర్శకునిగా పనిచేశాను.  

 ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో
 ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. సినిమా అంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాను. యాంకర్‌ శ్రీముఖి ఇందులో హీరోయిన్‌గా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. 1989లో పల్లెటూర్లో జరిగిన  యధార్ధ సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement