‘రుద్రమాంబపురం’ విజయం సాధించాలి: శ్రీకాంత్‌ | Hero Srikanth Launches Rudramambapuram movie Jatara song | Sakshi
Sakshi News home page

‘రుద్రమాంబపురం’ విజయం సాధించాలి: శ్రీకాంత్‌

Published Wed, Jun 28 2023 7:39 PM | Last Updated on Wed, Jun 28 2023 7:39 PM

Hero Srikanth Launches Rudramambapuram movie Jatara song - Sakshi

అజ‌య్ ఘోష్‌, శుభోద‌యం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రమాంబపురం’. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసారు. ఈ పాటను ఆస్కార్ విజేత  రాహుల్ సిప్లి గంజ్ పాడగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...ఎన్. వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement