అజయ్ ఘోష్.. తన వాయిస్‌తోనే డైలాగ్స్‌కు మరింత శక్తి తీసుకురాగలడు. సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు చాలా సింపుల్‌గా ఉంటాడు అజయ్. సామాన్యులలాగే రోడ్డు పక్కన షాపులో కూడా భోజనం చేస్తుంటాడు. సాధారణ పంచెకట్టుతో కనిపిస్తాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కారం మెతుకులు తిన్నా..
'ఒకప్పుడు నా కుటుంబం కడుపేదరికం అనుభవించింది. ఎవరిదగ్గరైనా బట్టలు అడిగి వేసుకునేవాడిని. పచ్చడి, కారం మెతుకులు తిన్న రోజులున్నాయి. ఆ కష్టాల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్తే మా నాన్న ఒక్కడే కష్టపడేవాడు. మొదటినుంచీ నేను తిండిపోతును. నాకింత అన్నం ఉంటే చాలు.. అయితే వండిన అన్నం నేను తిన్న తర్వాత మిగిలింది అమ్మానాన్న తినేవారు. ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇంకా ఎంతో ఎత్తుకు చేరుకోవాలి..' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
'పుష్ప'కు అందుకే నో చెప్పా
పుష్ప ఆఫర్ తిరస్కరించడంపై స్పందిస్తూ.. 'అప్పుడు నాకు కరోనా వచ్చింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. ఆ సమయంలో నేను ఊరిలో ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రావాలంటేనే భయమేసింది. పుష్ప కోసం అడిగినప్పుడు కరోనా భయంతోనే ఒప్పుకోలేదు. అందరూ ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ నిరాకరించాను. చివరకు డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. ఆయన మాటలు విన్నాక ఏదైతే అదైందని ఒప్పుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడేవరకు ఆగారు. తర్వాత షూటింగ్ చేశాం.. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అజయ్ ఘోష్.
చదవండి: అదే రాళ్లపల్లి వీక్‌నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే!
Comments
Please login to add a commentAdd a comment