villian
-
ఆ సినిమా షూటింగ్లో ఏడ్చిన హీరోయిన్.. చివరకు తప్పలేదు!
ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక కొన్ని ఇష్టం ఉన్నా, లేకపోయినా చేయక తప్పదు. అలా హీరోయిన్ మాధురి దీక్షిత్ గతంలో ఒక అత్యాచార సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ ఆ సీన్ చేయడం ఇష్టం లేక ఆమె ఎంతగానో ఏడ్చిందట! ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ విలన్ రంజీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రంజీత్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ పరిత్యాగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆరోజు అత్యాచార సీన్ చిత్రీకరించాలి. నేను రెడీగా ఉన్నాను. ఎందుకింత ఆలస్యం? ఇంతలో మాధురి ఆ సీన్ చేయనని ఏడుస్తూ ఉందట. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారా? అని అనుకుంటూ ఉండగా ఓ ఆర్ట్ డైరెక్టర్ తను ఏడుస్తుందని అసలు విషయం చెప్పాడు. అతడొక బెంగాలీవాసి. మా డైరెక్టర్ పేరు బాపు. తను దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇకపోతే సినిమాలో మాధురి తండ్రి చాలా పేదవాడు. తోపుడుబండి నడుపుతూ ఉంటాడు. ఆ బండిపైనే హీరోయిన్‌తో నా సీన్ చిత్రీకరించాల్సి ఉంది. చాలాసేపటి తర్వాత ఆమె ఆ సీన్ చేసేందుకు ఒప్పుకుంది. కట్ చెప్పకుండా.. ఫైట్ మాస్టర్ వీరు దేవ్‌గణ్.. ఎక్కడా సీన్‌కు కట్ చెప్పకుండా చూసుకోండి.. మేము కెమెరాను తిప్పుతూనే ఉంటామని చెప్పాడు. అత్యాచార సన్నివేశాల్లో నటించడమనేది మా పని. కానీ విలన్లమైన మేము మరీ అంత చెడ్డవాళ్లమైతే కాదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రేమ్ పరిత్యాగ్ 1989లో రిలీజైంది. మిథున్ చక్రవర్తి, మాధురి దీక్షిత్, రంజీత్ సహా దివంగత నటులు వినోద్ మెహ్రా, సతీశ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రంజీత్ విషయానికి వస్తే ఈయన కెరీర్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. చదవండి: తొలిసారి తండ్రి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్ -
పచ్చడి మెతుకులు.. నాకు అన్నం ఉంటే చాలు.. నటుడి కంటతడి
అజయ్ ఘోష్.. తన వాయిస్‌తోనే డైలాగ్స్‌కు మరింత శక్తి తీసుకురాగలడు. సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసిన ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు చాలా సింపుల్‌గా ఉంటాడు అజయ్. సామాన్యులలాగే రోడ్డు పక్కన షాపులో కూడా భోజనం చేస్తుంటాడు. సాధారణ పంచెకట్టుతో కనిపిస్తాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కారం మెతుకులు తిన్నా.. 'ఒకప్పుడు నా కుటుంబం కడుపేదరికం అనుభవించింది. ఎవరిదగ్గరైనా బట్టలు అడిగి వేసుకునేవాడిని. పచ్చడి, కారం మెతుకులు తిన్న రోజులున్నాయి. ఆ కష్టాల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్తే మా నాన్న ఒక్కడే కష్టపడేవాడు. మొదటినుంచీ నేను తిండిపోతును. నాకింత అన్నం ఉంటే చాలు.. అయితే వండిన అన్నం నేను తిన్న తర్వాత మిగిలింది అమ్మానాన్న తినేవారు. ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇంకా ఎంతో ఎత్తుకు చేరుకోవాలి..' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'పుష్ప'కు అందుకే నో చెప్పా పుష్ప ఆఫర్ తిరస్కరించడంపై స్పందిస్తూ.. 'అప్పుడు నాకు కరోనా వచ్చింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. ఆ సమయంలో నేను ఊరిలో ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రావాలంటేనే భయమేసింది. పుష్ప కోసం అడిగినప్పుడు కరోనా భయంతోనే ఒప్పుకోలేదు. అందరూ ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ నిరాకరించాను. చివరకు డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. ఆయన మాటలు విన్నాక ఏదైతే అదైందని ఒప్పుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడేవరకు ఆగారు. తర్వాత షూటింగ్ చేశాం.. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అజయ్ ఘోష్. చదవండి: అదే రాళ్లపల్లి వీక్నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే! -
స్టార్ హీరో సినిమా.. ఒప్పుకుని తప్పు చేశా..: ప్రముఖ విలన్
ముఖేశ్ రిషి.. తెలుగులో ఇన్స్పెక్టర్గా మొదలుపెట్టి తర్వాత విలన్‌గా స్థిరపడిపోయాడు. ఒక్క టాలీవుడే కాదు తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ విలనిజం పండించి స్టార్ నటుడిగా ఎదిగాడు. చాలామందికి ఈయనను చూడగానే గుర్తొచ్చే డైలాగ్.. 'వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా'.. ఇంద్ర మూవీలో చిరంజీవి విలన్‌కు వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగిది! ఈ సినిమా విజయంతో ఇతడు తెలుగులో ఫుల్ బిజీ అయ్యాడు. సినిమాల్లో గూండాగిరి చేసే ఈయన హిందీ గూండా మూవీలోనూ దాదాగిరి చేశాడు. 1998లో రిలీజైన ఈ మూవీ అప్పుడు ఘోర పరాజయం చవిచూసింది. ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా.. మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. గూండాను ద్వేషించారు. కానీ తర్వాతి కాలంలో మాత్రం ఇది కల్ట్ బొమ్మగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు విలన్ ముఖేశ్ రిషి. అతడు మాట్లాడుతూ.. 'నేను గూండా సినిమా చేసిన రోజులవి.. షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే ఈ మూవీ ఒప్పుకుని తప్పు చేశాననిపించింది. ఓ సీనియర్ నటుడు కూడా అలాంటి పాత్ర చేయడం అవసరమా? అని తిట్టాడు. అప్పుడు తిట్టారు.. తర్వాత పొగిడారు అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తగా దొరికిన విలన్‌ను. మంచిమంచి సినిమాలు చేస్తున్నాను. అలాంటి సమయంలో గూండా సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కాలేదు. అప్పుడా చిత్రం ఆడలేదు.. కానీ అది విడుదలైన కొన్నేళ్లకు.. అంటే కంప్యూటర్లు నెమ్మదిగా అలవాటైతున్న రోజుల్లో జనాలు గూండాను చూశారు. మెచ్చుకున్నారు. బుల్లా(సినిమాలో పాత్ర పేరు)గా నీ క్రేజ్ ఎలా ఉందో తెలుసా? ఇంటర్నెట్లో మొత్తం నీదే హవా అని సైఫ్ అలీఖాన్ చెప్పేవరకు నాకు ఈ విషయం తెలియలేదు. ఇప్పటికీ ఆ పాత సినిమాలు.. తర్వాత నాకు విదేశీయుల నుంచి కూడా అభినందనలు రావడం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా బుల్లా డైలాగులు చెప్పమనేవారు. ఆ సినిమా చేసినప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఫీలయ్యాను. కానీ ఇప్పటి జనరేషన్‌కు అది ఎంతో నచ్చేసింది. 20-30 ఏళ్ల కింద రిలీజైన సినిమాలను కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నారు' అని చెప్పుకొచ్చాడు ముఖేశ్. చదవండి: అన్న బ్రహ్మచారి, తమ్ముడేమో రెండు పెళ్లిళ్లు.. సల్మాన్ రియాక్షనిదే! -
హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు
ఏ సినిమా అయినా హీరో హీరోయిన్ ఉంటారు. విలన్ వల్ల వాళ్లకు ఓ సమస్య వస్తుంది. దాన్ని సదరు పాత్రలు ఎలా అధిగమించాయనేదే స్టోరీ. ఏ మూవీ తీసుకున్నా చాలావరకు ఇదే ఉంటుంది. ఇది పక్కనబెడితే హీరోలు లేదా హీరోయిన్లకు మాత్రమే సినిమాల వల్ల కష్టాలుంటాయని అనుకుంటుంటారు. కానీ ఓ విలన్.. షూటింగ్స్‌లో తనకెదురైన ప్రాబ్లమ్స్ చెప్పుకొని తెగ బాధపడిపోయాడు. అలాంటి సీన్సే 'నేను ఒకేసారి 80 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు చిన్న రోల్స్ ఆఫర్ చేస్తే, మరికొందరు ప్రతినాయకుడి పాత్రల్లో అవకాశమిచ్చేవాళ్లు. అయితే వాటిలో చాలావరకు హీరోయిన్ల చీరలు లాగే లేదా బలత్కారం చేసే సీన్స్ మాత్రమే ఉండేవి. అవి చేసి చేసి నాకు చిరాకొచ్చేసేది.' (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) తీరక లేకుండా ఈ నటుడు అసలు పేరు గోపాల్ బేడీ. కానీ సినిమాల్లోకి వచ్చాక రంజిత్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ముంబయిలో నేను ఉంటున్నప్పుడు అమ్మ నన్ను కలవడానికి వచ్చింది. తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ఆమెని డ్రాప్ చేయడానికి కూడా తీరిక ఉండేది కాదు. ఎందుకంటే అంత బిజీగా ఉండేవాడిని' అని నటుడు రంజిత్ చెప్పుకొచ్చాడు. ఆ పేరు నిక్‌నేమ్‌గా 80ల్లో ఎక్కువగా సినిమాలు చేసిన రంజిత్... ఫరేబి, నాగిన్, అమర్ అక్బర్ ఆంటోని, నయా దౌర్, సుహాగ్, రాకీ, సర్ఫరోస్ చిత్రాలతోపాటు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలోనూ నటించాడు. అయితే ఎక్కువగా హీరోయిన్ల చీర లాగే సీన్స్‌లో యాక్ట్ చేయడంతో.. 'రంజిత్-ద రే*పిస్ట్' అనే పేరుతో ఎక్కువగా ఇతడిని పిలిచేవారు. అలాంటి ఆ నటుడు ఇప్పుడు విలన్ పాత్రల వల్ల విసిగిపోయానని చెప్పడం వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) -
అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి
ఏ సినిమాలో అయినా స్క్రీన్ పై కనిపించేవాళ్లు కేవలం నటులు. కానీ మనమేమో హీరోలని అభిమానిస్తాం, హీరోయిన్లని ప్రేమిస్తాం, విలన్స్‌ని ద్వేషిస్తాం. చెప్పాలంటే విలన్ పాత్రని క్రూరంగా చూపిస్తే మనమే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సదరు విలన్ యాక్టర్స్ నిజ జీవితంలో అలా ఉండరు! కానీ ఆ పాత్రల తాలుకూ ప్రభావం మాత్రం వాళ్లపై గట్టిగానే పడుతుంది. తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ వస్తూనే ఉంటారు. కానీ చాలామందికి ఆశిష్ విద్యార్థి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో 'పద్మావతి హ్యాపీయేనా?' అనే డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఈ నటుడే గుర్తొస్తాడు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ విలన్ పాత్రలు చేసిన ఇతడు.. ఆ తర్వాత కామెడీ విలన్ రోల్స్ కి షిప్ట్ అయ్యాడు. ఏదేమైనా వీటి వల్ల తను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) 'సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చేసిన అలాంటి పాత్రల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్స్ తమ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకోలేరు! కదా? వాటి ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ కామెంట్స్.. అన్నీ!' అని నటుడు ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టాలో దీనితోపాటు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం చూసుకుంటే.. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మరోవైపు ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2001లో రాజోషి బరువాని పెళ్లి చేసుకున్న ఇతడు.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ మధ్యే రూపాలీ బరువా అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
ఎన్టీఆర్ v/s చియాన్ విక్రమ్...సత్తా చాటేదెవరు?
-
ఓవైపు విలనిజం.. మరోవైపు హాస్యం.. వీళ్ల స్టైలే సెపరేటు
చాలా సినిమాల్లో శాడిస్ట్ విలన్లను చూశాం. భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే విలన్లను కూడా అనేక మూవీస్‌లో చూశాం. చాలా సినిమాల్లో కాకపోయినాకొన్ని చిత్రాల్లో ఇంటిలిజెంట్ విలన్లను చూశాం. కానీ అతి భయంకరమైన విలనీజాన్ని ప్రదర్శిస్తూ, అదే సమయంలో నవ్వించే విలన్లను చూశారా మీరు ? ఆ క్యారెక్టర్ మీద ప్రేక్షకుల్లో భయం పోకుండా చూసు కుంటూ మళ్లీ అదే ప్రేక్షకులను నవ్వించాలి. ఇది చాలా క్లిష్టమైన టాస్క్. సిల్వర్ స్క్రీన్ మీద ఈ టాస్క్‌ని వండర్స్‌లా పండించిన వాళ్లపై ఒక లుక్ వేద్దామా… ►సినిమాలో హీరో ఎంత కామనో విలన్ కూడా అంతే కామన్. విలన్ క్యారెక్టర్ ఎంత భయంకరంగా, బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవుతుంది. అలా కాకుండావిలన్ కామెడీ చేస్తే ఏమౌతుంది ? అది కామెడీ సినిమా అవుతుంది. కానీఒకే సినిమాలో ఒకే క్యారెక్టర్‌తో ఇటు విలనీజాన్ని, అటు కామెడీని పండిస్తూ మూవీలోని సీరియస్‌నెస్‌ని దెబ్బ తీయకుండా నటించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఛాలెంజ్‌ని తమ అసాధారణ నటనతో అధిగమించిన కొద్ది మంది నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. శత్రువు సినిమాలో వెంకటరత్నం పాత్రలో కోటా శ్రీనివాసరావు జీవించారు. వెంకటరత్నం అత్యంత దుర్మార్గుడు. తన అక్రమాలకు ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాడు. అలాంటి పాత్రకే కామెడీ టచ్ ఇచ్చారు దర్శకుడు కోడి రామకృష్ణ.సినిమా అంతా ఇలాంటి మేనరిజంతోనే కామెడీ టచ్‌తోనే వెంకటరత్నం క్యారెక్టర్ సాగుతుంది. కానీ విలన్ తాలుకూ దుర్మార్గాలకు ఆ కామెడీ అంటకుండా కోటా అద్భుతంగా నటించారు.కొంచెం నవ్వించగానే కామెడీ విలన్ అన్న భావన వస్తుంది. కానీ నవ్వించే చోట నవ్విస్తూ అదే సమయంలో అత్యంత దుర్మార్గుడుగా విలనీజం పండిస్తూ అద్భుతంగా నటించారు కోటా. ►తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలన్ క్యారెక్టర్లలో ఒకటి ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్. ఈ పాత్రలో రావుగోపాలరావు జీవించేశారు. సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో రావుగోపాలరావు క్యారెక్టర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అయింది. హత్యలు చేయడం దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి వారిని విడదీయడం దాకా దగుల్బాజీ పనులను కాంట్రాక్ట్ పద్దతిలో చేసే కాంట్రాక్టర్ పాత్ర రావుగోపాలరావుది. సినినమా మొత్తంలోనూ అత్యంత క్రూరమైన పనులను చాలా సౌమ్యంగా చేస్తుంది కాంట్రాక్టర్ పాత్ర. మడిసన్నాక కాస్తంత కళాపోసనుండాలయ్యా…ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటుంది అంటూ గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్స్ ఒక రేంజ్లో పేలాయి. ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌తో విడుదలైన ఎల్.పి.రికార్డులు, ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఇంతగా అలరించిన అదే క్యారెక్టర్లో విలన్‌గా ప్రేక్షకులను భయ పెట్టారు రావుగోపాలరావు. ఒకే పాత్రలో రెండు షేడ్స్‌ని అద్భుతంగా ప్రదర్శించారు. విలన్ కూడా మనిషే. అతనికి సెంటిమెంట్లు ఉంటాయి. అతనికి బాధ వేస్తుంది. భయం వేస్తుంది. ఇంత వరకు ఓకే. కానీ…విలన్ పదే పదే నవ్వేసి, ప్రేక్షకులను నవ్వించాడు అంటే…ఆ విలనిజం తాలుకూ భయం పోతుంది. విలన్ అనగానే సహజంగా ఆడియన్స్‌లో కలిగే గగుర్పాటు మాయమవుతుంది. అది మిస్ కానివ్వకుండా తన పాత్రని కాసేపు కామెడీ ట్రాక్ మీద, కాసేపు కుతంత్రాల ట్రాక్ మీద నడిపించడం నటుడుకి నిజంగా ఛాలెంజే. ►తెలుగు ప్రేక్షకులకు విలనిజాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. క్షణక్షణం చిత్రంలో నాయర్ క్యారెక్టర్ దశాబ్దాలు గడిచినా ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. అత్యంత దుర్మారుడుగా ఒక వైపు కనిపిస్తూనే అదే సమయంలో ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించాడు రావెల్. ఆ పాత్రని రాంగోపాల్ వర్మ డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డెన్లు గట్రా లేకుండా… చిన్న మఫ్లర్ కట్టుకొని కామన్ మ్యాన్ లా కనిపిస్తూనే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంది నాయర్ క్యారెక్టర్. ►ఒకవైపు సీరియస్ విలన్‌గా ఎక్స్‌ఫోజ్ అవుతూ…తన మీద ఉన్న క్రూయల్ ఫీల్ అలానే మెయిన్‌టెన్ అయ్యేలా చూసుకుంటూ అదే సమయంలో కామెడీ చేయడం చాలా కష్టం. దాన్ని చాలా ఈజీగా చేసేశాడు పరేష్ రావెల్. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని ,రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని నాయర్ క్యారెక్టర్‌తో చెప్పాడు డైరెక్టర్. పాములు పగ పడతాయంటావా? అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు లాంటి నార్మల్ డౌట్స్‌తో మొదలు పెడితే…చాలా రకాలుగా నవ్వించాడు పరేష్ రావెల్. ►భయంకరమైన విలన్‌గా, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌గా ప్రేక్షకులను జయప్రకాష్ రెడ్డి ఏ రేంజ్లో భయపెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే…పక్కా కమెడియన్‌గా కూడా చాలా సిని మాల్లో మెప్పించారు. అయితే…ఒకే సినిమాలో ఇటు సీరియస్ విలన్‌గా, మరి కాసేపు కామెడీ టచ్‌తో వావ్ అనిపించింది కృష్ణ మూవీలో కృష్ణ సినిమాలో ప్రధాన విలన్ బాబాయ్, అతను చేసే ప్రతి దుర్మార్గంలోనూ పాలు పంచు కునే క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డిది. మెయిన్ విలన్ జగ్గా చేసే ప్రతి పాపపు పనికి స్కెచ్ గీసే పాత్రలో కూడా ఆయన హాస్యం పండించారు. రవితేజ, జయప్రకాష్ రెడ్డి…ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కాంబినేషన్లలో వచ్చే సీన్లు ఒక రేంజ్లో పేలాయి. -
విలన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఫస్ట్‌లుక్ రిలీజ్.. పెజ్జొని పేటోడికి పని ఇస్తే
ప్రముఖ సంగీతదర్శకుడు కోటి ప్రతినాయకుడిగా మారారు. పగ పగ పగ అనే చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రంలోని కోటి ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను శుక్రవారం ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. హలో పెజ్జొని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసే చస్తాడు అనే డైలాగ్ గ్లింప్స్‌లో వినిపిస్తుంది. చదవండి: ఆనంద్ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్ షురూ సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ పగ పగ పగ చిత్రం రూపొందింది. రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి, కెమెరా నవీన్ కుమార్ చల్లా, సహ్మ నిర్మాత సత్యవతి. చదవండి: పంజాబీ స్టైల్లో.. కోకా సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న రౌడీ హీరో -
డైరెక్టర్ బతిమాలినా.. ఆ నటుడు వినలేదు!
సూపర్హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్‌తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్‌ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, అదే టైంలో ఎమోషన్స్‌ని సైతం పంచుతుంది. మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన. వాకిన్ ఫినిక్స్ లీడ్రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్‌ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట. వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్‌ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్‌కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం . కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన. -
అవెంజర్స్‌తో జతకట్టిన భళ్లాల దేవ
సాక్షి, హైదరాబాద్ : హాలీవుడ్ సినిమాలో మన తెలుగు నటుడా అని ఆశ్చర్యపోకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్లో జతకట్టింది నటనతో కాదు..సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆ రూట్లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్ సిరీస్‌లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్ ఆర్మీ.. అదే విలన్ తానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట రానా. మరో సారి భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద వినబోతున్నారు ప్రేక్షకులు. రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్ చదువుతూ, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. మార్వెల్ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నచ్చిన పాత్రలని ఆయన తెలిపారు. ఈ సినిమాలో విలన్ తానో పాత్రకు డబ్బింగ్ చెప్పటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. -
స్లో డ్రామా.. కానీ కుమ్మేస్తోంది
సాక్షి, సినిమా : మనమంతా, జనతా గ్యారేజ్, మన్యంపులి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన నటుడు మోహన్ లాల్‌కు సొంత ప్రాంతంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ యాక్టర్ గా ట్యాగ్‌లైన్ తగిలించుకున్న ఆయన ఇప్పుడు మరో రికార్డు సృష్టించారు. మోహన్ లాల్ కొత్త చిత్రం ‘విలన్’ ఈ మధ్యే రిలీజ్ కేరళలో ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు వసూళ్ల సరికొత్త రికార్డును నెలకొల్పింది. 4.91 కోట్ల(గ్రాస్) వసూళ్లతో మమ్మూటీ-పృథ్వీరాజ్ చిత్రం ది గ్రేట్ ఫాదర్ రికార్డును విలన్ బద్ధలుకొట్టింది. అంతేకాదు తొలివారంలో 10 కోట్లు వసూలు చేసి మరో రికార్డును కూడా సృష్టించింది. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి చాలా ప్రత్యేకతలు ఉండటం విశేషం. కోలీవుడ్ హీరో విశాల్, నటి హన్సిక, తెలుగు నటులు శ్రీకాంత్, రాశీఖన్నా ఇందులో ప్రధాన పాత్రల్లో, మంజు వారియర్ ఓ గెస్ట్ రోల్లో నటించింది. విశాల్, శ్రీకాంత్‌లు తమ సొంత గొంతునే అందించగా, రాశీఖన్నా ఏకంగా ఓ పాట పాడటం విశేషం. అంతేకాదు దేశంలోనే మొదటిసారి 8కే టెక్నాలజీ ద్వారా షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రంగా విలన్ ఘనత సాధించింది. అయితే యాక్షన్ పాలు తక్కువగా ఉండటం.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో విలన్ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయినా మోహన్ లాల్ స్టార్ డమ్.. మిగతా హంగులు సినిమాను నిలబెడతాయన్న విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్లో తమిళం, తెలుగు భాషల్లో విలన్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ప్రకటించారు. -
రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్
లోఫర్ సినిమాలో విలన్‌గా చేసిన చరణ్‌దీప్ గుర్తున్నాడా? ఇంతకుముందు జిల్లాలో కూడా చేసిన ఇతడికి ప్రస్తుతం మంచి డిమాండు కనిపిస్తోంది. ఒకేసారి ఏకంగా ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక తెలుగు సినిమాలో మాత్రం పాజిటివ్ పాత్ర చేస్తూ.. రేష్మీగౌతమ్ సరసన కూడా నటిస్తున్నాడు. ఈ సంవత్సరం తనకు చాలా బిజీగా ఉందని, అయితే విజయాలు కూడా అలాగే వస్తున్నాయని చరణ్ దీప్ అంటున్నాడు. విశాల్ చేస్తున్న కత్తి సందై, సునీల్ హీరోగా వస్తున్న ఈడు గోల్డ్ ఎహ, ఇంకా వీరా, శరబ, నాను మత్తు వరలక్ష్మి, అంతమ్, మొట్ట శివ కెట్ట శివ.. వీటన్నింటిలోనూ చరణ్దీపే విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. వీటన్నింటిలో ఈడు గోల్డ్ ఎహ సినిమాలో పాత్ర చాలా బాగుంటుందని, అందులో తండ్రికి బాగా దగ్గరగా ఉండే ఎమోషనల్ విలన్‌గా చేస్తున్నానని అన్నాడు. ఇక శరభ సినిమాలో అయితే.. ఇంతకుముందు అరుంధతిలో సోనుసూద్ చేసిన తరహా పాత్ర చేస్తున్నాడట. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని, ఈ పాత్ర కోసం తాను పూర్తిగా మేకోవర్ చేయాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం మేకప్ కోసమే రోజూ మూడుగంటలు పట్టిందని, ఇది తన కెరీర్లోనే చాలా ఛాలెంజింగ్ రోల్ అని తెలిపాడు. ఇక తెలుగులో వస్తున్న థ్రిల్లర్ మూవీ 'అంతం'లో వెరైటీగా పాజిటివ్ పాత్రలో చేస్తున్నాడు. ప్రతిసారీ విలన్ పాత్రల్లో కనపడే తనను పాజిటివ్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుమానంగానే ఉందని చెప్పాడు. ఈ సినిమాలో అతడు రేష్మి గౌతమ్ సరసన నటిస్తున్నాడు.