విలన్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. పెజ్జొని పేటోడికి పని ఇస్తే | Music Director Koti Turns As Villain First Look Out | Sakshi
Sakshi News home page

Music Director Koti: విలన్‌గా మారిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published Sat, Aug 13 2022 8:50 AM | Last Updated on Sat, Aug 13 2022 3:26 PM

Music Director Koti Turns As Villain First Look Out - Sakshi

ప్రముఖ సంగీతదర్శకుడు కోటి ప్రతినాయకుడిగా మారారు. పగ పగ పగ అనే చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రంలోని కోటి ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ను శుక్రవారం ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేష్‌ విడుదల చేశారు. హలో పెజ్జొని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసే చస్తాడు అనే డైలాగ్‌ గ్లింప్స్‌లో వినిపిస్తుంది. చదవండి: ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్‌ షురూ 

సుంకర బ్రదర్స్‌  వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ పగ పగ పగ చిత్రం రూపొందింది. రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి, కెమెరా నవీన్‌ కుమార్‌ చల్లా, సహ్మ నిర్మాత సత్యవతి. చదవండి: పంజాబీ స్టైల్‌లో.. కోకా సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న రౌడీ హీరో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement