ఆ సినిమా తర్వాత అందుకే చిరంజీవితో పని చేయలేదు: కోటి  | Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral | Sakshi
Sakshi News home page

Koti: ఆ సంఘటన నన్ను చిరంజీవికి దూరం చేసింది

Published Wed, Nov 10 2021 1:56 PM | Last Updated on Wed, Nov 10 2021 3:12 PM

Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral - Sakshi

Music Director Koti Comments On Clash With Chiranjeevi Goes Viral: మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలకు బ్లాక్‌ బస్టర్‌ సాంగ్స్‌ను అందించారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి-కోటి కాంబినేషన్‌లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే.. వంటి ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరికి మంచి అనుబంధం ఉండేదని, అయితే ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్‌ వచ్చిందని కోటి అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూలో ఇందుకు ఇద్దరి  మధ్య ఎందుకు బ్రేక్‌ వచ్చిందో తెలిపారు. చదవండి: వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున వేసుకున్న షర్ట్‌ అంత ఖరీదా?

'ఓ సినిమా 100డేస్‌ ఫంక్షన్‌ ఓంగోలులో జరిగింది. అది మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లా. అయితే హఠాత్తుగా నాకు హైఫీవర్‌ రావడంతో ఫంక్షన్‌కు రాలేకపోయాను. కానీ  నేను కావాలనే ఫంక్షన్‌కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడానికి ఆఫీసుకు వెళ్లితే, అప్పుడు ఆయన మాట్లాడే మూడ్‌లో లేనని అన్నారు.

చిరంజీవి అలా రియాక్ట్‌ కావడంలో తప్పులేదనిపించింది. దీంతో వెనక్కు వచ్చేశాను.హిట్లర్‌ తర్వాత మళ్లీ చిరంజీవితో పని చేయలేదు. అలా ఆ ఫంక్షన్‌ నన్ను ఆయనకి దూరం చేసింది' అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్‌
దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement